కృష్ణ

దుర్గగుడి అభివృద్ధి పనులు 8 నెలల్లో పూర్తి చేస్తాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 3: దుర్గామల్లేశ్వర దేవస్థానం అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ పనులను మరో 8నెలల్లో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జెఎస్‌వి ప్రసాద్ తెలిపారు. విజయవాడలో ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ పూర్తిస్థాయిలో మాస్టర్ ప్లాన్ అమలుకు 2, 3 సంవత్సరాలు పడుతుందని, కానీ వీటిలో అధిక శాతం పనులను 8నెలల వ్యవధిలో పూర్తి చేసేందుకు నిర్ణయించామన్నారు. తూర్పు దిక్కు నుంచి ఆలయంలోకి భక్తులు ప్రవేశించేలా మల్లికార్జున మంటపాన్ని పునర్మిస్తున్నామని తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మల్లేశ్వరస్వామిని కూడా దర్శించుకునేందుకు వీలుగా క్యూలైన్లలో మార్పులు చేస్తున్నామన్నారు. అర్జున వీధిని 100 అడుగుల మేర విస్తరించనున్నామని, దీన్ని ఆరు నెలల వ్యవధిలో పూర్తిచేసేందుకు ప్రతిపాదించామన్నారు. వృద్ధులను, పిల్లల కోసం మూడు హైస్పీడ్ లిఫ్ట్‌లను రెండు నెలల్లో ఏర్పాటు చేస్తామన్నారు. మురుగును నేరుగా పంపకుండా, శుద్ధి చేసేందుకు వీలుగా ఒక మురుగుశుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసి, ఆ నీటిని మొక్కల పెంపకానికి వినియోగించనున్నట్లు వెల్లడించారు. ల్యాండ్ స్కేపింగ్, అర్జున వీధి చివర బస్‌బే వంటివి ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. దీనికి సమీపంలో ఉన్న రెండు ఎకరాల టిటిడి స్థలాన్ని తీసుకుని, దానిలో క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. టిటిడికి ప్రత్యామ్నాయంగా స్థలాన్ని ఇవ్వనున్నామన్నారు. అమ్మవారి ఊరేగింపు మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రతిపాదించామన్నారు. ఊరేగింపులో ఏనుగలు, గుర్రం, రథం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దసరా ఉత్సవాల్లో తొమ్మిది రోజులు ప్రత్యేకంగా అలంకారాలే కాకుండా, ఇతర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.