కృష్ణ

రూ.65కోట్లతో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుకు ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 4: పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో మెరుగుపర్చేందుకు రూ.65కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపామని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక 42వ వార్డు గుమస్తాల కాలనీలో రూ.50లక్షల వ్యయంతో నిర్మించనున్న డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్ నిర్మాణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ఎంతో కాలంగా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు 42, 38, 1వ వార్డుల్లో మంచినీటి సమస్య పరిష్కారానికి మందులగూడెంలో రూ.3కోట్లతో రిజర్వాయర్ నిర్మాణాన్ని త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నిర్మాణానికి ముందుగా రూ.50లక్షలతో డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. పట్టణంలో రహదారులు, మంచినీరు, వీధి దీపాలు తదితర వౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తరకటూరు నుండి బందరు వరకు పైప్‌లైన్ నిర్మాణానికి మంజూరైన రూ.5కోట్లు గత ప్రభుత్వం వేరే పనులకు మళ్లించడం వల్ల నిర్మాణ వ్యయం నేడు రూ.25కోట్లకు పెరిగిందన్నారు. అమృత్ స్కీం కింద రూ.36కోట్లతో పట్టణంలో పలు ప్రాంతాల్లో రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. రూ.19.50కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులలో పలు రహదారులు నిర్మిస్తున్నామని, వీటిలో రూ.2.50కోట్లతో హౌసింగ్ బోర్డు వెనుక వైపు చిట్టిపాలెం రోడ్డు నుండి విజయవాడ రోడ్డును కలుపుతూ రహదారి పనులు త్వరలో ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ఫ్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం (చంటి), ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, ప్రతిపక్ష నాయకుడు అచ్చాబా, కౌన్సిలర్లు ధనికొండ నాగమల్లేశ్వరి, బత్తిన దాస్, నారగాని ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.