కృష్ణ

ప్రతి రైతు 9.2్ఫరం ద్వారా అభ్యంతరాలు తెలపాలి:పేర్ని నాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 20: బందరు ఓడరేవు, పారిశ్రామికవాడకు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో 9.2్ఫరం ద్వారా అభ్యంతరాలు తెలియజేసేందుకు రైతులు సిద్ధం కావాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రభుత్వ మాజీ విప్ పేర్ని వెంకట్రామయ్య (నాని) కోరారు. మంగళవారం వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ పేరుతో వేలాది ఎకరాల రైతుల భూములను ప్రభుత్వం కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీన్ని భూపరిరక్షణ పోరాట సమితి అడ్డుకుంటుందన్నారు. ల్యాండ్ పూలింగ్ జీవోను సైతం ప్రభుత్వం అనుకూలంగా రూపొందించుకుందన్నారు. ఈ నెల 27 నుండి నిర్వహించే గ్రామసభల్లో అధికారులకు 9.2్ఫరం ద్వారా అభ్యంతరాల్ని తెలియచేయాలని రైతులను కోరారు. తమకెందుకులే అని మిన్నకుండిపోతే భూములను అప్పనంగా అప్పగించేందుకు రైతు సిద్ధపడినట్టేనని జీవోలో పొందుపర్చారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి రైతు అధికారులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు 9.2 ద్వారా తమ అభ్యంతరాన్ని తెలియచేయాలన్నారు. పోర్టు భూముల విషయంలో అధికార తెలుగుదేశం పార్టీ మొదటి నుండి దుర్మార్గపు చర్యలతో ముందుకెళుతోందన్నారు. గత ఏడాది ఆగస్టు 31న అర్ధరాత్రి పూట బలవంతపు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. ఆ తర్వాత రైతుల్లో వచ్చిన వ్యతిరేకతకు ల్యాండ్ పూలింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చి గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దుచేస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు రైతులను మోసగించారన్నారు. భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దుచేయకుండానే మళ్లీ ల్యాండ్ పూలింగ్‌కు నోటిఫికేషన్ ఇవ్వడం గర్హనీయమన్నారు. సుమారు 33వేల ఎకరాలకు ఇచ్చిన నోటిఫికేషన్ కారణంగా గ్రామాలకు గ్రామాలే ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులెవ్వరూ మనోధైర్యం కోల్పోకుండా ఉద్యమించేందుకు సంసిద్ధులు కావాలని నాని సూచించారు. విలేఖర్ల సమావేశంలో వైకాపా నాయకులు షేక్ సలార్ దాదా, షేక్ అచ్చాబా, బొర్రా విఠల్, లంకే నారాయణప్రసాద్, మాదివాడ రాము, మారుమూడి విక్టర్ ప్రసాద్, శీలం బాబ్జి, మేకల సుబ్బన్న, అస్ఘర్, ధనికొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.