కృష్ణ

పౌష్టికాహారంతో ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 28: గర్భిణు లు గర్భస్త సమయంలో వైద్యుల సూ చనలు పాటించి అవసరమైన పౌష్టికాహారం తీసుకోవటం ద్వారా ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలని జి ల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనురాధ అన్నారు. స్ర్తి, శిశు సంక్షేమశాఖ, కస్తూ రి పూర్ణచంద్రరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక ఎ ప్లస్ కనె్వన్షన్ నందు నిర్వహించిన సామూహిక సీమంతం కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ ముఖ్య అతిథిగా హాజరై గర్భిణులకు సీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. ము ఖ్యంగా గర్భిణులు ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనివ్వాలనే ఉద్దేశంతో పక్షం రోజులపాటు గర్భిణులకు సురక్షిత ప్రసవం, తల్లీబిడ్డల క్షేమంపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహించటం జరిగిందన్నారు. స్ర్తి, శిశు సంక్షేమశాఖ జాయింట్ డైరక్టర్ డా.వాణిశ్రీ మాట్లాడుతూ గర్భిణులు గర్భం ధరించిన నాటి నుండి వ్యక్తిగత పరిశుభ్రత పాటించటంతోపాటు అవసరమైన వైద్య పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించుకుని తగు జాగ్రత్తలను పాటించాలన్నారు. ప్రాజెక్టు డైరక్టర్ కృష్ణకుమారి మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశా ఖ సహకారంతో ప్రతి అంగన్‌వాడీ కేం ద్రం, ఉప అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులు వా రి కుటుంబ సభ్యులు, మహిళా స్వ యం సహాయక బృందాల సభ్యులు, ఆరోగ్య కార్యకర్తలతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించటంతోపాటు గర్భిణులకు రక్త, మూత్ర, బిపి, బరువు వంటి పరీక్షలు నిర్వహించి వారు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేయటం జరిగిందన్నారు.
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.ఆర్.నాగమల్లేశ్వరి మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యసేవలు అందించటం జరుగుతుందన్నా రు. గర్భిణులు ప్రభుత్వాసుపత్రుల్లోనే కాన్పులు జరిపించుకోవాలని సూచించారు. కస్తూరి పూర్ణచంద్రరావు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు వల్లూరి కస్తూరి మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ద్వారా జిల్లాలోని కంకిపాడు సిడిపిఓ పరిధిలో 247 అంగన్‌వాడీ కేంద్రాల్లో కేం ద్రానికి రూ.12,500ల విలువైన 10 కుర్చీలు, వాటర్ ఫిల్టర్, సీలింగ్ ప్యాన్, జంపఖానా, చాపలు, సాల్టర్ స్కేలు పంపిణీ చేశామన్నారు. సామూహిక సీమంతాల కార్యక్రమాన్ని పురస్కరించుకుని 700 మంది గర్భిణులకు ఒక్కొక్కరికి 750 రూపాయలు విలువగల చీర, పసుపు, కుంకుమ సామగ్రిని అందజేయటం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డా. గీతాభాయ్, డా. రత్నమాల, డా. నీరజ, కంకిపాడు సిడిపివో జి.ఉమాదేవి, కస్తూరి పూర్ణచంద్రరవు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ల్యాండ్ పూలింగ్ మోసం బట్టబయలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 28: రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోందని సిపిఎం రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కన్వీనర్ సిహెచ్ బాబూరావు విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ సమయంలో ఇచ్చిన హామీల అమల్లో జరుగుతున్న జాప్యాన్ని చూస్తుంటే ఆ సంస్థ మోసాలు బహిర్గతమవుతున్నాయని చెప్పారు. పూలింగ్ విధానాలు, రైతులకు ప్లాట్ల కేటాయింపు, నిబంధనలపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్ చేసారు. విజయవాడలోని సిపిఎం కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిఆర్‌డిఎ ప్రాంతంలోని రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీల్లో అసంతృప్తి పెరుగుతోందని చెప్పారు. వీరి అనుమానాలను నివృత్తి చేయటంలో ప్రభుత్వం గాని, సిఆర్‌డిఎ గానీ చొరవ చూపించకపోవటం శోచనీయమన్నారు. అసలు సిఆర్‌డిఎకు చట్టబద్ధతే లేదన్నారు. రాజధాని కోసం 33వేల ఎకరాల భూములను తీసుకునే సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందని ఆరోపించారు.
ఆందోళన కలిగిస్తున్న ప్లాట్ల సైజు
రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్ల సైజు ఆందోళనకు గురిచేస్తోందని బాబూరావు చెప్పారు. సీడ్ క్యాపిటల్, రాజధాని ప్రాంతంలో ప్లాట్ల సైజు వేర్వేరుగా ఉండటం, ఎక్కడ ఎంత ప్లాట్లు ఇస్తారో ఇంతవరకు స్పష్టత లేదన్నారు. దీనికితోడు తొలుత నిర్ధారించిన ప్లాట్ల సైజును తగ్గించి ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం వుందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్లాట్ సైజు కంటే రైతులకు అదనంగా ప్లాట్ రావాల్సి వుంటే అందుకు సిఆర్‌డిఎ నిర్ణయించిన మొత్తాన్ని వసూలుచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక్కడే సిఆర్‌డిఎ మోసం బట్టబయలవుతోందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వుండే భవనాలను కూల్చేస్తామని హెచ్చరికలు జారీచేయటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.
ప్రభుత్వ విధానాల వల్లే ధర పెరుగుదల
ప్రభుత్వ విధానాల వల్లే రాజధాని ప్రాంతంలో భూముల ధరలు, అద్దెలు పెరిగాయని బాబూరావు చెప్పారు. భూసమీకరణ సమయంలో రూ.10 లక్షల విలువైన భూముల విలువ రెండు కోట్లకు పెంచినట్లు స్వయంగా సిఎం చెప్పారనే విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడేమో అద్దెలు, భూముల ధరలు పెరగటంపై ఆయనే ఆందోళన వ్యక్తం చేయటం విస్మయానికి గురిచేస్తోందన్నారు.

దాళ్వాకు సాగునీటి విడుదలపై..
వారంలో స్పష్టత
* మంత్రి కొల్లు రవీంద్ర
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, నవంబర్ 28: దాళ్వాకు సాగునీటి విడుదలపై మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బందరు మండలం అరిసేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాగునీటి విషయమై కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నారు. వర్షాలు బాగా పడి ప్రాజెక్టులకు జలకళ వస్తే దాళ్వాకు తప్పకుండా నీరు ఇస్తామన్నారు. ఏదిఏమైనా మరో వారం రోజుల్లో దాళ్వాకు సాగునీటి విడుదలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. బందరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ప్రభుత్వానికి నివేదికలు అందించామన్నారు. ఇటీవల కురిసిన అధిక వర్షాల కారణంగా తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 252 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో ఐకెపి ద్వారా 133 కేంద్రాలు, పిఎసిఎస్‌ల ద్వారా 97 కేంద్రాలు, జిల్లా సహకార మార్కెటింగ్ శాఖ ద్వారా మరో 22 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని రైతులు లాభపడాలన్నారు. బందరు మండలంలో గత ఏడాది 65 లక్షల క్వింటాళ్ళ ధాన్యం కొనుగోలు చేసి రూ.90కోట్ల వ్యాపారం చేశామన్నారు. ఇందులో రూ.2కోట్లు డ్వాక్రా సంఘాలకు కమిషన్ అందినట్లు తెలిపారు. ఈ యేడాది కూడా పెద్దఎత్తున ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. మండలంలో ఇప్పటివరకు 175 క్వింటాళ్ళ మినుము విత్తనాలను సబ్సిడీపై అందజేశామని తెలిపారు. రెండవ విడతగా మరో 175 క్వింటాళ్ళు అందించేందుకు చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, ఎంపిడివో జివి సూర్యనారాయణ, తహశీల్దార్ నారదముని, టిడిపి మండల అధ్యక్షులు తలారి సోమశేఖర్, టిడిపి నాయకులు గోపు సత్యనారాయణ, కుంచే దుర్గాప్రసాద్, ఆర్ వేణుబాబు, రాజులపాటి సత్యనారాయణ పాల్గొన్నారు.
కనువిందు చేసిన
ఎన్‌సిసి క్యాడెట్ల విన్యాసాలు
గన్నవరం, నవంబర్ 28: గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలలో ఎన్‌సిసి క్యాడెట్ల గుర్రపు స్వారీ దృశ్యాలు కనులవిందు చేసాయి. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగే రాష్టప్రతి పరేడ్‌లో పాల్గొనే ఎన్‌సిసి క్యాడెట్లు, గుర్రాలను డిసెంబర్ 4 నుండి 12వరకు సికింద్రాబాద్‌లో ఎంపిక చేయనున్నారు. ఈ ఎంపికలో పాల్గొనేందుకు 3(ఎ) ఆంధ్రా వెటర్నరీ రెజిమెంట్ పరిధిలో మొత్తం 8 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. వీరు గన్నవరం వెటర్నరీ కళాశాల క్రీడా మైదానంలో శనివారం మధ్యాహ్నం పబ్లిక్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కల్నల్ ఎస్.్భగేల్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా క్యాడెట్లు గుర్రాలపై పలు రకాల విన్యాసాలు చేశారు. ఈ కార్యక్రమంలో క్యాడెట్‌లు బ్రూస్ జంప్, రోడ్ క్లోజ్, వర్టికల్ జంప్, వాల్ జంప్ పేర్లలో జంప్, ట్రిపుల్ జంప్, లాడర్ జంప్‌లు ప్రదర్శించారు. వీరిలో హేమంత్, ఆదిత్య, వెంకటేష్, సన, రవికుమార్, భరత్, రమ్య, కొండలరావులు ఉన్నారు.

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలి
* వైసిపి నేత వేదవ్యాస్
పెడన, నవంబర్ 28: తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర శాసనసభ మాజీ డెప్యూటీ స్పీకర్, వైసిపి నేత బూరగడ్డ వేదవ్యాస్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన నియోజకవర్గంలోని పెడన, బంటుమిల్లి, గూడూరు, తదితర ప్రాంతాల్లో పర్యటించి ఇటీవల కురిసిన అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈసందర్భంగా వేదవ్యాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రైతులు గత కొద్దికాలంగా అనేక కష్టాలు పడుతున్నారని, ఇందులో భాగంగానే సార్వా పంటను పూర్తిగా సాగుచేయలేక పోయారన్నారు. వేలాది ఎకరాల్లో నాట్లు వేయకపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వీరికి కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

జిల్లా మత్స్యశాఖలో
నూరుశాతం లక్ష్యాల సాధన భేష్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 28: రాష్ట్రంలో రెండింతల ప్రగతి సాధించడంలో వివిధ శాఖల పనితీరు సమన్వయంతో ముందుకు వెళ్లాలని అందుకనుగుణంగా ప్రణాళికలను రూపొందించాల్సి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులను, అధికారులను ఆదేశించారు. సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నా వాటి ప్రచారంపై తగిన విధంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లలేకపోతున్నారని ఆయన న్నారు.. డిసెంబర్ 14,15న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నామని ఆయన ప్రకటించారు.
ఈ సమావేశానికి ఆయా జిల్లాల స్థాయిలో రెండింతల ప్రగతికి సంబంధించి చేపట్టనున్న పూర్తి సమగ్ర సమాచారంతో హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మలేషియాకు చెందిన ‘పెమాండో’ చేపట్టిన కార్యాచరణ ప్రణాళికలను పూర్తిస్థాయిలో పరిశీలించడం జరిగిందని అందులో ఉత్తమమైన విధానాలను రాష్ట్రంలో అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాల, అధికారుల, మంత్రుల పనితీరును వారు చూపే ప్రతిభ ఆధారంగా రెడ్, గ్రీన్, ఎల్లో ర్యాంకులను కేటాయించి సమీక్షించడం జరుగుతుందని వారు ఏ ర్యాంకులో ఉండాలో నిర్ణయించుకోవాలని ముఖ్యమంత్రి చమత్కరించారు.
గ్రామీణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ అనుమంధ రంగాల, గృహ నిర్మాణం, విద్యుత్, రోడ్లు, భవనాల, ప్రణాళికా విభాగం, మానవ వనరులు, జలవనరులు, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ తదితర శాఖల రెండింతల ప్రగతిపై సమీక్షించారు.
రైతుల భూముల జోలికొస్తే ఖబడ్దార్!
* వ్యకాస నేత సుబ్బారావు
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, నవంబర్ 28: పరిశ్రమల పేరుతో రైతుల భూమి జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బందరు పోర్టు, కోస్టల్ కారిడార్ పేరుతో ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శనివారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాకు సిపిఐ, సిపిఐ(ఎంఎల్)తో పాటు ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ధర్నాలో సుబ్బారావు ప్రభు త్వం అనుసరిస్తున్న భూ విధానాలపై మండిపడ్డారు. పరిశ్రమల పేరుతో రైతులను నిలువునా మోసగించి వారి భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతపు భూసేకరణను జరగనివ్వమన్నారు. రైతులకు వామపక్షాలు అండగా ఉంటాయన్నారు. బందరు పోర్టుకు 33వేల ఎకరాల భూమి ఎందుకు అవసరమో పాలకులు చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ రైతులంతా ఐక్యంగా ఉండి ప్రభుత్వంపై పోరాడాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ రఘు మాట్లాడుతూ రైతులు ఏ మాత్రం మనోధైర్యాన్ని కోల్పోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, సిపిఐ(ఎంఎల్) నాయకుడు యద్దనపూడి సోని, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చౌటపల్లి రవి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి తోట కళ్యాణ్, వైసిపి నాయకులు షేక్ సలార్ దాదా, మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు.