కృష్ణ

గవర్నర్‌కు ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), ఏప్రిల్ 22: కృష్ణా విశ్వ విద్యాలయం నాలుగవ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శనివారం జిల్లా కేంద్రం మచిలీపట్నం వచ్చిన గవర్నర్ నరసింహన్‌కు ఘన స్వాగతం లభించింది. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో గవర్నర్ నరసింహన్‌తో పాటు రాష్ట్ర న్యాయ, క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నేరుగా విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. వీరికి జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు, ఆర్డీవో సాయిబాబులు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఉపకులపతి ఛాంబర్‌లో శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు, మాజీ శాసనమండలి సభ్యుడు ఐలాపురం వెంకయ్య, పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు కాగిత వెంకట్రావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి జగన్నాథరావు(బుల్లయ్య), మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, జిల్లా రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ జివి పూర్ణచంద్ తదితరులు గవర్నర్‌ను కలిసి దుశ్శాలువలు, జ్ఞాపికలతో సత్కరించారు. అలాగే విశ్వ విద్యాలయం తరఫున గౌరవ డాక్టరేట్‌కు ఎంపికైన శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. స్నాతకోత్సవాల అనంతరం పెడనలో కలంకారీ వస్త్ర పరిశ్రమను సందర్శించిన గవర్నర్ మళ్లీ విశ్వ విద్యాలయానికి చేరుకుని ప్రత్యేక హెలికాప్టర్‌లో గన్నవరం బయలుదేరి వెళ్లారు.

ఊర చెరువుకు నీటి సరఫరా
జగ్గయ్యపేట, ఏప్రిల్ 22: వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యాహ్నయ మార్గాల ద్వారా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అన్నారు. సుజల స్రవంతి పథకం ద్వారా పాలేటి నీటిని కాచవరం నుండి ఎర్ర కాలువ ద్వారా పట్టణంలోని ఊర చెరువుకు సరఫరా అవుతుందని ఆయన తెలిపారు. ఈ నీటి సరఫరాను ఆయన పట్టణంలోని శాంతినగర్ వద్ద అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిఇ, ఎఇ, అధికారులు నీటి సంఘ అధ్యక్షులు యానాల గోపి, తూమాటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.