కృష్ణ

1 నుండి నగదు రహిత నిత్యావసరాల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 28: జిల్లాలో అక్టోబర్ 1నుండి 400 చౌక ధరల దుకాణాల్లో నగదు రహితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో బుధవారం జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు జన్‌ధన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం విధానంపై చౌకధరల దుకాణాల డీలర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రా బ్యాంక్ ద్వారా 400 చౌకధరల దుకాణాలలో దేశంలోనే తొలిసారిగా మన జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా జన్‌ధన్ పిడిఎస్ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ విధానాన్ని అమలు చేయనున్నామన్నారు. దీనిపై డీలర్లు పూర్తి అవగాహన కలిగించుకుని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అక్టోబర్ 1 నుండి నగదు రహితంగా కార్డుదారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు డీలర్లు సిద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ కోరారు. తదనంతరం జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,160 చౌకధరల దుకాణాల్లో అమలు చేయనున్నామని ఆయన వివరించారు. నగదు రహిత నిత్యావసర వస్తువుల సరఫరా నిర్వహించే డీలర్లకు ఆంధ్రా బ్యాంక్ తరపున ప్రతీ లావాదేవీకి రూపాయి చొప్పున ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు దీంతోపాటు డీలర్లు బిజినెస్ కరస్పాండెంట్లుగా వ్వవహరించేందుకు అవకాశం ఉంటుందని ఆంధ్రాబ్యాంక్ అధికారులు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. లబ్ధిదారుని ఖాతాకు నగదు జమ అయిన వెంటనే డీలర్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుందని, అమలులో ఇబ్బందులు ఎదురైతే ఆంధ్రా బ్యాంక్ వారు ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్‌కు సంప్రదించవచ్చన్నారు. డీలర్లు తమ ఆదాయ వనరులను పెంచుకోవటానికి అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటికే ఇ-పోస్ విధానంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామని దీనిపై ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలతోపాటు ప్రపంచ బ్యాంక్ ఆసక్తి కనపరుస్తున్నాయని, తద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పథకాలకు గుర్తింపు లభించటం మనకు గర్వకారణమన్నారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వి రవికిరణ్, ఆంధ్రా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వైఆర్ శేషగిరిరావు, డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణారావు, సహాయ పౌర సరఫరాల అధికారులు పి కోమలిపద్మ, ఎ ఉదయభాస్కర్, చౌకధర దుకాణాల డీలర్లు పాల్గొన్నారు.

ప్యాకేజీలు కాదు... హోదాయే కావాలి

విజయవాడ, సెప్టెంబర్ 28: అస్తవ్యస్త విభజన వల్ల పూర్తిగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్యాకేజీలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కావని, ప్రత్యేక హోదాయే కావాలని హోదాపై అవగాహన సదస్సు డిమాండ్ చేసింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ప్రజలను చైతన్యపరచి కలిసి పోరాడితేనే సాధ్యమవుతుందని పిలుపునిచ్చింది. నాడు ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటించిన ప్రత్యేక హోదా అంశంపై మళ్లీ ఆందోళన ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ఏపియుడబ్ల్యుజె కృష్ణా అర్బన్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఈ సదస్సు జరిగింది. ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ఎంతో నష్టపోయిన రాష్ట్రానికి హోదా ఇవ్వడానికి కేంద్రం అనేక కుంటిసాకులు చెబుతున్నదని, రాష్ట్రానికి హోదా తెస్తామని ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టి చివరకు హోదా అనే ఊసెత్తకుండా వెనకడుకు వేస్తున్న చంద్రబాబు పాత్ర ఏమిటో ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. హోదా వల్లనే ఉత్తరాఖండ్ ఎంతో అభివృద్ధి చెందిందని నాడు పార్లమెంట్‌లో స్వయంగా ప్రభుత్వం చేసిన ప్రకటనను నేడు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరిలు కొట్టిపారేసి ప్రత్యేక సాయాన్ని సమర్థిస్తున్నారని విమర్శించారు. నాగార్జున యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సి నరసింహారావు మాట్లాడుతూ అరుణ్‌జైట్లీ కొత్త వాదనలు, పేదరికపు మాటలతో అవాస్తవమైన ప్రకటనలు చేస్తూ రాష్ట్రానికి హోదా లేకుండా చేయడం దారుణమన్నారు. స్టెల్లా కాలేజీ విశ్రాంత తెలుగు విభాగాధిపతి డాక్టర్ రెజీనా మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర పాలకులపై ఉందన్నారు. తొలుత ఐజెఎ ఉపాధ్యక్షులు ఎ ఆంజనేయులు సదస్సు లక్ష్యాన్ని వివరించారు. ప్రత్యేక హోదా కోసం జరిగే పోరాటాల్లో జర్నలిస్టులు ముమ్ముందు కూడా పాల్గొనగలరని అన్నారు. యూనియన్ ఉపాధ్యక్షుడు డిడి నాగరాజు అధ్యక్షత వహించిన ఈ సదస్సులో ఎస్‌కె బాబు మోడరేటర్‌గా వ్యవహరించారు. కార్యదర్శి వెంకటేశ్వరరావు, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.