కృష్ణ

పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 21: పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి స్ఫూర్తితో విధి నిర్వహణలో రాణించాలని పోలీసు సూపరింటెండెంటు జి విజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. గత జూన్ నెలలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన వీరుళ్ళపాడు ఎఎస్‌ఐ యండి జాన్‌పాషా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులను తెలుసుకున్నారు. పాషా కుటుంబానికి అన్ని విధాలా చేదోడువాదోడుగా జిల్లా పోలీసు శాఖ ఉంటుందని హామీ ఇచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. విధి నిర్వహణలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పోలీసుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన కృష్ణా పుష్కరాలలో సమర్ధవంతమైన పాత్ర పోలీసు శాఖ పోషించిందన్నారు. ఇటువంటి సేవలను రానున్న రోజుల్లో కూడా పోలీసులు కొనసాగించాలని కోరారు. పోలీసులు అంటే ప్రజలలో ఉన్న అభద్రతా భావాన్ని పోగొట్టి వారి మన్ననలు పొందే విధంగా వ్యవహరించాలన్నారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీ బివిడి సాగర్, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ జయరాజు, ఎఆర్ డిఎస్పీ నారాయణ, ట్రాఫిక్ డిఎస్పీ హుస్సేన్, డిటిసి డిఎస్పీ రమణమూర్తి, బందరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.