కృష్ణ

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 6: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాన్‌గా మారే ప్రమాదం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కృష్ణాజిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బాబు.ఎ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లో 08672-252572, 1077 టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు. విశాఖపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా 1320 కిలో మీటర్లు దూరంలో కేంద్రీకృతమైందన్నారు. గోపాలపురం నుండి ఆగ్నేయంగా 1360కిలో మీటర్ల దూరంలోను, కార్ నికోబర్ నుండి నైరుతి దిశగా 210 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైందన్నారు. రానున్న 24 గంటల్లో అల్పపీడనం తుఫాన్‌గా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. మత్స్యకారులకు వేటకు వెళ్ళవద్దని విజ్ఞప్తి చేశారు.
మళ్ళీ అల్పపీడనమా..?
కూచిపూడి, డిసెంబర్ 6: బంగాళాఖాతంలోని అండమాన్ దీవుల సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే నడా తుఫాన్, కయాంత్ తుఫాన్‌లు హెచ్చరికలతో ఉక్కిరిబిక్కిరి అయిన రైతన్నలు వాటి ప్రభావం లేకపోవటంతో ఊపిరి పీల్చున్నారు. అప్పటికే ప్రారంభించిన వరి కోతలు నిలిపివేసిన రైతులు తుఫాన్‌ల ప్రభావం లేకపోవటంతో వరి కోతలను ప్రారంభించారు. వారం రోజులు నుండి వరి కోతలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో తిరిగి అల్పపీడనం బలపడిందన్న సమాచారంతో ఇప్పటికే కోసిన వరి పనలను రక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సమయంలో వర్షాలు పడితే తీవ్ర నష్టం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.

శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర ప్రశంసనీయం - అడిషనల్ ఎస్పీ బివిడి సాగర్
మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 6: శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర ప్రశంసనీయమని జిల్లా అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ బివిడి సాగర్ అన్నారు. 54వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్ క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ సాగర్ మాట్లాడుతూ 1963వ సంవత్సరంలో సేవా సంస్థగా ఏర్పడిన హోంగార్డు వ్యవస్థ నేడు పోలీసు శాఖలో కీలకంగా మారిందన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసులతో హోంగార్డులు సమాన సేవలు అందిస్తున్నారన్నారు. తొలుత హోంగార్డుల పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం హోంగార్డుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బి డియస్‌పి జయరాజు, ఎఆర్ డియస్‌పి నారాయణరావు, ఆర్‌ఐ నాగిరెడ్డి, హోంగార్డ్స్ ఆర్‌ఎస్‌ఐ సతీష్, ఎంటిఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు