కృష్ణ

22 నుంచి శ్రీ లక్ష్మీ పౌండరీక యజ్ఞ సహిత నిత్యోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్), జనవరి 18: శ్రీ లక్ష్మీ శ్రీనివాస వాసవీ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 28వ తేదీ శనివారం వరకు శ్రీ లక్ష్మీ పౌండరీక యజ్ఞసహిత శ్రీవారి నిత్యోత్సవాలు స్వరాజ్య మైదానంలో నిర్వహిస్తున్నట్లు గరిమెళ్ల నానయ్య చౌదరి తెలిపారు. బుధవారం సాయంత్రం అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి రోజు సాయంత్రం 5 గంటలకు యాగశాలలో ఏకాదశ కుండాత్మక శ్రీ లక్ష్మీ పౌండరీక యజ్ఞం ప్రారంభమవుతుందని ఆ ఏడు రోజులు ఉదయం 11 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రతి రోజు రాత్రి 8 గంటలకు తిరుమాడ వీధి ఉత్సవం, చిన్న, పెద్ద శేష, సర్వభూపాల ముత్యపు మందిరి, గరుడ, హనుమంత వాహనాలపై జరుగుతుందని అన్నారు. నిత్యం జరిగే శ్రీవారి కల్యాణోత్సవంలో రోజుకు రెండవ వందల మంది దంపతులు పీటలపై కూర్చొని చేయించుకోవటానికి, భగవదాశీస్సులు పొందటానికి అవకాశముందని ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదని అన్నారు. రోజుకు పదివేల మందికి అన్న ప్రసాద వితరణ జరుగుతుందని తెలిపా. సమితి గౌరవాధ్యక్షురాలు మానేపల్లి లక్ష్మీకుమారి మాట్లాడుతూ మొదటి రోజు నుంచి వరుసగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, శ్రీ దత్త విజయానందతీర్థ స్వామి, శ్రీ విద్యా శంకర భారతీ స్వామి, శ్రీమాన్ చిన్న జియ్యంగార్, శ్రీ విద్యారణ్య భారతి స్వామి, శ్రీమాన్ త్రిదండి అష్టాక్షరి సంపత్కుమార్ రామానుజ జియర్ స్వామి, శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి దివ్య, భవ్యమైన ఆశీస్సులు అందిస్తారని, సాయంత్రం, రాత్రి సమయాలలో ప్రముఖ ఆధ్యాత్మిక ధార్మిక వేత్తలచే ధార్మిక, ఆధ్యాత్మిక ప్రవచనాలు జరుగుతాయని అదేవిధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ విలేఖర్ల సమావేశంలో సమితి అధ్యక్ష కార్యదర్శులు దూపుగుంట్ల శ్రీనివాసరావు, మామిడి లక్ష్మీ వెంకట కృష్ణారావు, మానేపల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ లక్ష్యాలు వేగంగా సాధించాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 18: రాష్టవ్య్రాప్తంగా 13 జిల్లాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనులను మరింత వేగంగా పూర్తిచేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని, అందుకవసరమైన అన్ని చర్యలు తక్షణమే చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి రామాంజనేయులు ఉన్నతాధికారులను ఆదేశించారు. విజయవాడ కమిషనర్ కార్యాలయంలో పథకం అమలు తీరు, వేతన, మెటీరియల్ చెల్లింపులు, తదితర అంశాలపై బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. లేబర్ బడ్జెట్ 17-18 తయారీలో వెనుకబడిన గ్రామ పంచాయతీలను గుర్తించి వెనుకబాటుకు కారణాలు తెలుసుకొని సత్వరమే పూర్తిచేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి బుధవారం, శనివారం టెలి, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి అన్ని గ్రామ పంచాయతీల లేబర్ బడ్జెట్ల తయారీని స్వయంగా సమీక్షిస్తానన్నారు. ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పంట సంజీవని, వర్మికంపోస్ట్, అంగన్‌వాడీ భవన నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్లు, సిమెంట్ రోడ్లకు సంబంధించిన ఆమోదాలిచ్చి, పనులు పూర్తయ్యేలా ప్రతిరోజు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ప్రగతిని సమీక్షించాలన్నారు. తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు కమిషనర్ సూచించారు. ముఖ్యంగా 2700 అంగన్‌వాడీ భవనాల పనులను వేగవంతం చేయాలని, ఉపాధి హామీ పనులతో గ్రామీణులను పేదరికం నుంచి బయటకు తెచ్చే అంత్యోదయ కార్యక్రమాన్ని కనీసం 1000 గ్రామ పంచాయతీల్లో అమలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని రామాంజనేయులు తెలిపారు. వేతనాల చెల్లింపులను సమీక్షిస్తూ 100 శాతం ఆధార్ చెల్లింపులు చేయాలని, అన్ని వేతన చెల్లింపులను పోస్ట్ఫాసుల నుంచి బ్యాంకులకు మళ్లించాలని, ప్రతి బుధ, శనివారాల్లో ఏ పనికి ఎంత చెల్లింపులు జరిగాయి, ఎంత చెల్లించాలనేది నివేదికలు తెప్పించుకోవాలని అధికారులను కోరారు. చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు త్వరగా విడుదలయ్యేందుకు కృషిచేయాలని, అదనపు నిధులున్న జిల్లాల నుంచి మొత్తాలను అప్పు రూపంలో కొరత ఉన్న జిల్లాలకు మళ్లించాలని అధికారులను ఆదేశించారు. రూరల్ ఎస్‌ఎస్‌ఆర్ ఆధారంగా వేతన ధరలను రూపొందించి ఫిబ్రవరి 15లోపు నివేదికను సమర్పించాలని, వేతన మార్పులు పేదల ఆశలకు అనుగుణంగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. ఎప్పటికప్పుడు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడానికి ఒక ప్రణాళికను రూపొందించాలని, మిషన్ వాటర్ కన్జర్వేషన్‌ను పటిష్ఠంగా అమలుపర్చి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. ఇంతవరకు ఉపాధి హామీ పనులు అసలు చేపట్టిని గ్రామ పంచాయతీలను గుర్తించి పనులు ప్రారంభించకపోవడానికి కారణాలు తెలుసుకుని, నివేదికలు తెప్పించుకుని వాటిని 20న జరగనున్న పిడి, డ్వామాల సమీక్ష సమావేశంలో చర్చించాలని కమిషనర్ రామాంజనేయులు వివరించారు.

స్కీం వర్కర్ల సమ్మె జయప్రదం చేయాలి
పాతబస్తీ, జనవరి 18: రానున్న 2017-18 బడ్జెట్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు నిధులు పెంచాలని, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ తేదీన దేశ వ్యాప్తంగా జరగనున్న సమ్మెలో స్కీం వర్కర్లంతా పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యాక్షురాలు కె.స్వరూపరాణి పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గ ఏరియాలోని మధ్యాహ్న భోజన పథక ఏజెన్సీల కార్మికులు, ఐసిడిఎస్ సెక్టార్ పరిధిలోని అంగన్‌వాడీ కార్మికులు, హెల్పర్లు, మినీ హెల్పర్లతో సమావేశాన్ని వించిపేటలోని గాంధీబొమ్మ సెంటర్‌లో గల ఉర్దూ స్కూల్‌లో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న స్వరూపరాణి మాట్లాడుతూ కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఇఎస్‌ఐ, ప్రమాదబీమా, పెన్షన్ వంటి కనీస సౌకర్యాలకై 60 రంగాలకు చెందిన స్కీం వర్కర్లు 20వ తేదీన సమ్మెలో పాల్గొనున్నట్లు వివరించారు.