కృష్ణ

ఆంజనేయుడి నామస్మరణతో సకల శుభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, మే 21: సర్వాంతర్యామి శ్రీఆంజనేయస్వామి జన్మదినం మనందరికీ శుభదినం అని, ఆంజనేయుడి నామస్మరణతో సకల భయాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని తాత్వికులు గెంటేల వెంకట రమణ అన్నారు. మండలంలోని బలుసుపాడు శ్రీగురుథామ్‌లో ఆదివారం శివానంద గురు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం 6.30గంటలకు ఆశ్రమంలో కొలువైన సద్గురు కందుకూరు శివానందమూర్తి కాంస్య విగ్రహానికి, ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి కార్యక్రమాలను ప్రారంభించారు. కైలాసరిగి కొండ కింద భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైకి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తోడ్కొని వెళ్లి కొలువుతీర్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ నిర్వహించిన స్వామివారి కల్యాణం, పట్ట్భాషేకం, హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాల్లో వెంకటరమణ, వసంత లక్ష్మి దంపతులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం దంపతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి కల్యాణ పీటలపై కూర్చున్నారు. ఈ సందర్భంగా శ్రీగురుధామ్ వెబ్‌సైట్‌ను జిడ్డు కృష్ణమూర్తి, భగవాన్ రమణ మహర్షి ఆధ్యాత్మిక రచనలకు సంబంధించి వెంకట రమణచే రూపొందించిన సత్యదర్శనం పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం అనుగ్రహ భాషణలో హనుమత్ తత్వాన్ని వెంకట రమణ భక్తులకు వివరించారు. ప్రతి ఇంటా నిర్వహించే శుభ కార్యాలు, వివాహాలు, పుట్టిన రోజు వేడుకలను విలాసాలతో కాకుండా సంప్రదాయకంగా జరుపుకోవాలని, పేదవారికి సహాయం అందించాలని భక్తులకు సూచించారు. అనంతరం శివానంద భక్తబృందం ఆధ్వర్యంలో మహా ప్రసాద వితరణ జరిపారు. హైదరాబాదు, వరంగల్, వైజాగ్, జగ్గయ్యపేట పరిసర ప్రాం తాల నుండి వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి కార్యక్రమాలను తిలకించారు.

పార్టీ కోసం కష్టపడి బాధితుడిగానే మిగిలిపోయా!
* బిజెపి పొత్తుతో కైకలూరులో పార్టీని నష్టపర్చారు * టిడిపి జిల్లా కమిటీ ఎన్నికలో మాజీ ఎమ్మెల్యే జయమంగళ ఆవేదన
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మే 21: ‘పదేళ్లు ప్రతిపక్షంలో పార్టీ కోసం నాతో పాటు కష్టపడిన వారంతా పలు పదవులతో హ్యాపీగా ఉన్నారు, కానీ నేను మాత్రం బాధితుడిగానే మిగిలిపోయా..? ఇదెక్కడి న్యాయం..? పొత్తుల కారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తన సీటును త్యాగం చేశా.. కానీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి సైతం పదవులు ఇచ్చి న్యాయం చేశారు.. ఇంకెంత కాలం నేను పార్టీ కోసం కష్టపడాలి..? ఎప్పటికి న్యాయం చేస్తారు..?’ అని కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ తన ఆవేదనను నిండు సభలో వెళ్లగక్కారు. తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా కమిటీ ఎన్నిక కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక శ్రీరామరాజు కనె్వన్షన్ సెంటరులో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా పరిశీలకునిగా రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు, జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు, కేశినేని నానితో పాటు ఇతర ముఖ్య నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయమంగళ వెంకట రమణ పార్టీ అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేస్తామని చెప్పిన నాయకులు నేడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయ్యారని, తాను మాత్రం సామాన్య కార్యకర్తగానే మిగిలిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రాభవం లేని కైకలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి పార్టీని పటిష్ఠపరిస్తే 2014 ఎన్నికల్లో బిజెపితో పొత్తు కారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా పదవీ త్యాగం చేశానన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఎమ్మెల్సీ పదవి తనకే ఇస్తానని చెప్పారన్నారు. మూడేళ్లు గడిచినా ఇచ్చిన హామీని నెరవేర్చుకోకపోగా ఇతరులకు ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారన్నారు. పొత్తులతో కైకలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని తీవ్రంగా దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా జిల్లాకు చెందిన మంత్రులు, ముఖ్య నేతలు స్పందించి కైకలూరులో పార్టీ పటిష్ఠతకు కృషి చేయటంతో పాటు తనకు జరిగిన అన్యాయంపై నోరు విప్పాలని జయమంగళ వేదిక దిగి తన అనుచరులతో సభ నుండి నిష్క్రమించారు. అయితే జయమంగళ ఆవేదనతో వెళ్లిపోతుంటే ఏ ఒక్కరూ కూడా ఆయన్ని ఆపే ప్రయత్నం చేయలేదు.

తెదే అర్బన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా బుద్దా, కొమ్మారెడ్డి!
* సీల్డ్ కవర్‌లో కార్యవర్గం ప్రతిపాదనలు
* భారీ సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చిన బుద్దా..
* బిజెపితో పొత్తు లేకపోయినా నగరంలో విజయదుందుభి
* ఎంపి కేశినేని సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 21: రాష్ట్రంలో కీలకమైన రాజధాని ప్రాంత విజయవాడ అర్బన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు సిట్టింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే బుద్దా వెంకన్నతో పాటు అనుబంధ సంఘాల ఇన్‌చార్జి కొమ్మారెడ్డి పట్ట్భా పేర్లు దాదాపు ఖరారయ్యాయి. అయితే పార్టీ అధిష్టానం వీరిరువురి పేర్లను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. నూతన కార్యవర్గం ఏర్పాటు కోసం ఐవి ప్యాలెస్‌లో ఆదివారం విస్తృత సమావేశం జరిగింది. డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు క్రియాశీలక కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. పార్టీ తరపున పరిశీలకులుగా విచ్చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు, గుంటూరుకు చెందిన సీనియర్ నేత రాజా మాస్టర్ సమావేశానికి ముందుగా కేశినేని భవన్‌లో ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని), ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావులతో సమాలోచనలు జరిపారు. అనారోగ్యం కారణంగా జలీల్‌ఖాన్ గైర్హాజరయ్యారు. మొత్తంపై ఎంపితో పాటు శాసనసభ్యులు ముగ్గురు కూడా బుద్దా వెంకన్న, కొమ్మారెడ్డి పట్ట్భా పేర్లను ప్రతిపాదించినట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది. వివాదాల కతీతంగా వీరిరువురూ కలసి పనిచేయగలరనే విశ్వాసం తమలో ఉందని, వీరి నాయకత్వంలో వచ్చే ఎన్నికలు సమర్ధవంతంగా ఎదుర్కోగలమని చెప్పినట్లు తెలిసింది. 2015లో జరిగిన ఎన్నికల్లోనే ప్రధాన కార్యదర్శి పదవికి కొమ్మారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆఖరి క్షణంలో మంత్రి దేవినేని ఉమా కలుగచేసుకుని గనె్న వెంకట నారాయణ ప్రసాద్‌కు మద్దతు నిస్తూ 2017లో పట్ట్భాకి అవకాశం ఇద్దమంటూ హామీనిచ్చిన అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. చిన్నా పెద్ద అందరినీ కలుపుకు పోయే మనస్తత్వం పట్ట్భాలో ఉందని శాసనసభ్యులు తెలియజేశారు. అనంతరం వీరంతా ఐవి ప్యాలెస్‌లో జరిగే సమావేశానికి విచ్చేసారు. కార్యవర్గంలో పోటీకి ఆసక్తికల్గినవారు ముందుకు రావాలని మంత్రి ఆనందబాబు ప్రకటించారు. వెనువెంటనే సర్దుకుని ఎంపి, శాసనసభ్యులు తమ తమ ప్రతిపాదనలను సీల్డ్ కవర్‌లో తనకు అందచేయాల్సిందిగా కోరారు. దీనికి ప్రతినిధులందరూ సమ్మతించారు. ఇక ముఖ్య నేతల ప్రసంగాలన్నీ కార్యకర్తలు, నేతల ఐక్యతపైనే సాగాయి. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయదుందుభి మోగించాలంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. గత ఎన్నికల్లో బిజెపితో పొత్తు వలనే తెలుగుదేశంకు ఓట్లు తగ్గాయని అన్నారు. ముఖ్యంగా తనకు భారీ మెజార్టీ వచ్చి ఉండేదన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు లేకున్నా నగరంలోని మూడు నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో గెలువగలమంటూ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఈ సమావేశం నేతల బలాబలాలకు వేదికగా మారింది. ఎవరూ ఊహించని విధంగా బుద్దా వెంకన్న ఒన్‌టౌన్ నుంచి భారీ ర్యాలీతో సభా ప్రాంగణానికి తరలి వచ్చారు.