కృష్ణ

నగరంలోని అక్రమ నిర్మాణాలపై కనె్నర్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 28: నగరంలో విచ్చలవిడిగా నిర్మితమైన అక్రమ భవనాలపై టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారులు స్పందించారు. ఉద్యోగ బాధ్యతల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ ఐదుగురు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఊహించని విధంగా అధికారులు ఊకమ్మడి సస్పెన్షన్ చర్యలు తీసుకొన్న వైనంపై విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో కలకలం రేపగా ఈచర్యలు ఇంతటితో ఆగుతాయా లేక భవిష్యత్తులో మరిన్ని సస్పెన్షన్లు ఉన్నాయాన్న ఆందోళనలతో టౌన్‌ప్లానింగ్ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. అక్రమ నిర్మాణాలపై వివిధ రూపాల్లో వచ్చిన అనేక ఆరోపణలపై స్పందించిన టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ రఘు కొద్దిరోజుల క్రితం టాస్క్ఫోర్స్ అధికారులతో క్షేత్ర స్థాయి పరిశీలనే కాకుండా ఆయా ఫైల్స్‌ను కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తదుపరి నివేదించిన రిపోర్టు ప్రకారం తొలి విడతగా ఐదుగురు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లపై వేటు వేశారు. ప్రస్తుతానికి వేటు పడిన వారిని పరిశీలిస్తే టిపిబిఓ -1 పరిధిలోని భవానీపురం, విధ్యాధరపురం, హెచ్‌బి కాలనీ, రోటరీ నగర్, తదితర ప్రాంతాలకు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే పి వెంకటేశ్వరరావు, టిపిబిఓ - 4 పరిధిలోని అజిత్‌సింగ్‌నగర్, పాయకాపురం, నందమూరినగర్, ప్రభకాలనీ, పాత పాయకాపురం, వాంబేకాలనీ తదితర ప్రాంతాలకు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే సిహెచ్ ఎస్ ప్రవీణ్, టిపిబిఓ -6 పరిధిలోని హనుమాన్‌పేట, గాంధీనగర్, ముత్యాలంపాడు, మధురానగర్ తదితర ప్రాంతాల్లో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే లక్ష్మీజ్యోతి, టిపిబిఓ -10 పరిధిలోని పటమట, మొగల్‌రాజపురం, కెపి నగర్, ఆటోనగర్, అయ్యప్పనగర్, సంజయ్‌గాంధీనగర్, అశోక్‌నగర్ తదితర ప్రాంతాలకు ఇన్‌చార్జ్ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే టిపిఎస్, టిపిఓ వి వెంకటకృష్ణ, టిపిబిఓ -12 పరిధిలోని కృష్ణలంక, భ్రమరాంబపురం, నెహ్రూనగర్, రాణిగారీ తోట, బాలాజీనగర్, రామలింగేశ్వరనగర్ తదితర ప్రాంతాలకు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే కె ఆశాలత లను సస్పెండ్ చేస్తూ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. టిపిబిఓ -4 ప్రవీణ్‌కుమార్ విఎంసి టౌన్‌ప్లానింగ్ నుంచి తాడేపలిగూడెం టౌన్‌ప్లానింగ్‌కు కొద్దిరోజుల క్రితం బదిలీ అయ్యారు. అయినా ఆయన ఇక్కడ చేసిన అవినీతి చర్యలపై సస్పెండ్ చేయడం గమనార్హం. ఏది ఏమైనా కంట్రీ ప్లానింగ్ అధికారులు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేయడం సాహసోపేతమైన చర్యగానే చెప్పవచ్చు.

సార్... రాము ఫైల్‌లో ఫోటోలు ఉన్నాయి...
రూ.6కోట్లతో దసరామహోత్సవాల ఏర్పాట్లు
* చివరి దశకు చేరుకున్న దసరా పనులు
ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 28: ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గమ్మ సన్నిధిలో దసరా మహోత్సవాలు ఈసంవత్సరం 11రోజులుపాటు వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం ఇవో ఎ సూర్యకుమారి సుమారు రూ.6కోట్ల వ్యయంతో భారీగా ఏర్పాట్లు చేయగా అవి చివరిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఆలయ ప్రాంగణం, ఉపాలయాలు, పరిసరాలు మొత్తం విద్యుద్దీకరణ చేశారు. కెనాల్‌రోడ్ వినాయకుని గుడి వద్ద నుండి ఇంద్రకీలాద్రి పై వరకు 3క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులందరూ విధిగా ఈక్యూమార్గం గుండానే కొండపైకి వెళ్లి అమ్మవారిని దర్శించుకొని శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయం మెట్ల మార్గం గుండా అర్జున వీధిలోనికి చేరుకోనే విధంగా ప్రత్యేక క్యూమార్గాలను ఏర్పాటు చేశారు. క్యూమార్గాల్లో ఉండే భక్తులు ఎండ, వానకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూప్ షామియాలను క్యూమార్గాలపైనే మొత్తం ఏర్పాటు చేశారు. అర్జున వీధిలోనికి వచ్చిన భక్తులు అమ్మవారి ప్రసాదాలను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక ప్రసాదాల కౌంటర్‌లను ఏర్పాటు చేశారు. దీనికితోడు అమ్మవారి ప్రసాదం స్వీకరించే భక్తులకు పెద్ద రేకుల షేడ్‌లో అన్నప్రసాదాన్ని స్వీకరించే విధంగా ఏర్పాట్లు చేశారు. రూ. 300 టిక్కెట్ కొనుగోలు చేసిన భక్తులనే అంతరాలయంలోనికి పంపేవిధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విఐపి కోసం ఈసంవత్సరం ప్రత్యేకంగా పున్నమిఘాట్ నుండి వాహనాలు ఏర్పాటు చేసి అక్కడ నుండి కొండపైకి వారిని తీసుకొచ్చి దర్శనం తర్వాత వారికి తిరిగి పున్నమి ఘాట్ వద్ద దింపే విధంగా ఇవో సూర్యకుమారి ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. దేవాదాయ ధర్మాదాయశాఖకు చెందిన సుమారు 2వేల మంది ఉద్యోగులు, పోలీసులు, వివిధ కళాశాలకు చెందిన యన్‌యస్‌యస్ విద్యార్థులు, పలు సేవ సంస్థల కార్యకర్తల సేవలను భక్తుల కోసం అధికారులు వినియోగించుకోనున్నారు. బెంగుళూరు, కడియం పట్టణాల నుంచి ప్రత్యేకంగా పుష్పాలను తెప్పించి అలంకరించనున్నారు. కేశఖండనశాలను ఈసంవత్సరం ప్రత్యేకంగా నగరపాలక సంస్థ ఎదుట ఉన్న ఖాళీ ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీనికితోడు దసరామహోత్సవాలు సందర్భంగా అమ్మవారికి వివిధ రకాలైన నైవేథ్యాలు తయారు చేయించి వాటిని అమ్మవారికి సమర్పించనున్నారు. కాగా ఇప్పటి వరకు దసరామహోత్సవాలు సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను ఎక్కడ నిర్వహించనున్నారో అనే విషయం ఇప్పటి వరకు దుర్గగుడి అధికారులు గుప్తంగా ఉంచారు.