కృష్ణ

ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఏప్రిల్ 7: ఫిరాయింపుదారులకు మంత్రిపదవులిచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పాతరేశారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించండంటూ వైసీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం మైలవరంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా నేతలు, కార్యకర్తలు చంద్రబాబు తీరుపై నిరసన గళం వినిపించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుండి నినాదాలు చేసుకుంటూ నిరసన ర్యాలీ మైలవరం పురవీధులలో తిరిగింది. అనంతరం స్థానిక బోసుబొమ్మ సెంటరులో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయి ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ధర్నానుద్దేశించి జోగి రమేష్ మాట్లాడుతూ ఏప్రిల్ 2 ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో సమర్థులైన ఎమ్మెల్యేలు లేనట్లు వైసీపీ నుండి వలస వచ్చిన వారికి నలుగురికి మంత్రి పదవులిచ్చి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. తెలంగాణలో తలసానికి మంత్రి పదవిపై చంద్రబాబు వైఖరిని ప్రస్తావిస్తూ తనకొక నీతి, మరొకరికి ఒక నీతా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యవాదులంతా ముక్త కంఠంతో బాబు చర్యలను ఖండించాలన్నారు. ఈసమయంలో చంద్రబాబు ఆనాడు మాట్లాడిన మాటలను ఆడియో ద్వారా వినిపించారు. బాబు నియంతృత్వ ధోరణిపై ఆ పార్టీలోని సీనియర్ ఎమ్మెల్యేలే ఆయనకు ఎదురుతిరిగితే వారిని బ్లాక్‌మెయిల్ చేసి నోళ్లు మూయిస్తున్నాడని జోగి విమర్శించారు. మరోవైపు పట్టిసీమ పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుని పంచుకున్నారని స్థానిక మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఉద్దేశించి ఆరోపించారు. ఈవిషయాన్ని స్వయంగా కాగ్ నివేదిక బయటపెట్టిన విషయాన్ని జోగి గుర్తుచేశారు. మంత్రిగా గడచిన మూడున్నరేళ్ళలో మంత్రి ఉమ ఈనియోజకవర్గంలో ఒక్క పరిశ్రమ గానీ, ఒక కొత్త పథకాన్ని గానీ తెచ్చారా అని ప్రశ్నించారు. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నది వైసీపీ మంత్రివర్గం అని ఎద్దేవా చేశారు. బాబు ప్రభుత్వం పట్ల ప్రజలు విసిగి పోయారన్నారు. రాబోయేది జగన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు పామర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో పార్టీ నేతలు పామర్తి వెంకట నారాయణ, వేములకొండ తిరుపతిరావు, కాజా బ్రహ్మయ్య, శివారెడ్డి, నాగిరెడ్డి, అప్పిడి సత్యనారాయణరెడ్డి తదితరులు ప్రసంగించగా నేతలు అబ్దుల్ రహీమ్, కరీమ్, నాగులూరి దుర్గాప్రసాద్, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.