కృష్ణ

వరకట్న వేధింపులకు గృహిణి బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 14: వరకట్న వేధింపులకు గృహిణి బలైంది. పెళ్లయి ఏడాది కాకముందే అత్తింటి వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో పుట్టింటివారు శోకసంద్రంలో మునిగిపోయారు. యువతి ఆత్మహత్యకు కారకులైన అత్తింటి వారిని కఠినంగా శిక్షించాలంటూ బంధుమిత్రులు డిమాండ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక కరెంట్ కాలనీకి చెందిన నాగ వెంకట లక్ష్మీపావని(27)కి గత ఏడాది మే 27న విజయవాడకు చెందిన రెండుచింతల రాధాకృష్ణతో వివాహం చేశారు. వివాహ సమయంలో రూ.5లక్షలు కట్నం ఇవ్వగా మరింత కట్నం కోసం భర్త, అత్తింటివారు వేధింపులకు గురిచేశారు. శారీరకంగా, మానసికంగా వేధించటంతో పాటు చిత్రహింసలకు గురిచేస్తుండటంతో భరించలేని పావని పలు పర్యాయాలు పుట్టింటికి వచ్చేసింది. పెద్దలు రాజీ చేసి కాపురానికి పంపినప్పటికీ వేధింపులు మాత్రం తగ్గలేదు. దీంతో వారం రోజుల క్రితం పావని మళ్లీ పుట్టింటికి వచ్చేసింది. అయినా మరింత కట్నం తీసుకురమ్మంటూ భర్త ఫోన్‌లో వేధింపులకు గురిచేయటంతో జీవితం మీద విరక్తి చెంది గురువారం తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న డిఎస్పీ శ్రావణ్ కుమార్, తహశీల్దార్ నారదముని మృతదేహాన్ని పరిశీలించి ఆత్మహత్యకు కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై ఇనగుదురు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పావని ఆత్మహత్యకు కారకులైన భర్త, అత్త మామలను కఠినంగా శిక్షించాలని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘం యువజన విభాగం అధ్యక్షులు పివి ఫణికుమార్ డిమాండ్ చేశారు.