కృష్ణ

వరుస చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 28: వ్యాపారస్థులు, కలెక్షన్ ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని శుక్రవారం ఆర్‌పేట పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన సమావేశంలో మీడియాకు చూపించారు. ముగ్గురు నిందితులు జల్సాల కోసం సులభ రీతిలో డబ్బు సంపాదించాలన్న క్రమంలో చోరీలకు పాల్పడినట్లు ఆర్‌పేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వరప్రసాద్ తెలిపారు. నిందితుల నుండి రూ.5లక్షల 61వేలు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవల్సి ఉందన్నారు. గొడుగుపేటకు చెందిన గూడవర్తి అమర్‌నాధ్ (27), గూడవర్తి నాగవర్ధన్(30)ను మీడియాకు చూపించారు. మరో నిందితుడు మైనర్ కావటంతో మీడియాకు చూపించలేదు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ముగ్గురు నిందితులు సాయంత్రం పూట వ్యాపారాలు ముగించుకుని ఇళ్ళకు వెళ్ళే వ్యాపారస్థులను, పలు షాపుల నుండి కలెక్షన్ సొమ్మును ఇళ్ళకు తీసుకువెళ్ళే ఏజెంట్లను లక్ష్యంగా పెట్టుకుని చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. అల్యూమినియం వ్యాపారం చేసే చలాది కృష్ణప్రసాద్ రాత్రి వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్ళే సమయంలో బండి డిక్కీలో పెట్టిన రూ.2.80లక్షలను బండితో సహా దొంగిలించారన్నారు. పెడనలో ఆయిల్ వ్యాపారం నిర్వహించే వేమూరి రామచంద్రరావు తన బండి డిక్కీలో రూ.3లక్షల 20వేలు పెట్టగా ఆ బండిని కూడా వీరు దొంగిలించారు. బందరు మున్సిపల్ కాంప్లెక్స్‌లో సెల్ ఫోన్ రీచార్జి షాపు వ్యాపారి షాపును మూసివేస్తుండగా సైకిల్‌కు పెట్టిన రూ.3వేల క్యాష్ బ్యాగ్‌ను కూడా వీరు దొంగిలించారు. దొంగిలించిన మొత్తంలో నిందితులు నుండి రూ.5లక్షల 61వేలు రికవరీ చేశామని, మిగిలిన సొమ్మును జల్సాల కోసం నిందితులు ఖర్చు చేసినట్లు తెలిపారు. అలాగే దొంగిలించబడ్డ రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో ఆర్‌పేట, ఇనగుదురు ఎస్‌ఐలు హబీబ్ భాషా, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.