కృష్ణ

అత్యంత వైభవంగా మహారుద్రాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 27: శ్రీ కన్యకాపరమేశ్వరి సేవా సమితి భవానీపురం శాఖ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్ధం ఆదివారం మహారుద్రాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. పున్నమిఘాట్ సమీపంలో జరిగిన ఈ రుద్రాభిషేకంలో శివునికి ప్రీతిపాత్రమైన ద్రవ్యములతో పుణ్యదీపాలాలతో శంఖడమారుక నాదాలతో రుద్రానికి మహారుద్రాభిషేకం, మహాభాస్మాభిషేకం వేలాది భక్తుల నడుమ విశేషంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు వి ఉపేంద్ర, ప్రధాన కార్యదర్శి తవ్వారాము, కోశాధికారి సామ వెంకట సుబ్బరావు, ఉపాధ్యక్షులు వీర రాఘవ ఉదయ్‌కుమార్ పర్యవేక్షించారు. ఈ మహారుద్రాభిషేకంలో పాల్గొన్న భక్తులకు పూజాసామగ్రి ఉచితంగా అందజేశారు. విశేషంగా ప్రత్యేక అలంకారాలు శివుని విగ్రహం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. కుటుంబ సభ్యులతో భక్తులు పాల్గొని విశేషంగా పాల్గొని పూజలు చేశారు.

నేడు భారత్‌బంద్
* పెద్ద నోట్ల రద్దుపై ప్రతిపక్షాల కనె్నర్ర
* ఎవరి దారిలో వారి నిరసనలు
* సామాన్యులకు మరిన్ని కష్టాలు
బెంజసర్కిల్, నవంబర్ 27: దేశ వ్యాప్తంగా ఉన్న నల్లధనాన్ని వెలికి తీసే క్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు కనె్నర్ర చేస్తున్నాయి. పెద్దనోట్ల రద్దుతో నిరుపేద, మధ్యతగతి వర్గాల వారు ఎంతో నష్టపోతూన్నారని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు సైతం నష్టం కలిగిస్తోందంటూ విపక్షాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ముఖ్యంగా పది వామపక్షాలు ఏకతాటిపైకి వచ్చి సోమవారం భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలనే తలపుంతో వ్యహరచన చేస్తుంటే మరో పక్క భారత్ బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొనని రాష్ట్రంలోని కాంగ్రెస్ మరియు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి దారిలో వారు ఆందోళనకు సిద్ధమైయ్యారు. అయితే ఇప్పటికే పెద్దనోట్లు రద్దు చేసి 20 రోజుల గడిచిన క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు ఈ బంద్‌తో మరిన్ని కష్టాలు తప్పేటట్టు లేదు. నగరంలోని పది వామపక్షాలకు చెందిన నేతలు బంద్‌ను విజయవంతం చేసే క్రమంలో నగరంలో ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు తెలిపేందుకు సిద్ధమైయ్యారు. అలాగే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకు అసౌకర్యం కలుగకుండా నిరసన నిర్వహించనుంది. అయితే నగరంలో నిర్వహించే భారత్ బంద్ దృష్ట్యా పోలీసు వర్గాలు బందోబస్త్‌ను మరింత కట్టుదిట్టం చేశారు. బంద్ సందర్భంగా నగరంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలుసు ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పటికే బ్యాంకులకు శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడం, ఎటిఎంలు కొన్ని రోజులుగా పని చేయకపోవడంతో ప్రజలు సోమవారం బ్యాంకులకు పెద్ద ఎత్తున రానున్నారు. బంద్ ప్రభావంతో బ్యాంకులు పని చేయని పక్షంలో ప్రజలు మరింత ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు.