కృష్ణ

ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 31: ప్రజాసమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ అన్నారు. తన అధ్యక్షతన బుధవారం జరిగిన కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. అజెండాలో పొందుపర్చిన 73 అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా పట్టణంలో నిర్వహించిన అభివృద్ధి పనులు, బిల్లుల చెల్లింపు వివరాలు తెలియచేయాలని ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు చైర్మన్ బాబాప్రసాద్‌ను ప్రశ్నించారు. పుష్కరాల నేపథ్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు పారదర్శకంగా జరుగుతున్నాయని, బిల్లుల చెల్లింపులు ఇంకా జరగలేదన్నారు. ఏ సమస్య ఉన్నప్పటికీ నేరుగా తన దృష్టికి తీసుకురావాలని వైసిపి కౌన్సిలర్లకు చైర్మన్ సూచించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఇడి లైట్లు చాలావరకు వెలగడం లేదని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. దీనిపై స్పందించిన చైర్మన్ కొత్తగా ఏర్పాటు చేయడం వల్ల పలుచోట్ల చిన్నచిన్న సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్‌ల అద్దె పెంపు విషయమై సుదీర్ఘ చర్చ జరిగింది. అన్ని మున్సిపల్ కాంప్లెక్స్ షాపుల అద్దెను 33శాతం పెంచాలని అజెండాలో పొందుపర్చారు. ప్రతిపక్ష నేత అచ్చాబా మాట్లాడుతూ వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో 33శాతం పెంపు వ్యాపారులకు భారంగా మారే ప్రమాదం ఉందన్నారు. 15శాతం మాత్రమే పెంచాలని సూచించారు. ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో 50శాతం వరకు అద్దె పెంచిన దాఖలాలు ఉన్నాయని, ఈనేపథ్యంలో 15శాతం పెంచితే వ్యాపారుల నుండి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు. 50శాతం పెంచాలని చైర్మన్ బాబాప్రసాద్‌కు సూచించారు. ఇరుపక్షాల మధ్య జరిగిన చర్చ అనంతరం 50శాతం అద్దె పెంపునకు కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. పట్టణంలో జెండావీరుడు తోట నరసయ్య విగ్రహం ఏర్పాటుకు చైర్మన్ బాబాప్రసాద్ అధికార, ప్రతిపక్ష సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, 9వ వార్డు కౌన్సిలర్ కొట్టె వెంకట్రావ్, ప్రతిపక్ష నేత అచ్చాబా, ఉప నేత శీలం మారుతీరావులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని అనే్వషిస్తుందని చైర్మన్ తెలిపారు. కమిషనర్ జస్వంతరావు, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం, సభ్యులు బత్తిన దాస్, ఎం శేషుబాబు, కాగిత జవహర్, లంకా సూరిబాబు, అస్ఘర్, తదితరులు పాల్గొన్నారు.