కృష్ణ

గౌతు లచ్చన్న జీవితం ఆదర్శప్రాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 19: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని రాష్ట్ర న్యాయ, క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు పిలుపునిచ్చారు. గౌతు లచ్ఛన్న వర్ధంతి సందర్భంగా బుధవారం స్థానిక బస్టాండ్ సెంటరులోని లచ్చన్న నిలువెత్తు కాంస్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడుగు బలహీన వర్గాల హక్కుల కొరకు నిరంతరం పోరాడిన వ్యక్తి లచ్చన్న అన్నారు. తడ నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర ద్వారా యువతను మేల్కొల్పిన ఆయన జీవితం భవిష్యత్తు తరాలకు ఆదర్శమన్నారు. అవినీతిపులికి సింహస్వప్నం లచ్చన్న అన్నారు. ఆయన హయాంలో ఏర్పాటైన మండలి కమిటీ సిఫార్సులు ఇప్పుడు కూడా అమలవుతున్నాయన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు, బిసి నాయకుడు కొనకళ్ల జగన్నాధరావు(బుల్లయ్య), మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసి చైర్మన్ గోపు సత్యనారాయణ, టిడిపి సీనియర్ నాయకుడు బూరగడ్డ రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

చిరుధాన్యాలతోనే పౌష్టికాహారం
కూచిపూడి, ఏప్రిల్ 19: చిరు ధాన్యాల పౌష్టికాహార విలువలను గ్రామగ్రామాన మహిళలకు వివరించి ఆరోగ్యవంతమైన సమాజ ఆవిష్కరణకు సమష్టిగా కృషి చేయాలని పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన కోరారు. యునెసెఫ్ ఆఫ్ ఆధ్వర్యంలో గత ఏడాది రాష్ట్రంలో నిర్వహించిన మహిళల ఆరోగ్య పరిస్థితిపై రూపొందించిన సమాచారంలో రాష్ట్రంలో 52శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్న విషయం వెల్లడైందన్నారు. ఈ సమాచారాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చిరుధాన్యాలతో కూడిన పౌష్టికాహారాన్ని తయారుచేసే విధానాలపై విస్తృత ప్రచారం చేయాలని ఆయన సూచించారు. దీనిపై జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ జిల్లాలో ఆహార జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఇందులో భాగంగా బుధవారం మొవ్వ ఎంపిడిఓ కార్యాలయంలో మొవ్వ ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంలు, మహిళా ప్రజాప్రతినిధులతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిరు ధాన్యాలతో తయారు చేసే రుచికరమైన వంటకాలు, వాటి పౌష్టిక విలువలను వివరించారు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన డాక్టర్ గ్రంధి మానస, డాక్టర్ శ్రీరామలావణ్య పౌష్టికాహార విలువలతో కూడిన చిరు ధాన్యాల వంటకాలలోని పౌష్టికాహార విలువలను తెలియపర్చారు. ఎంపిపి కిలారపు మంగమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటిసి చిమటా విజయశాంతి, తహశీల్దార్ బి రామ్‌నాయక్, ఎంపిడిఓ వై పిచ్చిరెడ్డి, సిడిపిఓ టి గాయత్రిదేవి, ఏసిడిపిఓ, పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

వేడి గాలులకు
మృత్యువాతుతున్న చేపలు
నందివాడ, ఏప్రిల్ 19: మండలంలో సుమారు 30 వేల ఎకరాల్లో చేపల సాగు జరుగుతోంది. రెండు, మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగిపోవడంతో ఆక్సిజన్ సక్రమంగా అందకపోవడం, చేపల చెరువులోని నీరు చిక్కపడిపోవడంతోచేపలు అధికశాతం చనిపోతున్నాయి. దీనిలోఎక్కువగా రేగండి, కట్ల, ఫంగస్ వంటి జాతులు ఎక్కువగా మృత్యువాత పడటంతో రైతులు భారీగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మేత రేట్లు పెరగటంతో పెట్టుబడి కూడా ఎక్కువగా అవుతుందని, అయితే దానికి తగ్గట్టు తగినంతగా దిగుబడులు రాకపోవడంతో అప్పులు పాలౌతున్నామని చేపల రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చేపల పెంపకందారులను ఆదుకోవాలని కోరుతున్నారు.