కృష్ణ

వట్టిపోయన మంచినీటి చెరువులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 29: కృష్ణానది తీరాన ఉన్న కృష్ణా జిల్లాలో మంచినీటి ఎద్దడి సమస్య ఎదురుకాబోతోంది. ఇప్పటికే పది గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా అరకొరగా మంచినీటి సరఫరా జరుగుతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో సముద్రం నుంచి ఉప్పునీరు రోజురోజుకూ ముందుకు చొచ్చుకొస్తోంది. ఇప్పటికే పామర్రు పరిసరాల వరకు ఉప్పునీరు చొచ్చుకొచ్చిందంటున్నారు. దీనివల్ల అక్కడక్కడా బావులు, బోర్‌వెల్స్ ఉన్నప్పటికీ ఆ నీరు ఎందుకూ పనికిరాని పరిస్థితి నెలకొంది. జిల్లా మొత్తంపై 383 మంచినీటి చెరువులు ఉండగా వాటి ఆధారంగా రక్షిత మంచినీటి పథకాలు పనిచేస్తున్నాయి. ఈ పథకాల ద్వారా 550 గ్రామాలకు పైప్‌లైన్ల ద్వారా మంచినీటి సరఫరా జరుగుతుంది. ఇదిలావుంటే మండుతున్న ఎండలకు జిల్లాలోని మంచినీటి చెరువులన్నీ దాదాపు ఎండుముఖం పట్టాయి. వారం పదిరోజుల్లో ఈ చెరువులను కొంతమేరైనా నింపని పక్షంలో లక్షలాది మంది ప్రజలు దాహార్తితో అలమటించే పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపు పట్టిసీమ నుంచి చుక్కనీరు రావడం లేదు. కృష్ణాజలాలు పుష్కలంగా తరలివచ్చే సమయంలో పట్టిసీమ నుంచి మోటార్ల ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చించి దాదాపు 80 టిఎంసిల నీరు ప్రకాశం బ్యారేజికి చేరినప్పటికీ బ్యారేజీకి పుష్కలంగా నీరు చేరిందంటూ గత సీజన్‌లో దాదాపు 60 టిఎంసిల నీటిని వృథాగా సముద్రంలోకి వదలాల్సి వచ్చింది. ఇదిలావుంటే పులిచింతల ప్రాజెక్ట్‌కు ప్రారంభోత్సవం జరిగి మూడేళ్లు దాటుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో నీరు నిలువలేదు. అయితే మంచినీటి అవసరాల కోసం అదీ కెఇబి మెయిన్ కాలువ, బందరు కాలువ దిగువనున్న 150 మంచినీటి చెరువులను నింపేందుకు ఈ నెల 22న పులిచింతల నుంచి బ్యారేజీకి కొంతమేర నీటి విడుదల జరిగింది. మొత్తంపై 4 టిఎంసిల నీటిని విడుదల చేసి శుక్రవారం అర్ధరాత్రి సమయానికి నిలిపివేశారు. ప్రస్తుతం పులిచింతలలో 3.42 టిఎంసిలకు మించి నీరు నిలువ లేదు. 8.4 అడుగులుగా ఉన్న ప్రకాశం బ్యారేజి నీటిమట్టం ప్రస్తుతం 10.4 అడుగులకు చేరింది. వాస్తవానికి ఏడాది పొడవునా 12 అడుగుల్లో నీటిని నిలువ ఉంచాల్సి ఉంది. నాగార్జునసాగర్ నుంచి నీటి సరఫరా లేకపోవటం వలన ఈ పరిస్థితి దాపురించింది. ఇక మంచినీటి అవసరాల కోసం ప్రస్తుతం కెఇబి మెయిన్ కెనాల్‌కు వెయ్యి క్యూసెక్కులు, బందరు కెనాల్‌కు 600 క్యూసెక్కుల నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ ఎగువ ప్రాంతాల్లోని చెరువులకు సక్రమంగా నీరు అందటం లేదు. పులిచింతల నుంచి నీటి సరఫరా నిలిచిపోవటంతో చెరువులు నిండకపోయినా గత్యంతరం లేని స్థితిలో కాలువలను పూర్తిగా కట్టేయాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక రైవస్, ఏలూరు కాలువల కింద 250 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులను నింపటానికి ఎప్పుడు నీరు వదలుతారో తెలియని స్థితి నెలకొంది.
ఇదేనా స్వచ్ఛ నగరం!
నగరం నడిబొడ్డు నుంచి ప్రవహించే బందరు, రైవస్, ఏలూరు, కెఇబి మెయిన్.. ఈ నాలుగు కాలువలు కూడా అటు జలవనరుల శాఖ ఇటు నగరపాలక సంస్థ పర్యవేక్షణ లేక హైదరాబాద్ మూసీనదిని తలదనే్నలా మురికి కూపంలా మారాయి. ఈ విషయమై ఆంధ్రభూమి దినపత్రికలో ఇటీవల అనేక కథనాలు ప్రచురితమయ్యాయి. సుప్రీంకోర్టు ఇప్పటికి ఎన్నిమార్లు ఆదేశించినప్పటికీ నగరపాలక సంస్థ మాత్రం మురుగునీరు కాలువల్లోకి ప్రవహించకుండా మాత్రం నివారించలేకపోయింది. అధికారికంగానే 80 ఔట్‌లెట్ల నుంచి క్యూసెక్కుల కొద్దీ మురుగునీరు నేరుగా కాలువల్లో కలుస్తూ వస్తుంటే ఇక పరిసర ప్రాంత నివాస, వాణిజ్య భవనాల నుంచి వేల సంఖ్యలో డ్రైనేజి కనెక్షన్‌లున్నాయి. వీటికితోడు చిరు వ్యాపారులు అనునిత్యం తమ చెత్త, ఇతర వ్యర్ధ పదార్ధాలను నేరుగా కాలువల్లోనే వేయటం పరిపాటిగా మారింది. ఇక జంతు కళేబరాలు వీటన్నింటితో కాలువలు కంపుకొడుతున్నప్పటికీ శుభ్రపరచిన సందర్భాలు లేవు. కనీసం చెత్తా చెదారం, వ్యర్ధ పదార్ధాలను కూడా తొలగించకుండానే ఈ నెల 24 తేదీ నుంచి కాలువలకు నీటిని వదలుతున్నారు. వందలాది గ్రామాల ప్రజలు దాహార్తిని తీర్చే ఈ కాలువల పరిశుభ్రత గురించి ఏ ఒక్కరూ పట్టించుకోకపోవటం దురదృష్టకరం.