కృష్ణ

మలేరియా దోమతో కాంట్రాక్టర్లకు కాసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కోట్లు ఖర్చవుతున్నా కనిపించని యాంటి మలేరియా
* ఎప్పటికప్పుడు భయంతోనే నగర జీవనం
* జ్వరం వస్తేనే సిబ్బంది రాక
* శాశ్వత చర్యలు మాత్రం శూన్యం
* నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం
విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 24: నగరాన్ని మలేరియా ఫ్రీ నగరంగా తీర్చిదిద్దాలన్న నగర వాసుల ఆశ నిరాశగానే మిగులుతోంది. ప్రతి ఏటా వందలాది మంది మలేరియా జ్వరానికి గురై ప్రాణపాయ ప్రమాదాలను ఎదుర్కొంటున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తూ కాలం గడిపేస్తున్నారు. జ్వరం వస్తేనే కనిపించే మలేరియా సిబ్బంది మిగిలిన రోజుల్లో వారి జాడ కనిపించదు. ప్రతి ఏటా వార్షిక బడ్జెట్‌లో కోట్లు కేటాయిస్తున్న నగర పాలకులు, మలేరియా నిర్మూలనలో తీసుకొంటున్న చర్యలు మాత్రం అంతంతమాత్రమే. గత జనవరి నుంచి ఇప్పటి వరకూ మలేరియా జ్వరాలను పరిశీలిస్తే ఇప్పటికీ 60 కేసులు నమోదైనట్టు అధికారిక రికార్డులే చెబుతుండగా నమోదు కాని కేసులు అనేకం. ఒకరకంగా చెప్పాలంటే యాంటీ మలేరియా కోసం కేటాయించే బడ్జెట్ నిధులు ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం కలిగిస్తున్నాయన్నది పక్కన పెడితే కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తున్నాయి. యాంటీ మలేరియా చర్యల్లో భాగంగా చేపట్టనున్న పనులకు అవసరమైన ఎంఎల్ ఆయిల్, పై రత్నం, తదితర వస్తు సామగ్రి సరఫరా చేసే కాంట్రాక్టర్ల జోబులు నిండుతున్నాయే కానీ మలేరియా దోమ మాత్రం నియంత్రణ కావడం లేదు. అధికారులు మాత్రం మేము చేయాల్సింది చేస్తున్నాం ప్రజల అనాలోచిత చర్యలతోనే దోమలు ఉత్పత్తవుతున్నాయంటూ నెపం ప్రజలపై నెట్టేస్తున్నారు. కెమికల్స్ సరఫరాలో ఎటువంటి నాణ్యతా ప్రమాణాలను పరిగణలోకి తీసుకొంటున్నారన్న ప్రశ్నకు బదులు ఎవ్వరికీ అర్థంకాదు. వాస్తవ పరిస్థితులను గమనిస్తే నగర పాలక సంస్థ చేస్తున్న ఖర్చుకు, చేపడుతున్న చర్యలకు కనిపించే ఫలితాలకు ఎక్కడా పొంతన కనిపించదు. నగరంలోని ఏలూరు, బందర్, రైవస్ కాల్వలు మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి ప్రాణాంతక జ్వరాలను వ్యాప్తి చేసే అన్ని రకాల దోమల ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. అలాగే నగర వ్యాప్తంగా జన నివాసాల వెంబడి ఉన్న పక్కా మురుగు కాల్వలు సరైన పూడిక తీత, పారుదల లేక దోమల ఉత్పత్తి స్థావరాలవుతున్నాయి. యాంటి మలేరియా చర్యలకు వినియోగించే కెమికల్స్ కొనుగోలుకు ప్రతి సంవత్సరం 46లక్షల 60వేల వరకూ కేటాయిస్తున్న అధికారులు కనీసం 60వేల రూపాయల ఫలితమైనా ప్రజలకు అందడం లేదనే చెప్పాలి. మలేరియా విభాగానికి సిబ్బంది కొరత పట్టి పీడిస్తోంది. ప్రతి డివిజన్‌కు 60 నుంచి 80 వరకూ సిబ్బంది అవసరం ఉండగా అంతకన్న తక్కువ మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో శాశ్వత సెలవులో కొంతమంది, డెప్యూటేషన్ మీద మరికొంత మంది ఇతర విభాగాలకు కేటాయించగా అధికారుల ఇళ్లల్లో సొంత పనులకు, ప్రజాప్రతినిధుల సొంత అవసరాలకు అనధికారికంగా వినియోగించుకొంటున్న వైనంతో నగరంలో మలేరియా చర్యలు నామమాత్రంగానే జరుగుతున్నాయన్న విషయం బహిరంగ రహస్యం. ప్రంపంచ మలేరియా దినోత్సవం స్ఫూర్తితోనైనా విజయవాడను మలేరియా ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

భూగర్భజలాల పెంపే లక్ష్యంగా పనిచేయాలి
* వాటర్ యాక్షన్ ప్లాన్లు సిద్ధం చేయండి
* అధిక ఉష్ణోగ్రతలపై అప్రమత్తంగా ఉండాలి
* టెలికాన్ఫరెన్స్‌లో సిఎం, వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎస్ ఆదేశాలు
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఏప్రిల్ 24: నీటి సంరక్షణ ఉద్యమంలో భాగంగా ‘నీరు-ప్రగతి’పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లతో సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించగా అధిక ఉష్ణోగ్రతలపై ముందస్తుల చర్యలు చేపట్టాలంటూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దినేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘మీకోసం’ సమీక్షా సమావేశంలో పాల్గొన్న కలెక్టల్ లక్ష్మీకాంతం వేదిక మీద నుండే సిఎం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఒక పక్క ప్రజల నుండి వచ్చిన అర్జీలు స్వీకరిస్తూనే నీరు-ప్రగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనలను పరిగణలోకి తీసుకున్నారు. టెలికాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత సిఎం చంద్రబాబు తెలియజేసిన అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. నీరు-ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు. భూగర్భ జలాలు పెంపే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారన్నారు. జిల్లాలో సరాసరి భూగర్భ జలాలు పది మీటర్లలో ఉన్నాయని, దీన్ని ఎనిమిది మీటర్లకు తీసుకురావాలన్నారు. వర్షం పడిన తర్వాత 3 మీటర్లు భూగర్భజలాలు ఉండాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమన్నారు. గ్రామాలు, మండలాల వారీగా నీటి అవసరాలపై కార్యాచరణ ప్రణాళికలను మంగళవారం నాటికి అందించాలని మండల ప్రత్యేక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రణాళికల తయారీలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. ఇందు కోసం ఇంజనీరింగ్ విద్యార్థుల సేవలను కూడా వినియోగించుకోవడం జరుగుతుందన్నారు. మంగళవారం ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేసిన గ్రామాలకు పంపించి భూగర్భజలాలపై క్యాంపైన్ నిర్వహిస్తామన్నారు. ఇదిలాఉండగా సాయంత్రం అధిక ఉష్ణోగ్రతలపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దినేష్ కుమార్ 13 జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలో చేపట్టిన చర్యలను కలెక్టర్ లక్ష్మీకాంతం సిఎస్‌కు వివరించారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రభుత్వ, స్వచ్చంద సంస్థల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతంలో కూలీలకు వడదెబ్బ తగలకుండా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఇవ్వటంతో పాటు నీడ కల్పించే విధంగా షెడ్లు వేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ రంగయ్య, ముడ వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, ఆర్డీవో సాయిబాబు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జెడి నరసింహరావు, సిపిఓ వెంకటేశ్వర్లు, ఐసిడియస్ పిడి కృష్ణకుమారి, డియంఅండ్‌హెచ్ డా. కామేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు క్రికెట్ టోర్నమెంట్‌లో
విజేత బందరు ఎఆర్ జట్టు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 24: ఆంధ్ర జాతీయ కళాశాల క్రీడా మైదానంలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా పోలీసు క్రికెట్ టోర్నమెంట్‌లో మచిలీపట్నం ఎఆర్ జట్టు విజేతగా నిలిచింది. అవనిగడ్డ సబ్ డివిజన్ జట్టు ద్వితీయ బహుమతిని కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో విజేతగా నిలిచిన అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ బివిడి సాగర్ మచిలీపట్నం ఎఆర్ జట్టుకు ట్రోఫీని ప్రదానం చేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన మచిలీపట్నం ఎఆర్ జట్టుకు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి విజయ్ కుమార్ రూ.20వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన అవనిగడ్డ జట్టుకు రూ.10వేలు నగదు బహుమతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ జయరాజు, అవనిగడ్డ డియస్‌పి ఖాదర్ బాషా, ఎఆర్ డియస్‌పి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

డివిజన్ ఆదాయం పెంచుతాం
* డిఆర్‌ఎం ధనుంజయలు
విజయవాడ (రైల్వేస్టేషన్), ఏప్రిల్ 24: విజయవాడ డివిజన్‌లో గత ఏడాది కంటే ఈ ఏడాది ఆదాయం పెంచేందుకు యోచిస్తున్నట్లు విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ ధనుంజయలు అన్నారు. డిఆర్‌ఎం కార్యాలయంలోని ధనుంజయలు ఛాంబర్‌లో ఈ విలేఖరితో మాట్లాడుతూ గత ఏడాది డివిజన్‌కు ఆదాయపు వనరులు తగ్గిన మాట వాస్తవమేనన్నారు. అయితే దాన్ని అధిగమించడం కోసం ఈ సంవత్సరం ప్రత్యేక ప్రణాళికను రూపొందించటం జరిగిందన్నారు. గత ఏడాదిలో 20 ఏళ్లుగా నిర్వహిస్తున్న మ్యాంగో ఎగుమతులు నగరం నుంచి కాకుండా పక్క డివిజన్‌కు వెళ్లిపోయిందన్నారు. దాన్ని తిరిగి ఈ సంవత్సరంలో డివిజన్ పరిధిలోని నూజివీడు నుంచి ఎప్పటిలాగానే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఇందుకోసం కావాల్సిన ఏర్పాట్లు చేశామని మరో వారం, పది రోజుల్లో ఎగుమతులు ప్రారంభమవుతాయన్నారు. విజయవాడ స్టేషన్‌ని ఇంటిగ్రేటెడ్ స్టేషన్‌గా తీర్చిదిద్దడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే రైల్వేస్టేషన్‌కు దగ్గరలో ఉన్న ఖాళీ స్థలాన్ని అభివృద్ధి చేసి మల్టీఫ్లెక్స్ కాంప్లెక్స్ వంటివి నిర్మించడం కోసం ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. అయితే ఇంటిగ్రేటెడ్ స్టేషన్ ప్రాంతంలో ఇటువంటి అభివృద్ధి జరగాలంటే అందుకు రైల్వేతోపాటు రాష్ట్ర ప్రభుత్వం పాత్ర కూడా ఉంటుందన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ముఖ్య కార్యదర్శితోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయడం జరిగిందన్నారు. అందులో ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నారు. ఇదే తరహాలో గుణదల, రాయనపాడు వంటి స్టేషన్ల అభివృద్ధికి కావాల్సిన సర్కిలేటింగ్ ప్రాంతం అవసరమన్నారు. రోడ్డు మార్గం బాగా పుష్కలంగా ఉన్నప్పుడు స్టేషన్ అభివృద్ధికి అడ్డంకులు ఉండవన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం వారికి కావాల్సిన ఏర్పాట్లు, అభివృద్ధిపై అధికారులు ఎప్పుడూ దృష్టి సారిస్తారన్నారు. రాత్రివేళలో దూర ప్రాంతమైన హజరత్ నిజాముద్దీన్, ఓఖా వైపు నుంచి కలకత్తా, భువనేశ్వర్ వైపు వెళ్లే రైళ్లలో విజయవాడలో దిగేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందన్నారు. అయితే రైలు విజయవాడ స్టేషన్‌కు వచ్చి ఇక్కడ ఇంజన్ మార్పులు జరిగి బయలుదేరడానికి కొంత సమయం వృథా అవుతున్న దృష్ట్యా గుణదల స్టేషన్‌ని అభివృద్ధి చేసి ప్రస్తుతం గూడ్స్ బైపాస్ లైన్‌ని ప్యాసింజర్ లైన్‌గా మార్పులు చేసి ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపడం కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇటువంటి విధానం ఇప్పటికే విశాఖపట్నంలోని గోపాలపట్నం దగ్గర ఉందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. విజయవాడ స్టేషన్‌లో సైతం ప్రయాణికుల సౌకర్యార్థం వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటం జరిగిందని ఒక ప్రశ్నకు సమాధానంగా వివరించారు.

మళ్లీ రోడ్డెక్కిన ‘కేశినేని’ బాధితులు
* లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు
* ఫలించని ఏంపి ఆఫీసు వ్యూహం
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 24: కేశినేని ట్రావెల్స్ కార్మికులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే ఒకసారి కేశినేని భవన్, ట్రావెల్స్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, జీతాలు డిమాండు చేసిన విషయం తెలిసిందే. రవాణా కమిషనర్‌తో ఎంపి కేశినేని నాని గొడవ పడిన నేపథ్యంలో, తరువాత కొద్దిరోజులకు తన ట్రావెల్స్ మూసివేస్తూ బస్సులను తిప్పబోనని ఎంపి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈయన సంస్థలో పని చేస్తున్న సుమారు 1500 మందికి పైగా సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే జీత భత్యాలు లేక అప్పులపాలైన తాము, అకస్మాత్తుగా కంపెనీ మూసేస్తే రోడ్డున పడ్డామంటూ కార్మికులు ట్రావెల్స్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇది జరిగిన మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధి కొమ్మారెడ్డి పట్ట్భా రంగంలోకి దిగి ట్రావెల్స్‌కు చెందిన కొందరితో చర్చలు జరిపిన మీదట విలేఖరుల సమావేశం పెట్టి త్వరలో అందరికీ జీతాలు చెల్లిస్తామని ప్రకటించారు. పైగా ఆందోళన చేసిన కార్మికుల్లో అందరూ వామపక్షాలు, వైఎస్సార్ పార్టీ కార్యకర్తలేనని రాజకీయ దాడికి దిగారు. అయితే కొద్దిరోజుల్లోనే మళ్లీ సోమవారం ట్రావెల్స్ కార్మికులు రోడ్డుమీదకు వచ్చి అందోళనకు దిగడంతో ఎంపి కార్యాలయం రచించిన వ్యూహం బెడిసికొట్టినట్లైంది. పది నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ కమిషనర్ డి వరప్రసాద్‌ను కలిసి కేశినేని సిబ్బంది వినతి పత్రం సమర్పించారు. జీతాలు చెల్లించమని అడిగితే తమపై దాడి చేశారని, తమకు రావాల్సిన మొత్తం ఇప్పించి, ఎంపి నానిపై చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. చెప్పా పెట్టకుండా ట్రావెల్స్ మూసివేసి తమకు జీతాలు చెల్లించకుండా ముఖం చాటేశారన్నారు. ఏడాదిగా జీతాల్లేక అప్పుల పాలయ్యామని, ఇంకా తమకు అన్యాయం చేయవద్దంటూ ట్రావెల్స్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపి, తెలంగాణాల్లోని సుమారు 500 మంది కార్మికులు విజయవాడ వచ్చి తమ నిరసన తెలిపారు. తొలుత కార్మికశాఖ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఆందోళన నిర్వహించిన తర్వాత కమిషనర్‌ను కలిసి విఙ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన కమిషనర్ పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తానన్నారు.

వేసవిలో జరిగే రైళ్ళ దోపిడీల నిరోధానికి
జిఆర్‌పి, ఆర్‌పిఎఫ్ సంయుక్త ఆపరేషన్
విజయవాడ(రైల్వేస్టేషన్), ఏప్రిల్ 24: వేసవికాలంలో రైళ్ళలో రాత్రివేళల్లో జరిగే దోపిడీలను అరికట్టేందుకు ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి పోలీసులు సంయు క్తంగా ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశాయి. ఈ విషయంపై విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలోని సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ కార్యాలయంలో ప్రభుత్వ రైల్వే పోలీస్ (జిఆర్‌పి) డిఎస్‌పి ఎం శాంతిబాబు.., అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ (ఆర్‌పిఎఫ్) త్యాగితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ వేసవికాలంలో రాత్రివేళలో జరిగే చోరీలను అరికట్టేందుకు కావాల్సిన ప్రణాళికను రూపొందించామన్నారు. విజయవాడ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్ళే రైళ్ళ సంఖ్య వంద ఉంటుందన్నారు. ఇందులో ఆర్‌పిఎఫ్ సిబ్బందికి చెందిన బలగాలు యాభై రైళ్ళలోనూ, మిగిలిన యాభై రైళ్ళలో జిఆర్‌పి ప్రభుత్వ రైల్వే పోలీస్ బలగా లు గస్తీగా వెళతాయన్నారు. గత సంవత్సరం వేసవికాలంలో పెద్దగా దోపిడీ లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల సత్ఫలితాలు వచ్చాయన్నారు. అదే తరహాలో ఈ వేసవిలో సైతం ఎక్కడా దోపిడీ అనే మాట వినపడకుండా పూర్తిస్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నా రు. అందుకు ముందస్తు ప్రణాళికను రూపొందించామన్నారు. ఎక్కువశాతం ఏ ప్రాంతంలో దోపిడీలు జరుగుతున్నాయో ఇప్పటికే గుర్తించి ఆ ప్రాంత సరిహద్దులోకి రైలు వెళ్ళే సమయానికి భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
కాల్చివేత ఆదేశాలు జారీ
జిఆర్‌పి డిఎస్‌పి ఎం శాంతిబాబు మాట్లాడుతూ మార్గమధ్యలో రైలు చైన్ లాగి దోపిడీకి పాల్పడి పారిపోతుంటే వెంటనే దోపిడీదారులపై కాల్పు లు జరిపేలా గస్తీ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామన్నారు. అయితే ప్రస్తుతం జిఆర్‌పి ద్వారా రైళ్ళలో గస్తీకి కావాల్సినంత మంది సిబ్బంది లేకపోవడం కారణం గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశాఖప ట్నం, విజయవాడ సిటీ, కృష్ణాజిల్లా ప్రాంతాల్లోని వివిధ పోలీస్ స్టేషన్‌ల నుంచి దాదాపు 50మంది సిబ్బంది అదనంగా ఈ వేసవికాలంలో రైళ్ళలో రాత్రివేళ గస్తీ నిమిత్తం వస్తున్నారన్నా రు. రాత్రివేళల్లో ప్రయాణించే ప్రయాణికులు సైతం కొంతమేర అప్రమత్తం గా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు కనిపించిన వెంటనే అదే రైలులో గస్తీ కాస్తున్న పో లీసులకు సమాచారం అందించాలన్నా రు. అలాగే ప్రయాణికులు సైతం గస్తీ పోలీసులతో సహకరించాలని ఈ సం దర్భంగా శాంతబాబు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిఆర్‌పి స్టేషన్ సిఐ రత్నరాజు, జిఆర్‌పి లై న్స్ సిఐ శివశంకర్ పాల్గొన్నారు.

ప్రతి పోలీస్‌కు క్వార్టర్స్ ఉండేలా చర్యలు
పటమట, ఏప్రిల్ 24: ప్రజలకు సేవలు చేసేందుకు 24 గంటలు అందుబాటులో ఉండే పోలీసులు ఇంటికి వెళ్లి ప్రశాంతంగా ఉండేలా అందరికీ క్వార్టర్స్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కె.నాగుల్‌మీరా పేర్కొన్నారు. కాగా ఉదయం 17వ డివిజన్ పోలీస్ క్వార్టర్స్‌లోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీలకు కె.నాగుల్‌మీరా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా శాసనసభ్యులు గద్దె రామమోహన్, కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన