కృష్ణ

వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టుపై ఎసిబి అధికారుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, మే 19: జిల్లా సరిహద్దు అనుమంచిపల్లి గ్రామ సమీపంలోని వాణిజ్య పన్నుల చెక్‌పోస్టుపై శుక్రవారం తెల్లవారుఝామున అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. విస్తృతంగా తనిఖీలుచేసి రికార్డులు పరిశీలించి రూ.30,800ల నగదు అదనంగా ఉన్నట్లు గుర్తించి స్వాధీనపర్చుకున్నారు. చెక్‌పోస్టు వారు తనిఖీల్లో పట్టుకుని స్వాధీనం చేసుకున్న వాహనాల్లో కొన్నింటికి కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నోటీసులు ఇవ్వకుండా సెటిల్‌మెంట్ కోసం ఉంచినట్లు గమనించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎసిటిఒ సత్యనారాయణను ప్రశ్నించారు. ఎసిబి దాడుల సమయంలో ఒక ప్రైవేటు వ్యక్తి విధులు నిర్వహించడం గుర్తించి అతని ద్వారానే డబ్బులు వసూలు చేస్తున్నట్లు నిర్ధారించారు. డిఎస్‌పి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో సిఐలు వెంకటేశ్వరరావు, సత్యనారాయణలు దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు. కాగా సదరు చెక్‌పోస్టులో ఇటీవల కాలంలో భారీగా అవినీతి జరుగుతోందని, వాహనాల వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో సొమ్ములు వసూలు చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్న నేపథ్యంలో దాడులు నిర్వహించడం గమనార్హం.

నాగాయలంకలో సిగ్నల్ టవర్ ఏర్పాటుకు స్థల పరిశీలన
నాగాయలంక, మే 19: స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం ఆవరణలో శుక్రవారం సిగ్నల్ టవర్ ఏర్పాటుకు గల అవకాశాలపై సంబంధిత విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ విజయ, ఇంజనీరు ఫిరోజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ రాష్ట్రంలోని తొమ్మిది తీర ప్రాంత జిల్లాలలో సిగ్నల్ టవర్స్‌ను ఏర్పాటు చేయటం ద్వారా మారుమూల ప్రాంతాలలో గల పలు సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి అధికారులు తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. తరచూ ప్రకృతి వైపరిత్యాలకు తీర ప్రాంతాలలోగల జిల్లాల ప్రజలు ఆటుపోట్లను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని, అవాంఛనీయ సంఘటనల సమయంలో కూడా సంబంధిత సమాచారం తక్షణమే ఉన్నత స్థాయిలో ఉన్న అధికార యంత్రాంగానికి చేరే వీలు కలుగుతుందని ఆమె తెలిపారు. తీర ప్రాంతంలో నివశిస్తున్న మత్స్యకారులకు తాము వేటాడే సమయంలో, పెను తుఫాన్‌లు సంభవించిన సందర్భాలలో వారి వద్ద ఉన్న హామ్ రేడియోల ద్వారా ముందస్తు సమాచారం సిగ్నల్ టవర్‌కు చేరుతుంది. తద్వారా ప్రభుత్వం తగు చర్యలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని వివరించారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ విధమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించటం ద్వారా సిగ్నల్ టవర్స్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆమె వెల్లడించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఈ సిగ్నల్ టవర్స్ పనిచేస్తామని విజయ వివరించారు. ఈ బృందం వెంట తహశీల్దార్ స్వర్గం నరసింహారావు, డీటి సిహెచ్ వీరాంజనేయ ప్రసాద్, విఆర్‌ఓ తలసిల వెంకట చిదంబరరావు తదితరులు పాల్గొన్నారు.

19జికెఆర్‌పిహెచ్ 3: వెల్లటూరులో రోడ్డుప్రమాద దృశ్యం

జి.కొండూరు, మే 19: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మైలవరం మండలం వెదురుబీడేనికి చెందిన కొలుసు హరీష్‌కుమార్ (20) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. ఇతను అదే గ్రామానికి చెందిన బల్లపోతుల సుబ్రహ్మణ్యంక్తికి చెందిన ఆటోలో గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ వద్ద కోసూరులో మామిడి కాయలు అమ్ముకుని ఇంటికి తిరిగి వస్తున్నాడు. సుబ్రహ్మణ్యం ఆటోను నడుపుతుండగా, హరీష్‌కుమార్ ట్రక్ ఆటోలో పడుకుని ఉన్నాడు. వెల్లటూరు శివార్లలోనికి చేరిన వీరి ఆటోను బస్సు ఢీకొట్టింది. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో జరిగిన ఈప్రమాదంలో హరీష్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షత్రగాత్రుడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఇతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఎఎస్‌ఐ సుబ్రహ్మణ్యేశ్వరరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎండ తీవ్రతకు దగ్ధమైన యాక్టివా బైక్

జగ్గయ్యపేట రూరల్, మే 19: జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామానికి చెందిన బైక్ ఎండ థాటికి దగ్ధమైన సంఘటన తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. బండిపాలేనికి చెందిన బూదూరి లక్ష్మయ్య, లలిత దంపతులు భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగే బంధువుల వివాహానికి యాక్టివా వాహనంలో వెళుతున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెం సమీపంలోని వినోభానగర్ గ్రామ సమీపంలోకి వెళ్లేసరికి ఎండ వేడికి వారి వాహనానికి అకస్మాత్తుగా మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. భయబ్రాంతులకు గురైన దంపతులు వాహనాన్ని వదిలి పొలాల్లోకి పరుగులు పెట్టారు. వాహనంలోని మూడు వేల నగదు, దుస్తులు దగ్ధమైనట్లు బాధితులు తెలిపారు. కాగా జగ్గయ్యపేట మండల ప్రాంతంలో నాలుగు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడం, వడగాడ్పులు వీచడం పట్ల జనం భయభ్రాంతులు అవుతున్నారు. మూడు రోజులుగా 48 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అవ్వగా సోమవారం మరో డిగ్రీ పెరిగి జగ్గయ్యపేట ప్రాంతం రాష్ట్రంలోనే అత్యధికంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మండల పరిధిలో సున్నపురాతి గనులు, మైనింగ్‌లు, సిమెంట్ కర్మాగారాలు ఉండటం వల్లనే ఉష్ణోగ్రతలకు కారణమని భావిస్తున్నారు.

భావదేవరపల్లి మాజీ సర్పంచ్ భోగాది మృతి
నాగాయలంక, మే 19: మండల పరిధిలోని భావదేవరపల్లి గ్రామ మాజీ సర్పంచ్ భోగాది వెంకట సాంబశివరావు(88) అలియాస్ షావుకారు శుక్రవారం తెల్లవారు జామున భావదేవరపల్లిలోని తన స్వగృహంలో మృతి చెందారు. భోగాదికి భార్య, కుమారుడు, ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో 3వ కుమార్తె విజయలక్ష్మి శాసనసభ ఉప సభాపతి, అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ సతీమణి. భోగాది గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు వైద్య కేంద్రంలో చికిత్స పొందుతూ వచ్చారు. పరిస్థితి విషమించటంతో ఆయనను భావదేవరపల్లికి తరలించారు. సంగమేశ్వరం గ్రామంలోని శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయ ధ్వజ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. భోగాది మృతి పట్ల దివిసీమకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, అనధికారులు, అభిమానులు, బంధువులు, రైతు ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. శుక్రవారం సాయంత్రం సాంబశివరావు భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. భోగాది మృతి పట్ల ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌కు వివిధ రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు.