కృష్ణ

నగల కోసం... వృద్ధురాలిపై బాలుడి ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, అక్టోబర్ 21: బంగారం కోసం ఒక బాలుడు వృద్ధురాలిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. ముఖంపై దిండుతో ఒత్తి చంపాలని చూశాడు. పెనుగులాడిన వృద్ధురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో ఆ బాలుడు పరారయ్యాడు. వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. తీవ్ర షాక్‌కు గురైన ఆమె చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజాము మృతి చెందింది. దీనికి సంబంధించి పోలీసుల కథనం ప్రకారం నున్న గ్రామీణ పోలీస్టేషన్ పరిధిలోని శాంతినగర్‌లో జంగంగుంట బేబి సరోజిని (63) నివాసముంటోంది. ఈమె భర్త నాగమల్లేశ్వరరావు రైల్వేలో రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్. పదేళ్ల క్రితం మృతి చెందాడు. తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరు బెంగుళూరులో, మరొకరు బాపట్లలో ఉంటున్నారు. భర్త మృతి చెందినప్పటి నుండి పెన్షన్‌పై బతుకుతున్న ఈమె తన రేకుల షెడ్డు ఇంట్లో కొంత భాగాన్ని ఐదు నెలల క్రితం ఓ కుటుంబానికి అద్దెకిచ్చింది. వారి కుమారుడు బండిపై ఐస్ అమ్ముకునేవాడు. బేబి సరోజిని బంగారు నగలపై పడ్డాయి. వాటిని ఎలాగైనా కాజేయాలనుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూశాడు. గత బుధవారం రాత్రి ఆమె నిద్రిస్తున్న సమయంలో ముఖంపై దిండు ఉంచి గట్టిగా నొక్కి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ హఠాత్ పరిణామంతో షాక్‌కు గురైన సరోజిని పెనుగులాడి రక్షించండంటూ పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. సరోజిని కేకలతో జనం వస్తున్నారని గ్రహించిన బాలుడు అక్కడి నుండి పరారయ్యాడు. నున్న పోలీసులకు గురువారం ఉదయమే ఫిర్యాదు చేయడంతో సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. బాలుడు తల్లిదండ్రుల్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఫిర్యాదు చేసిన అనంతరం సీతారాంపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన సరోజిసి శుక్రవారం తెల్లవారుజాము మృతి చెందింది. హత్యా యత్నం కింద నమోదు చేసిన సెక్షన్ 307ను పోలీసులు సెక్షన్ 302 కింద హత్య కేసుగా నమోదు చేశారు. సరోజిని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందం గాలిస్తోంది.