కృష్ణ

ఘనంగా హనుమజ్జయంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్, మే 21: హనుమాన్ జంక్షన్‌లో హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అభయాంజనేయ స్వామిని సుమారు 35 వేలమంది భక్తులు సందర్శించుకున్నారు. అభయాంజనేయునికి ఉదయం 3గంటలకు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మారేపల్లి సీతారామానుజాచార్యలు, పాలకమండలి చైర్మన్ పావులూరి రామారావు, కార్యనిర్వహణ అధికారి కెవిఆర్ నాగేశ్వరరావు, పాలకమండలి సభ్యులు అభిషేకా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెదపాడు, బాపులపాడు, నూజివీడు మండలాల భక్తులు బారులుతీరారు. హనుమాన్ జంక్షన్ లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియోషన్ ఆధ్వర్యంలో స్థానిక విజయవాడ రోడ్డు వేలేరు అడ్డరోడ్డు వద్ద అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. స్వామిని పౌర సరపరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, దెందులూరు శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఇంటర్ బోర్డు సెక్రెటరి ఉదయలక్ష్మి దర్శించుకున్నారు. స్వామివారి లడ్డూ ప్రసాదానికి సాయంత్రం వేలం పాట నిర్వహించారు. 23కేజిల లడ్డూను కొండూరి శివకుమార్ రెడ్డి 27,000లకు, 20కేజిల లడ్డూను బెక్కం లక్ష్మినారయణ 17వేలకు పాడారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఉరేగించారు.

మాంసాహారులూ... తస్మాత్ జాగ్రత్త...!

పాయకాపురం, మే 21: నిత్యం ముక్క లేనిదే ముద్ద దిగని మాంసాహార ప్రియులారా.. ఒక్క క్షణం మీరు భుజిస్తుంది సురక్షితమైన మాంసమేనా? ఒక్కసారి ఆలోచించారా...!? మీరు తింటుంది వేట మాంసం మాటున ఉన్న గొడ్డు మాంసమన్నది మీకు తెలుసా...? తెలియకుండానే భుజిస్తున్నవారు ఎంతో మంది. నగరంలో 2వేలకు పైగా మాంసం దుకాణాలు ఉన్నాయి. ప్రతి సెంటర్‌లో దాదాపు ఇరవైకు పైగానే మాంస దుకాణాలుంటాయి. ప్రతి ఆదివారం, పండుగ సమయాల్లో వేలాది కోళ్లు, మేకల్ని వధించి, వాటి మాంసాల్ని వ్యాపారులు విక్రయిస్తుంటారు. అసలు మాంసాన్ని విక్రయించే ముందు వ్యాపారులు చేయాల్సిన పనేంటి....? అంటే ఖచ్చితంగా వధించే జీవుల్ని కబేళాకు తరలించి, అక్కడ పశు వైద్యులతో వాటిని పరీక్షించి, వాటికి ఎటువంటి వ్యాధులు లేవని వైద్యుడు ధ్రువీకరించిన తర్వాత మాత్రమే వధించాలి. వధించిన అనంతరం మాంసంపై నగర పాలక సంస్థ ముద్ర వేయాలి. ఆ తర్వాతనే వ్యాపారులు మాంసం విక్రయాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే నగరంలో ఈ విధానం దాదాపుగా ఎక్కడా కనిపించదనే చెప్పాలి. స్థానిక వ్యాపారులు తమ దుకాణాల వద్దే మూగ జీవాల్ని వధించి, అమ్మకాల్ని చేపడుతుంటారు. అతి తెలివి గల మరి కొందరు వ్యాపారులు కబేళా నుండి వారానికి ఒకసారి తమ దుకాణాల దగ్గరకే ఒక అధికారిని రప్పించుకుని, వధించిన మూగ జీవానికి ఒక ముద్ర వేసి, దానే్న వేలాడదీసి, దాని మాటున మరికొన్ని జీవుల మాంసాల్ని విక్రయిస్తుంటారు. పైకి మాత్రం ముద్రించిన మాంసం ఉంటుంది. వెనక మాత్రం దుకాణాల్లో వధించిన మాంసాల్నే అమ్ముతుంటారు. అంతే కాకుండా మిగిలిపోయిన మాంసాన్ని రోజుల తరబడి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి.. ఉంచి.. కుళ్లిపోయే స్థితిలో ఉన్న మాంసాన్ని కూడా జనానికి అంటగడుతుంటారు. సహజంగా రోడ్లపై మేకల మందలు తిరుగుతున్నప్పుడు కుక్కలు వంటివి వాటిని కరుస్తుంటాయి. ఆ విధంగా కరిచినప్పుడు వాటిల్లో ఉండే వైరస్ మేకల్లోకి ప్రవేశిస్తుంది. పరీక్షించకుండా ఈ విధంగా వైరస్ ఉన్న మేకల్ని వధించి అమ్మకాలు చేపట్టడం ద్వారా వాటిని తిన్న వ్యక్తులు అనేక రకాలైన వ్యాధులకు గురైయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంచితే మాంసం దుకాణాల్లో అమ్ముతున్నది నిజంగా వేట మాంసమేనా... అంటే అది కూడా ఖచ్చితంగా నిజమని చెప్పలేం! ఎందుకంటే వేట మాంసం ధర కిలో రూ.450 వరకు ఉంది. అదే గొడ్డు మాంసం ధరైతే ఇందులో సగానికే వస్తుంది. ఇక్కడే వ్యాపారులు తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తుంటారు. దుకాణాల దగ్గర వేలాడదీసిన వేట మాంసం ఒకవైపు ఉంటే పక్కనే పెట్టి ఉంచిన మాంసం కొంత ఉంటుంది. ఈ విధంగా పక్కన పెట్టి ఉంచిన మాంసమే గొడ్డు మాంసం! మనకు కేజీ మాంసం కావాల్సి వస్తే వేలాడదీసిన దానిలో అరకిలో, పక్కన ఉంచిన (గొడ్డు) మాంసం మరో అరకిలో కలిపి కొనుగోలుదారుల్ని వ్యాపారులు మోసం చేస్తుంటారు. మాంస దుకాణాల్లోనే కాదు ప్రముఖ హోటళ్లలో సైతం నిల్వ ఉంచిన, కుళ్లిపోయిన మాంసాన్ని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అమ్ముతున్న వ్యాపారులపై మాత్రం మన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక కాసుల కక్కుర్తేనన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతంలో విజయవాడ నగర పాలక సంస్థకు కమిషనర్లుగా పని చేసిన ప్రవీణ్ ప్రకాష్, వేమూరి ఉషారాణి వంటి వారి హయాంలో మాంస దుకాణాలపై, హోటళ్లపై విస్తృతంగా దాడులు నిర్వహించి, కుళ్లిపోయిన మాంసాల్ని విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అటువంటి దాడులుగానీ, చర్యలుగానీ ఎవరూ తీసుకోవడం లేదనేది సుస్పష్టం!