కృష్ణ

కొండెక్కి కూస్తున్న కోడిమాంసం ధరలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, మే 29: కోడిమాంసం ధరలు కొండెక్కి కూస్తున్నాయి. గత నెలలో కిలో రూ.150, 160 అమ్మిన మాంసం ఈనెల రెండోవారం నుండి క్రమక్రమంగా ధరలు పెరుగుతూ బుధవారం నాటికి విత్ స్కిన్ కిలో రూ.240, స్కిన్‌లెస్ కిలో రూ.250కి చేరుకుంది. గతంలో లైవ్ కిలో కేవలం 100 ధర పలుకగా నేడు కిలో 145కి చేరింది. గత ఏడాది కంటే ఈ ఏడాది సూర్యభగవానుని భగభగలు ఎక్కువవ్వడంతో కోళ్ళఫారాల్లోని కోళ్లు వడగాల్పులకు తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయి. దాంతో ఫారాల నుండి చికెన్ స్టాల్స్‌కి తరలించేలోగా వేసవి తాపానికి దారిలో ప్రతి వ్యానులోను 10 నుండి 50 కోళ్ల వరకూ మృత్యువాత పడుతుండటంతో చనిపోయిన కోళ్ల భారం వినియోగదారునిపై మోపడంతో వాటి ధరలు సామాన్యులకు అందనంతగా పెరిగాయి. పైగా సామాజిక మాద్యమాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల నిఘా ఎక్కువగా ఉండడంతో వినియోగదారులను వ్యాపారులు బురిడీ కొట్టించలేకపోతున్నారు. గతంలో మూడో కంటికి తెలియకుండా చనిపోయిన కోళ్లను సైతం మాంసంగా మార్చి అమ్మి సొమ్ము చేసుకునేవారు. నేడు ఆ పరిస్థితి లేదని తెలుస్తోంది. ఎండ వేడిమికి మృతి చెందిన కోడిమాంసం నాణ్యతలో తేడా గమనించవచ్చని అప్పుడే మన కళ్ల ముందే కోసిన కోళ్లయితే రక్తంతో మాంసం ఉంటుంది. అదే మృత్యువాత పడిన కోడి మాంసంలో రక్త్ఛాయలు కన్పించవు. ఈ చిన్నతేడాతో వినియోగదారుడు అప్రమత్తంగా ఉండడంతో చికెన్ స్టాల్స్ నిర్వాహకుల ఆగడాలు ఆగాయని కొందరి అభిప్రాయం. కాగా రూ.50కే కిచిడి, చికెన్ కర్రీ, రూ.100కే ఫుల్ బిర్యానీ పార్శిల్, ఇలాంటి బోర్డులు పెట్టి వ్యాపారాలు సాగిస్తున్న వారు మాత్రం దారిలో చనిపోయిన లేదా ఫారాల్లో చనిపోయిన కోళ్లను కారుచౌకగా కొని అన్ని రకాల మసాలాలు దట్టించి వినియోగదారుడిని ఆకట్టుకుని నాణ్యతలేని చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీలు అమ్మి లాభాలు గడిస్తున్నారనే అభియోగముంది. ఇలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇదిలా ఉండగా వేసవికాలం వచ్చిందంటే చాలు విద్యార్థినీ విద్యార్థులు అమ్మమ్మ తాతయ్య, నానమ్మ, తాతయ్య అలాగే మేనమామలు, పెదనాన్నలు ఇలా బంధువుల ఇళ్లకు వచ్చి వేసవి విడిది ఎంజాయ్ చేయడం ఆనవాయితీ. అలాంటి వారికి పసందైన విందు, బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, నాటుకోడి పులుసు, తదితరాలు ఏర్పాటు చేయాలంటే తలకు మించిన భారంగా కోడిమాంసం ధరలు పెరగడంతో వినియోగదారులు కూరలు తినే రోజులు పోయాయి. ఇంట్లో నలుగురుంటే నలుగురిదీ నాలుగు రకాల అభిరుచులు ఉన్నాయి. రాకరాక ఇంటికి వచ్చిన వారి అభిరుచి ప్రకారం వంటలు చేయాల్సి వస్తుంది. దానివల్ల ఆర్థిక భారం పెరుగుతుంది. ఫారం కోళ్లు మాట అటుంచితే నాటుకోళ్లు కూడా కిలోకి రూ.300లకు చేరింది. తొలకరి చినుకు పడితే గాని కోడిమాంసం ధరలు తగ్గవు. వినియోగదారులు కూడా నైరుతీ రుతుపవనాల కోసం ఎదురు చూస్తున్నారు.

టిడిపి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతాం
విస్సన్నపేట, మే 29: రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ పార్టీకి భవిష్యత్ లేకుండా చేస్తామని తిరువూరు వైకాపా ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి సోమవారం విస్సన్నపేటలో జరిగిన విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు. గత రెండున్నర సంవత్సరాల టిడిపి పాలనలో ప్రజలకు ఏవిధమైన మేలు జరుగలేదని, ఎన్నికల్లో చేసిన వాగ్ధానాలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఏమి చేయలేకపోయారని, పచ్చ చొక్కాలవారు అనుమతించిన వారికే ప్రభుత్వం నుండి సహాయ, సహకారాలు అందుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలను కూడా తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటూ జన్మభూమి కమిటీలు సిపార్సు చేసిన వారికే వాటిని మంజూరు చేస్తున్నారని, కనీసం జన్మభూమి కమిటిల్లో మిత్రపక్షమైన బిజెపి పార్టీకి చెందినవారిని కూడా సభ్యులుగా నియమించలేదన్నారు. నీరు- ప్రగతి కార్యక్రమంలో అవినీతి బాగా జరిగిందని, అంచనాలు వేయకుండానే పనులు పూర్తి చేసినట్లుగా తప్పుడు నమోదులు చేసి ప్రభుత్వ సొమ్ము కాజేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. ఎంత ప్రతిపక్షమైనా తాము అభివృద్ధికి అడ్డుతగలమని, అభివృద్ధి పనులు చేస్తే తమ మద్దతు పూర్తిగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం చేసే ప్రతి పనీ పారదర్శకంగా ఉంటే ప్రతి పనికూడా మంచిగా జరిగినట్లు ప్రజలు భావిస్తారని అన్నారు. ఈసమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు బి లోకేశ్వరరెడ్డి, పట్టణ కమిటి అధ్యక్షులు నెక్కలపు కుటుంబరావు, జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు శిరసాని ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

రేషన్, పెన్షన్, ఉపాధికే అధిక ప్రాధాన్యత
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మే 29: రేషన్, పెన్షన్, ఉపాధి హామీ పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. పెన్షన్ పంపిణీలో చిన్న చిన్న సమస్యను పరిష్కరించేందుకు కలెక్టరేట్ సమావేశ మందిరం వద్ద ప్రతి సోమవారం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కౌంటర్‌ను కలెక్టర్ సందర్శించారు. డిఆర్‌డిఎ కౌంటర్‌తో పాటు రేషన్, ఉపాధి హామీ పనుల విషయంలో కూడా పెద్ద ఎత్తున అర్జీలు వస్తున్నాయని, వారి సమస్యలను కూడా అక్కడిక్కడే పరిష్కరించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే బ్యాంకింగ్ సేవలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్‌కు కలెక్టర్ సూచించారు.

నాట్యారామ నిర్మాణానికి వ్యవసాయ భూమిని ఇవ్వలేను
కూచిపూడి, మే 29: నాట్య క్షేత్రం కూచిపూడిలో ప్రభుత్వం నిర్మిస్తున్న నాట్యారామానికి తరతరాలుగా వస్తున్న తన వ్యవసాయ భూమిని ఇవ్వలేనని ప్రముఖ నాట్యాచార్యుడు వేదాంతం రాఘవయ్య కుమారుడు రామచంద్ర వరప్రసాద్ (రాము) తహశీల్దార్ బి రామ్‌నాయక్‌కు విజ్ఞప్తి చేశారు. మీకోసం సందర్భంగా సోమవారం మొవ్వ తహశీల్దార్ కార్యాలయంలో కౌలురైతు ద్వారా రాము కూచిపూడి గ్రామంలోని ఆర్‌సి నెం.59/1, 61/3లోని ఐదు ఎకరాల 29 సెంట్ల మాగాణి భూమిని తన కుటుంబ పోషణావసరం దృష్ట్యా అందచేయలేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పెదపూడి గ్రామంలోని సర్వే నెం.27, 30లోని మూడు ఎకరాల 32 సెంట్ల భూములను దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న తమకే ఇవ్వాలని రైతులు తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మొవ్వలోని ఫైర్‌స్టేషన్ వద్దగల నివేశన స్థలాలు పంపిణీ చేయాలని, పెదపూడిలో ఇద్దరు నివేశన స్థలాల కోసం అర్జీలు అందించినట్లు తహశీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ బి ఆనందరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

చాగంటిపాడు వద్ద కరకట్టపై
ట్రాక్టర్ ఢీకొని రైతు దుర్మరణం

తోట్లవల్లూరు, మే 29: మండలంలోని చాగంటిపాడు వద్ద కరకట్టపై సోమవారం ట్రాక్టర్ ఢీకొని రైతు మృతిచెందాడు. వివరాలిలాఉన్నాయి. చాగంటిపాడు శివారు కళ్ళంవారిపాలెంకు చెందిన రైతు కళ్ళం గోవిందరెడ్డి(65) సోమవారం ఉదయం భద్రిరాజుపాలెంలోని అక్క ఇంటికి బైక్‌పై వెళ్లి వస్తుండగా ఉదయం 10.30 గంటల సమయంలో చాగంటిపాడు వద్ద కరకట్టపై ఎదురుగా దేవరపల్లి నుంచి వస్తున్న పసుపులోడు ట్రాక్టర్ ఢీకొంది. ట్రాక్టర్ ట్రక్కు చక్రం గోవిందరెడ్డి తలపైకి ఎక్కి తల చితికిపోయి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గత రెండు రోజులుగా కరకట్ట రోడ్డుపై చెరకు విత్తనం లోడుతో ఉన్న ట్రాక్టర్‌ని ఒకరు నిర్లక్ష్యంగా నిలిపి ఉంచాడని, దీనిని తప్పించే క్రమంలో పసుపులోడు ట్రాక్టర్ రోడ్డు మధ్యకు రావటం, అపుడే గోవిందరెడ్డి బైక్‌పై రావటంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. రోడ్డు మధ్యలో ప్రమాదం జరగటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఉయ్యూరు సిఐ జివివి సత్యనారాయణ, ఉయ్యూరు రూరల్ ఎస్‌ఐ రామారావు, సిబ్బంది వచ్చి గోవిందరెడ్డి మృతదేహాన్ని పక్కకు తీసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి బంధువులు తరలి వచ్చారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు భాస్కరరెడ్డి ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ మల్లేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య నిర్మల, ఇద్దరు కుమారులు ఉన్నారు.

వైభవంగా శత చండీయాగం

పెనుగంచిప్రోలు, మే 29: లోక కల్యాణార్థం శ్రీతిరుపతమ్మ అమ్మవారి ఆలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శత చండీయాగం సోమవారం మూడవ రోజుకు చేరుకుంది. వేద పండితులు గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఉదయం 8గంటలకు గోపూజ, గణపతిపూజ, మండప పూజ, చండీహోమం, మహాలింగార్చన, సామూహిక రుద్రాభిషేకాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు. చండీ యాగంలో నూజివీడుకు చెందిన లలితా కామేశ్వరి పీఠాధిపతి ఆదిత్యానంద భారతీ స్వామిజీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకృతి సమతుల్యంపై గోపిడకలతో చేస్తున్న చండీ యాగం గురించి భక్తులకు తెలియజేశారు. తొలుత భారతీస్వామిజీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరిని అధికారులు ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.

4 నెలల్లో 456 మందికి చెక్!
* మహిళా రక్షక్ అదుపులో ఈవ్‌టీజర్లు
* కౌనె్సలింగ్ నిర్వహించిన పోలీసు అధికారులు
విజయవాడ (క్రైం), మే 29: మహిళల పట్ల వేధింపులకు పాల్పడుతున్న ఈవ్‌టీజర్లపై మహిళా రక్షక్ బృందాలు కొరడా ఝుళిపిస్తున్నాయి. ఇప్పటి వరకు నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో 456 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 25న మహిళా రక్షక్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నగరంలో పలు ప్రాంతాలను గుర్తించి ఆయా చోట్ల మహిళా రక్షక్ బృందాలు మఫ్టీలో నిఘా వేసి మహిళలు, విద్యార్థుల పట్ల వేధింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. జనవరి 25 నుంచి ఈ నెల 29వరకు నగరంలోని స్టెల్లా కళాశాల, పంటకాలువ రోడ్డు, ముస్తాబాదు రోడ్డు, నున్న స్వర్ణ థియేటర్, ట్రెండ్‌సెట్, గన్నవరం సెంటర్, ఉయ్యూరు బస్టాండు, పద్మావతి ఘాట్, పిడబ్ల్యూడి గ్రౌండ్, రైల్వే డిఆర్‌ఎం ఆఫీసు, రైల్వేకాలనీ, అజిత్‌సింగ్‌నగర్, దేవీనగర్, కెబిఎన్ కళాశాల, గాంధీహిల్ డౌన్, కెఎల్ రావు పార్కు, గాంధీ కళాశాల, అప్సరా ధియేటర్, వైఎస్‌ఆర్ కాలనీ, పంజాసెంటర్, చిట్టినగర్ వాగుసెంటర్, కంకిపాడు బస్టాపు, కృష్ణవేణి ఘాట్, సత్యనారాయణపురం ఏరియా, ఎకెటిపిఎం పాఠశాల, శారదా కళాశాల తదితర చోట్ల 456 ఈవ్‌టీజర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 76 మందికి సోమవారం పటమటలోని వాసవ్య మహిళా మండలిలో చెన్నుపాటి విద్య, నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ ఆధ్వర్యాన మహిళా మండలి, మహిళామిత్ర సభ్యులతో కౌనె్సలింగ్ నిర్వహించారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడం వల్ల ఎదురయ్యే నష్టాలు, చట్టాల గురించి వివరించారు. నగరంలో ఎక్కడైనా ఈవ్‌టీజింగ్ జరిగితే డయల్ 100, ఫోర్త్ లయన్ ద్వారా సమాచారం అందించాలని, సమాచారం అందుకున్న కంట్రోల్ రూము సిబ్బంది సమీపంలోని మహిళా రక్షక్ బృందాలను అప్రమత్తం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో డిసిపి పాలరాజు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జిఎస్టీ అమలు బాధ్యత ఉద్యోగులదే
- జిఎస్టీ సిస్టమ్స్ ఏడిజి రెహమాన్
విజయవాడ (క్రైం), మే 29: ఒక దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్ నినాదంతో వస్తున్న అతిపెద్ద పరోక్ష పన్ను సంస్కరణ జిఎస్టీని అమలు చేయడంలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైందని జిఎస్టీ సిస్టమ్స (్ఢల్లీ) అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్‌కె రెహమాన్ అన్నారు. సెంట్రల్ ఎక్సైజ్ ప్రధాన కార్యాలయంలో జిఎస్‌టి సాఫ్ట్‌వేర్ అమలుతీరుపై ఉద్యోగులకు సోమవారం అవగాహన సదస్సు జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిఎస్‌టిలో ఉద్యోగుల పనికి సంబంధించిన క్రియాశీలత మారుతుందన్నారు. జిఎస్‌టిలో ఉద్యోగులు తమ వృత్తిని ఓ బాధ్యతగా స్వీకరిస్తూ సాంకేతిక నైపుణ్యాన్ని వృత్తిలో భాగస్వామ్యం చేసుకుంటూ మెరుగైన ఫలితాలు నమోదు చేసుకోవాలన్నారు. జిఎస్‌టిఎన్ వినియోగదారులకు విలువైన సేవలను అందించడంతోపాటు ప్రభుత్వం పన్ను చెల్లింపుదార్ల మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తోందన్నారు. జిఎస్‌టి సాఫ్ట్‌వేర్ స్ధిరీకరణ, పూర్తి పారదర్శకతతో ఉంటుందని తెలిపారు. జిఎస్‌టిలో కేంద్రీకృత రిజిస్ట్రేషన్ విధానం లేదన్నారు. ఏ రాష్ట్రంలో వ్యాపారం చేస్తే ఆ రాష్ట్రంలోనే జిఎస్‌టి కింద రిజిస్ట్రేషన్ ఇవ్వాలన్నారు. పన్ను చెల్లింపుదారులకే మెరుగైన సేవలు అందించేందుకు జిఎస్‌టిలో సెంట్రల్ ఎక్సైజ్ సేవా పన్ను కార్యాలయాలు మరిన్ని విస్తరిస్తాయన్నారు. చిన్న కేంద్రాల్లో సైతం పలు జిఎస్‌టి కార్యాలయాలు వస్తాయన్నారు. జిఎస్‌టికి సంబంధించి నిబంధనలు, నియంత్రణలు అన్ని ఖరారయ్యాయని తెలిపారు. సమావేశంలో కేంద్ర ఎక్సైజ్ అదనపు కమిషనర్ వి నాగేంద్రరావు, డిప్యూటీ కమిషనర్లు వి రామనాధరెడ్డి, వై భాస్కరరావు, ఎన్ సృజన్ అసిస్టెం కమిషనర్లు రత్నకిషోర్, వి శ్రీనివాసరావు, సిఎస్ రాజు, సూపరింటెండెంట్లు మల్లెల శ్రీనివాస్, గుమ్మడి సీతారాయమ్య చౌదరి, విల్సన్ బాబు, వైఎస్ ఈశ్వర్, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

విశాఖ అభివృద్ధి పనులపై
మేయర్ శ్రీ్ధర్ ఆరా
విజయవాడ (కార్పొరేషన్), మే 29: గ్రేటర్ విశాఖపట్నం కమిషనర్ హరినారాయణను విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ కోనేరు శ్రీ్ధర్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖలో జరుగుతున్న అభివృద్ధి పనులు, వసూలవుతున్న పన్నుల వివరాలను అడిగి తెలుసుకున్న మేయర్ శ్రీ్ధర్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. గవర్నర్‌పేటలో ఎన్‌టిఆర్ షాపింగ్ కాంప్లెక్సు 2, 3 అంతస్తుల నిర్మాణం, విఎంసి కార్యాలయంలో జరుగుతున్న 8 అంతస్తుల నూతన భవన నిర్మాణంతో పాటు తదితర అభివృద్ధి పనుల గురించి శ్రీ్ధర్ వివరించారు.

బుడమేరు వాగులోకి పారుదలవుతున్న అపార్ట్‌మెంట్ డ్రైనేజీ నీరు
బుడమేరు వాగులోకి డ్రైనేజీ నీరు
* రామకృష్ణాపురంలో లోపభూయిష్టంగా నిర్వహణ
విజయవాడ (కార్పొరేషన్), మే 29: అపార్టుమెంట్ల డ్రైనేజీ పారుదల విషయంలో విఎంసి అధికారులు తీసుకుంటున్న చర్యలేమిటో రామకృష్ణాపురంలోని బుడమేరు సెంటర్ వద్దగల అపార్టుమెంట్‌ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అపార్టుమెంట్‌కు చెందిన ప్లాట్ల మరుగుదొడ్ల సిల్ట్ అంతా నేరుగా బుడమేరులోకి కలుస్తున్న వైనం పరిశీలిస్తే నగరంలో డ్రైనేజీ అవుట్‌లెట్ల నిర్వహణ ఏపాటిదో స్పష్టమవుతోంది. డ్రైనేజీ వాడుక నీరు కాలువలకు చేరకుండా ప్రస్తుత కమిషనర్ జె నివాస్ తీసుకుంటున్న విస్తృత చర్యల్లో భాగంగా ఏకంగా ఆర్టీసీ బస్టాండ్ డ్రైనేజీ వాడుక నీరు పారుదలయ్యే అవుట్‌లెట్‌ను యుద్ధప్రాతిపదికన మూసివేయించి కాలుష్య నివారణ చర్యలు చేపడుతుండగా విఎంసి ఇంజినీరింగ్ అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న విషయం రామకృష్ణాపురం అపార్ట్‌మెంట్ డ్రైనేజీ నిర్వహణే నిదర్శనంగా నిలస్తోంది. అపార్టుమెంట్ నుంచి 40 అడుగుల రోడ్డును దాటుతూ