కృష్ణ

పూటి లాగుడులో సత్తా చాటుతున్న చినపులిపాక ఎడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, నవంబర్ 14: మండలంలోని చినపులిపాకకు చెందిన రైతు ఆరేపల్లి సాంబశివరావు ఎడ్లజత పూటి లాగుడు పోటీలలో సత్తా చాటుతున్నాయి. వరుసగా రెండుచోట్ల ప్రధమ స్థానంలో నిలిచి చినపులిపాక పేరుని నిలబెట్టాయని రైతు సాంబశివరావు సోమవారం తెలిపాడు. పెదఓగిరాలలో ఆదివారం జరిగిన 11 గ్రామాల స్థాయి పూటిలాగుడు పోటీలో ఆరు నిమిషాల్లో 1996 అడుగుల దూరం లాగి మొదటి బహుమతి సాధించాయని ఆయన చెప్పాడు. అలాగే ఇటీవల బొడ్డపాడు గ్రామంలో ఐదు గ్రామాల స్థాయిలో జరిగిన పోటీలలో కూడా మొదటి స్థానంలో నిలిచాయని సాంబశివరావు సంతోషం వ్యక్తం చేశాడు. తనకు సెంటు పొలం కూడా లేదని, 10 ఎకరాలు కౌలుకు వ్యవసాయం చేస్తు ఎడ్లను మేపుతున్నానని చెప్పాడు.