కృష్ణ

అమరావతి నిర్మాణానికి రాజవౌళి సలహా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 8:ప్రఖ్యాత సినీ దర్శకుడు రాజవౌళికి అరుదైన ఆహ్వానం దక్కింది. ప్రపంచస్థాయి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దనున్న అమరావతి నిర్మాణానికి సలహాలివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను అభ్యర్థించారు. రాజవౌళి నిర్మించిన బాహుబలి, అంతకుముందు మగధీర భారీ సినిమాల్లో అత్యంత ఆకర్షణీయమైన నగరాలను చూపించిన వైనం బాబును ఆకట్టుకుంది. అలాంటి తరహాలో నగర నిర్మాణానికి సూచన, సలహాలివ్వాలని బాబు ఆయనను కోరడమే కాకుండా, రాజవౌళి వద్దకు మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరు శ్రీ్ధర్‌ను పంపారు. వారిద్దరూ బాహుబలి, మగధీరలో చూపించిన నగర నిర్మాణాల డిజైన్లపై చర్చించారు. వాటితోపాటు పురాతన కాలం నాటి నిర్మాణాలపైనా ఆసక్తి ప్రదర్శించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న అమరావతి నిర్మాణంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర ఉట్టిపడేలా ఉండాలని ముఖ్యమంత్రి ఆశిస్తున్నందున, ఆ మేరకు మీ సహకారం కావాలని వారు అభ్యర్ధించారు. అందుకు స్పందించిన రాజవౌళి అమరావతి డిజైర్లకు తన సహకారం తప్పకుండా అందిస్తానని, అంత ప్రతిష్ఠాత్మకమైన నగరానికి తన సలహాలు కోరినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ నగరాలకు సంబంధించిన నిర్మాణాలపై వారు చర్చలు జరిపారు.