కృష్ణ

వ్యక్తిగత మరుగుదొడ్లను వేగవంతం చెయ్యండి:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), నవంబర్ 14: జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లను వేగవంతం చేసి ఓడిఎఫ్ జిల్లాగా ప్రకటించే విధంగా జిల్లా ప్రత్యేక అధికారులు కృషి చేయాలని కలెక్టర్ బాబు.ఎ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన మీకోసం కార్యక్రమం సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీలను కలెక్టర్ బాబు.ఎ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 174 గ్రామాలు ఓడిఎఫ్ గ్రామాలుగా ప్రకటించటం జరిగిందన్నారు. సరాసరి కొన్ని గ్రామాలలో 150 మరుగుదొడ్లు నిర్మిస్తే 320 గ్రామాలు ఓడిఎఫ్ గ్రామాలుగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. అధికారులు మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఎన్‌ఎస్‌పి కాలువలో పడి వ్యక్తి మృతి
చాట్రాయి, నవంబర్ 14: నాగార్జున సాగర్ కాలువలో నీటి ప్రవాహనం చూసేందుకు వెళ్లి జనార్థనవరం గ్రామానికి చెందిన దుర్గం సుబ్బయ్య ప్రమాదవశాత్తు జారిపడి కాలువలో పడిపోయాడు. కొత్తదూరం కొట్టుకు పోయి సుడిలో చిక్కుకుపోయాడు. ఊపిరాడక మృతి చెందాడు. గమనించిన గ్రామస్తులు చాట్రాయి విఆర్‌ఓ వెంకటేశ్వరరావుకు సమాచారం అందించారు. తహశీల్దార్ షాకీర్‌ఉన్నీసాబేగం, చాట్రాయి ఎస్‌ఐ పరమేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సాగర్ కాలువ వెంబడి ఉన్న గ్రామాలైన నరసింహారావుపాలెం, బూరుగుగూడెం, చాట్రాయి, జనార్ధనవరం, ఆరుగోలనుపేట, చిత్తపూర్ గ్రామాల ప్రజలు అప్రమత్తగా ఉండాలని సూచించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ఏరియా ఆసుపత్రికి తరలించామని ఎస్‌ఐ తెలిపారు.