కృష్ణ

రైతులకు మంచి ప్యాకేజీ ఇస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 24: బందరు పోర్టుకు భూసమీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టామని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జనచైతన్య యాత్రల్లో భాగంగా గురువారం ఆయన మండల పరిధిలోని బుద్దాలపాలెం, బొర్రపోతుపాలెం, హుస్సేన్‌పాలెం, చిట్టిపాలెం, గంటలమ్మపాలెం, అరిసేపల్లి, సుల్తానగరం, ఎస్‌ఎన్ గొల్లపాలెం, సీతారామపురం గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈసందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ పోర్టు, పరిశ్రమల స్థాపనకు స్వచ్ఛందంగా భూములు ఇచ్చే రైతులకు ప్రభుత్వం అద్భుతమైన ప్యాకేజీ ప్రకటించిందన్నారు. ప్యాకేజీ వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించేందుకు డిసెంబర్ 1 నుండి గ్రామాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రతిపక్షాలు అడ్డుకోవటం విచారకరమన్నారు. త్వరలోనే పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదన్నారు. తమ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సైతం పక్కనపెట్టి ఒకపక్క అభివృద్ధి, మరోపక్క ప్రజా సంక్షేమ పథకాలను సమర్థంగా అమలుచేస్తూ ప్రజాభిమానం పొందుతున్నారన్నారు. బందరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని, ఇందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. రెండ్రోజుల్లో డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. జనచైతన్య యాత్రల్లో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. చిట్టిపాలెం గ్రామంలో రూ.36.90లక్షలతో, భైరాగిపాలెంలో రూ.10లక్షలతో, బుద్ధాలపాలెంలో రూ.5.60లక్షలతో, బొర్రపోతుపాలెంలో రూ.9లక్షలతో, హుస్సేన్‌పాలెంలో రూ.6.50లక్షలతో, అరిసేపల్లిలో రూ.10లక్షలతో, ఎస్‌ఎన్ గొల్లపాలెంలో రూ.7.5లక్షలతో, సీతారామపురంలో రూ.6.10లక్షలతో సిసిరోడ్ల నిర్మాణ పనులకు మంత్రి రవీంద్ర శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, టిడిపి మండల అధ్యక్షులు తలారి సోమశేఖర్, కుంచే నాని, రామదేని వేణుబాబు, రాజులపాటి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.