కృష్ణ

అంకితభావం, పట్టుదలే విద్యార్ధి విజయానికి సోపానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, జనవరి 28: ఆంధ్ర లయోలా కశాళాల 63వ వార్షికోత్సవ వేడుకలు శనివారం సాయంత్రం కళాశాల ప్రాంగణంలో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన సుప్రీం కోర్టు జడ్జీ ఎల్.నాగేశ్వరరావు మాట్లాడుతూ అన్ని విద్యా సంస్ధలు విద్యార్ధులకు విద్యను బోధిస్తాయని, కానీ ఆంధ్ర లయోలా కళాశాల మాత్రం విలువులను బోధిస్తాయని అన్నారు. తాము లయోలా పూర్వ విద్యార్ధులు కావటం గర్వకారణంగా వుందన్నారు. భారతదేశంలో యువత ఎక్కువుగా వున్నారని తెలిపారు. విద్యార్ధులు అంకితభావం, పట్టుదల, కష్టపడే మనస్ధత్వం అలవర్చుకోవాలని అప్పుడే వారి విజయానికి తొలిమెట్టు అవుతుందన్నారు. యువత అనవసర విషయాల జోలికి వెళ్ళకుండా వారి భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. గౌరవ అతిధిగా హాజరైన మరో జడ్జీ జి.్భవానీ ప్రసాద్ మాట్లాడుతూ యువతీ యువకులు సమాజిక బాధ్యతతో మెలగాలన్నారు. విలువలు బాధ్యతలు అలవాటు చేసుకోవాలని తెలిపారు. ఈ దేశ భవిష్యత్ యువత చేతిలోనే వుంది కాబట్టి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు. విద్యార్ధి దశ నుండే విద్యార్ధులు సేవభావం అలవర్చుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ జిఏపి కిషోర్ మాట్లాడుతు లయోలా కశాళాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 4464 మంది విద్యార్ధులు, 29 రాష్ట్రాల నుంచి 29 భాషలు మాట్లాడే విద్యార్ధులు వుండటం ద్వారా తమ కళాశాల భారతదేశానికే ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పవచ్చన్నారు. అనంతరం వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ ఫాదర్ డి.రవిశేఖర్, కరస్పాడెంట్ ఫాదర్ రాజు, ఉపాధ్యాయులు గుమ్మా సాంబశివరావు, సహాయ భాస్కర్, ఆరోక్యస్వామి తదితరులు పాల్గొన్నారు.