కృష్ణ

6న కానిస్టేబుల్, వార్డర్ల ప్రిలిమినరీ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), నవంబర్ 4: పోలీసు కానిస్టేబుల్స్, వార్డర్లకు ప్రిలిమనరీ రాత పరీక్ష ఆదివారం ఉదయం 10గంటలు నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు రీజినల్ కో-ఆర్డినేటర్, హిందూ కళాశాల ప్రిన్సిపాల్ వి ఉషారాణి తెలిపారు. కళాశాలలో శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏపి స్టేట్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు, జెఎన్‌టియు (కె) సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షను ఎనిమిది సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. 6,492 మంది పరీక్ష వ్రాయనున్నారన్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టినట్లు, ప్రతి 250 మంది అభ్యర్థులకు ఒక బయో మెట్రిక్ ఇన్విజిలేటర్‌ను నియమించినట్లు తెలిపారు. ఒక నిమిషయం ఆలస్యమైనా పరీక్షకు అభ్యర్థులను అనుమతించేది లేదని, ప్రతి అభ్యర్థి ఒక ఫోటో ఐడి (ఆధార్/డ్రైవింగ్ లైసెన్సు/ఓటర్ ఐడి), హాల్ టిక్కెట్ తీసుకురావాలన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కోరే అభ్యర్థులు క్యాష్ట్ సర్ట్ఫికెట్ జిరాక్స్ కాపీని తేవాలన్నారు. బ్లాక్, బ్లూ బాల్ పెన్నులను ఉపయోగించాలన్నారు. సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించమన్నారు. హిందూ కళాశాలలో 600 మంది, డిఎంఎస్ అండ్ ఎస్‌విహెచ్ ఇంజనీరింగ్ కళాశాలలో 1000 మంది, నోబుల్ కళాశాలలో 600 మంది వరలక్ష్మీ పాలిటెక్నిక్ కళాశాలలో 600 మంది, ఆర్‌కె జూనియర్ కళాశాలలో 600, చైతన్య జూనియర్ కళాశాలలో 1033 మంది, నందమూరు వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో 859 మంది, లంకపల్లి సన్‌ప్లవర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో 1200 మంది పరీక్ష రాయనున్నట్లు ఆమె తెలిపారు.