కృష్ణ

నెహ్రూ ఒక మహావృక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, మే 6: దివంగత దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) ఒక మహావృక్షమైతే మనమంతా కొమ్మలమని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం గురునానక్ కాలనీ నాక్ కల్యాణ మండపంలో నెహ్రూ సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నెహ్రూ ఆశయాలను మనమంతా కొనసాగిద్దామన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం రాజీపడని మనస్తత్వం నెహ్రూదని, నేటితరానికి ఆయన ఒక విజన్ అన్నారు. ఎన్‌టిఆర్ పార్టీ స్థాపించినప్పుడు యుఎస్‌ఒ విద్యార్థి అధ్యక్షుడుగా పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. నెహ్రూ ఏ పార్టీలో ఉన్నా ఒక కమిట్‌మెంట్‌తోనే పనిచేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆయన జీవించినంతకాలం ఏనాడూ పదవుల కోసం ఆశించలేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ దేవినేని అవినాష్‌కు అండగా ఉంటుందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయటానికి చంద్రబాబునాయుడికి అండగా ఉండాలనే ఉద్దేశంతో తిరిగి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారన్నారు. చివరికు ఆయన తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకునే తుది శ్వాస విడుస్తానని నెహ్రూ చెప్పిన మాట అక్షర సత్యం అయ్యిందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ జిల్లాలో 5సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా నెహ్రూ విజయం సాధించి రాజకీయాలలో ఒక ఒరవడి సృష్టించారని తెలిపారు. ఆయన మరణం పార్టీకి తీరనిలోటని, ఆయన మధ్యలేకపోవం దురదృష్టకరమన్నారు. దేవినేని అవినాష్ వినయ విధేయతలుగల వ్యక్తిగా అందరి మన్నలు పొందారన్నారు. తెనాలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 1983లో టిడిపి పార్టీ ఆవిర్భావంనాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావుకు అండగా ఉండి ఆయన అడుగుజాడల్లో నెహ్రూ నడిచారన్నారు. టిడిపిలో దేవినేని నెహ్రూ కుటుంబంతో తనకు విడదీయరాని బంధం ఉందన్నారు. నెహ్రూ తనయుడు, టిడిపి యువ నాయకుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ రాజశేఖర్ (నెహ్రూ) విద్యార్థి నాయకుడిగానే రాజకీయాలలోకి వచ్చారని తెలిపారు. ఏ ఆశయాల సాధనకు నెహ్రూ పనిచేశారో అదే బాటలో విద్యార్థులు నడిచి టిడిపి అభివృద్ధికి, నారా లోకేష్‌కు అండగా నడవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మంత్రి దేవినేని ఉమ, తదితులు నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి, నెహ్రూకు ఆత్మశాంతి కలగాలని 2నిమిషాలు వౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కడియాల బుచ్చిబాబు, ముసునూరి సుబ్బారావు, మాజీ డెప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు, యుఎస్‌ఓ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.