కృష్ణ

టిడిపికి రికార్డు స్థాయ భారీ సభ్యత్వాలు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, నవంబర్ 22: ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక వ్యక్తి అయినా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని, ఈసారి రికార్డు స్థాయిలో జిల్లాలో సభ్యత్వం నమోదు కానుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలు ఉత్సాహంగా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. నూతన రాష్ట్ర రాజధాని నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. పార్టీ సభ్యుని కుటుంబానికి పార్టీ కట్టే జీవిత బీమా రక్షణగా వుంటుందన్నారు. కష్టపడే ప్రతి కార్యకర్త, నాయకుణ్ని పార్టీ గుర్తిస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అర్జునుడు కోరారు.
మంగళంపల్లికి
కళాకారుల నివాళి
కూచిపూడి, నవంబర్ 22: ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులు పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అకాల మరణం పట్ల కూచిపూడి కళాలోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మంగళవారం సాయంత్రం స్థానిక శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠంలో ప్రిన్సిపాల్ డా. వేదాంతం రామలింగశాస్ర్తీ ఆధ్వర్యంలో బాలమురళీకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అవార్డు గ్రహీతలు చింతా రవి బాలకృష్ణ, ఏలేశ్వరపు శ్రీనివాస్, సంగీత అధ్యాపకురాలు వేదాంతం వెంకట దుర్గ్భావాని, మృదంగ విద్వాంసులు పసుమర్తి హరనాథశాస్ర్తీ, డేగల సాంబశివరావు పాల్గొన్నారు. నాట్యాచార్యులు వేదాందం రాధేశ్యాం, పసుమర్తి రత్తయ్యశర్మ, పసుమర్తి కేశవప్రసాద్, తదితరులు నివాళులర్పించారు.