కృష్ణ

మాకో న్యాయం.. ప్రభుత్వానికో న్యాయమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, అక్టోబర్ 26: ‘మినుము విత్తనాల ధరపై ప్రభుత్వానికో న్యాయం.. రైతులకో న్యాయమా?’ అని కోసూరు రైతులు వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మొవ్వ మండలం కోసూరు, భట్లపెనుమర్రు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు చిందా వీర వెంకట నాగేశ్వరరాజు, కొడాలి దయాకర్ అధ్యక్షతన జరిగిన సమగ్ర పోషక యాజమాన్యం - సూక్ష్మ పోషక ఆవశ్యకత అనే అంశంపై రైతు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొవ్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎడిఎ ముప్పాళ శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ రబీలో ఆరుతడి పంటగా సాగుచేసే మినుముకు పియు 31, ఎల్‌బిజి 752 రకాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కిలో రూ.150లలో రూ.50 సబ్సిడీ పోను రూ.100కు అమ్మకానికి సిద్ధం చేస్తున్నట్లు చెప్పటంతో గోగినేని నరేంద్ర, తదితర రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కిలో మినుములకు రూ.45 గరిష్ట ధరగా నిర్ణయించిన ప్రభుత్వం దానిపై ఖర్చులకు కిలోకు రూ.10 వంతున వేసుకుని రూ.55కి అమ్మాల్సి వుండగా ఏకంగా రూ.100కు అమ్మటమేమిటని ప్రశ్నించారు. రూ.80ల వంతున ఒక్క కోసూరు గ్రామంలోనే 10 లారీల సరుకు రైతులందరి వద్ద సిద్ధంగా ఉందని, ఆ ధరకు మీరు కొంటారా? అని నిలదీశారు. దీనిపై ఎడిఎ స్పందిస్తూ ప్రభుత్వమిచ్చిన సమాచారాన్ని తాము తెలిపామనటంతో తాము ప్రశ్నించిన విషయాన్ని కూడా ప్రభుత్వానికి నివేదించాలని రైతులు సూచించారు. రైతులు అధిక ధరలకు మినుములు అమ్ముతున్నారంటూ గోదాములపై దాడులు చేసి ధరలు తగ్గించేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం కిలో ధర రూ.150గా నిర్ణయించి సబ్సిడీపై రూ.100కు సరఫరా చేస్తామని ప్రకటించటం విడ్డూరంగా ఉందని నరేంద్ర, తదితర రైతులు ఎద్దేవా చేశారు. ఎంపిపి కిలారపు మంగమ్మ, ఇన్‌ఛార్జి ఎఓ బోలెం అనంతలక్ష్మి, ఆత్మ ఎస్‌ఎంఎస్ కంచర్ల శివరాం, ఎంపిఇఓలు దగాని సృజన, నృపేన్ చక్రవర్తి, రాజు, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

సాగునీరిచ్చి రైతుల్ని ఆదుకోండి
వత్సవాయి, అక్టోబర్ 26: రాష్ట్రంలో రైతులను వంచించే ప్రభుత్వం నడుస్తోందని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను విమర్శించారు. మండలంలోని మక్కపేట గ్రామంలో స్థానిక నేత కనకాల రమేష్ ఇంట్లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు సంక్షేమం అని చెప్పుకుంటున్న తెలుగుదేశం ప్రభుత్వం రైతులను వంచిస్తూ పరిపాలన సాగిస్తోందన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో నందిగామ డివిఆర్ బ్రాంచి కెనాల్, దాములూరు బ్రాంచి కెనాల్ కింద లక్షా 15 వేల ఎకరాలలో పత్తి, మిర్చి సాగు చేస్తున్నారన్నారు. దిగుబడి రావాలంటే సాగర్ నీరు విడుదల కావాలన్నారు. అయితే రెండేళ్లుగా సాగర్ నీరు సక్రమంగా రాకపోవడంతో కాలువ ఆయకట్టు రైతులు అనేక కష్టనష్టాలతో పంటలు పండిస్తూ తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. సాగునీరు అందక రైతులు ఎకరాకు రూ.70వేల వరకూ నష్టపోతున్నారన్నారు. రైతుల పక్షాన ఉంటామని చెప్పుకుంటున్న మంత్రి ఉమామహేశ్వరరావు ప్రాజెక్టుల సందర్శన చేస్తూ యాత్రలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. పక్షం రోజుల్లో నీరు విడుదల చేయించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, కౌన్సిలర్ ఇంటూరి చిన్నా, మండల పార్టీ అధ్యక్షుడు గాదెల రామారావు తదితరులు పాల్గొన్నారు.