కృష్ణ

రియల్ టైమ్‌లో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 24: రియల్ టైమ్‌లో రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల పనులను పూర్తిచేయడానికి మే 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రాజెక్టుల పనులు జరిగే ప్రాంతాలను సందర్శించనున్నట్టు జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. సోమవారం జలవనరులశాఖ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, ఎక్స్‌పర్ట్ కమిటీ సభ్యులతో రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల డిజైన్లకు సంబంధించి సమస్యల్ని నివారించడం, ఉద్యోగులపై ఉన్న పనిభారాన్ని ఏ విధంగా తగ్గించాలనే విషయాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి సమన్వయంతో ప్రాజెక్టులు సకాలంలో పూర్తిచేయడానికి కృషి చేయాలన్నారు. వెలుగొండ టనె్నల్ పనులు అనుకున్న విధంగా వేగవంతంగా జరగడం లేదని, జాప్యాన్ని నివారించాలని ఇందుకు కాంట్రాక్టర్లు, అధికారులు సహకరించాలని కోరారు. మే నెల మొదటి తేదీకల్లా పనులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రారంభించాలని సిఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. పోతిరెడ్డిపాడు, గండికోట ప్రాజెక్టు పనులు పూర్తితోపాటు నీరు అందించే ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా ఒక్కో బ్యాచ్‌లో 150 మందికి శిక్షణ ఇవ్వాలన్నారు. ఇందులో ఇంజనీర్లు, రైతులు ఉండాలని జిల్లాకు నలుగురు చొప్పున ఎంపిక జరుగాలని ఆదేశించారు. ప్రాజెక్టులకు సంబంధించి డిజైన్ల జాప్యాన్ని నివారించాలన్నారు. జలవనరులశాఖ నిపుణుల కమిటీలో ఉన్న 7గురు సభ్యుల్లో 5గురు వివిధ ప్రాజెక్టులు జరిగే ప్రాంతాల్లో జరుగుతున్న పనితీరు గమనించి అవసరమైన సలహాలు, సూచనలు అక్కడికక్కడే అందించాలని వారికి సూచించారు. త్వరలోనే జలవనరులశాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రమోషన్లు ఇవ్వాలని చూస్తున్నామని, అందుకు తగిన కసరత్తు పూర్తిచేయాలని, ఏప్రిల్ 25 నుంచి మే 25కల్లా ఈ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. అధికారులుగా పనిచేస్తున్నవారు ఎస్‌ఈ, సిఈలుగా రిటైర్డ్ అయితే వారికి గౌరవంగా ఉంటుందని, ప్రమోషన్లు ఇవ్వడం వల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదని, ఉద్యోగులు కూడా సంతోషంగా రిటైర్ అవుతారని చెప్పారు. ఇప్పటివరకు 48 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తీశామని, ఇది 16 టిఎంసిల నీటికి సమానమన్నారు. పోతిరెడ్డిపాడు, అవుకు, జిఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, ముచ్చుమర్రి, జెసి కెనాల్‌ల పనులు అనుకున్న విధంగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్ సిఈలు, ఎస్‌ఈలు ఇందుకు చర్యలు తీసుకోవాలని, జరిగిన దాన్ని గురించి ఆలోచించకుండా జరుగబోయే ప్రాజెక్టు పనుల కొనసాగింపుపై దృష్టి పెట్టాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులు కూడా చేపట్టాలని అధికారులకు సూచించారు. పంట కాలువల్లోకి ఇళ్లల్లో ఉపయోగించిన వ్యర్థాలు కలవడం వల్ల దిగువ ప్రాంతాల్లో నీరు కలుషితం అవుతుందని, దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమీక్షా సమావేశానికి ఈఎన్‌సి వెంకటేశ్వరరావు, నిపుణుల కమిటీ సభ్యులు వీరయ్యచౌదరి, వివిధ కాంట్రాక్ట్ సంస్థల సభ్యులు తదితరులు హాజరయ్యారు.