కృష్ణ

మహానాడు నాటికి నామినేట్ పోస్టులన్నీ భర్తీ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 19: మే నెలలో జరగనున్న మహానాడు నాటికి నామినేటెడ్ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని రాష్ట్ర న్యాయ, క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. టిడిపి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బుధవారం స్థానిక సిరి కల్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ పట్టణ, మండల కమిటీలతో పాటు అనుబంధ కమిటీల ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ గడిచిన తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు ఎంత సేవ చేసినా వారి రుణాన్ని తీర్చుకోలేమన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశామని, మిగిలిన పోస్టులను కూడా మహానాడు నాటికి పూర్తి చేసి పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు న్యాయం చేస్తామన్నారు. అన్ని సమీకరణలు చేపట్టి సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ఎంతో మంది సంస్థాగత ఎన్నికల్లో పదవులు ఆశించారని, అయితే వారికి జిల్లా, రాష్ట్ర కమిటీల్లో స్థానం కల్పిస్తామన్నారు. క్రమశిక్షణ గల కార్యకర్తలుగా మెలిగి పార్టీ ప్రతిష్ఠను మరింత పెంచేందుకు ఆశావహులు కృషి చేయాలని కోరారు. అనంతరం టిడిపి పట్టణ, మండల కమిటీలకు ఎన్నికైన వారి పేర్లను మంత్రి రవీంద్ర ప్రకటించారు. పట్టణ అధ్యక్షుడిగా ఇలియాస్ పాషా, ప్రధాన కార్యదర్శిగా పిప్పళ్ల వెంకట కాంతారావు, తెలుగు మహిళా అధ్యక్షురాలిగా లంకిశెట్టి నీరజ, ప్రధాన కార్యదర్శిగా కూరేటి రమాదేవి, తెలుగు యువత అధ్యక్షుడిగా మరకాని వాసు, ప్రధాన కార్యదర్శిగా సలీమ్, తెలుగు రైతు అధ్యక్షుడిగా పరుచూరి వెంకట రత్నం, వీరంకి సుబ్రహ్మణ్యం, బిసి సెల్ అధ్యక్షుడిగా శివకోటి రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కొక్కిలిగడ్డ సత్యనారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా యువరాజ్, ప్రధాన కార్యదర్శిగా జోజిబాబు, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా సజ్జా యేసు, ప్రధాన కార్యదర్శిగా బండి దుర్గారావు, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఖాజా బేగ్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ వౌలాలి, వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా పద్మనాభుని శేఖర్) టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడిగా కేశన యుగంధర్, ప్రధాన కార్యదర్శిగా కొడాలి అరుణ కుమార్ నియమితులయ్యారు. పార్టీ మండల అధ్యక్షుడిగా కుంచే దుర్గాప్రసాద్ (నాని), ప్రధాన కార్యదర్శిగా నీలం రామకృష్ణ, రైతు విభాగం అధ్యక్షుడిగా కొక్కు మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శిగా గొరిపర్తి వెంకటేశ్వరరావు, తెలుగు యువత అధ్యక్షుడిగా రామదేని వేణు, ప్రధాన కార్యదర్శి నూకల పున్నారావు, ఎస్‌సి సెల్ అధ్యక్షుడిగా గడిదేసి రవి, ప్రధాన కార్యదర్శిగా దాసరి ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా తుపాకుల చంద్రశేఖర్‌లను నియమించారు.

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
నందిగామ, ఏప్రిల్ 19: మండలంలోని అడవిరావులపాడు గ్రామంలో 15సంవత్సరాల మైనర్ బాలికకు ఈ నెల 21వ తేదీన వివాహం జరిపేందుకు పెద్దలు నిర్ణయించగా బుధవారం ఐసిడిఎస్, రెవెన్యూ అధికారులు ఆ గ్రామానికి వెళ్లి వివాహాన్ని వాయిదా వేయించారు. బాలిక తల్లిదండ్రులకు తహశీల్దార్ రామకృష్ణ, ఐసిడిఎస్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి మైనార్టీ తీరే వరకూ వివాహం జరిపించమని వారితో వాగ్మూలం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్‌వైజర్‌లు, విఆర్‌ఒ తదితరులు పాల్గొన్నారు.

గౌతులచ్చన్నకు ఘన నివాళులు
మైలవరం, ఏప్రిల్ 19: స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న 11 వర్థంతి కార్యక్రమాలు బుధవారం ఇక్కడ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్‌అండ్‌బి కార్యాలయం ఎదుట ఉన్న గౌతులచ్చన్న విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈసందర్భంగా నేతలు మాట్లాడుతూ గౌతులచ్చన్న స్వాతంత్య్ర సమరయోధుడిగా జైలు జీవితం గడిపారన్నారు. రైతుల సమస్యలపై శ్రీకాకుళం నుండి మద్రాస్ వరకూ పాదయాత్ర చేశారన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికై ఆయన రాజీలేని పోరాటం చేశారని అందుకే ఆయనకు సర్దార్ అనే బిరుదు లభించిందన్నారు. అదేవిధంగా గీత కార్మికుల సమస్యలపై ఆయన చేసిన పోరాటాలు మరువరానివన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘ నేతలు పామర్తి శ్రీనివాసరావు, గుదే రాము, మల్లెల వెంకట శ్రీనివాసరావు, పరికెల శ్రీను, మట్టా రవి, ఉండ్రగుంట జమలయ్య, పుల్లారావు, మందా రామారావు, పేరయ్య, నాగరాజు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.