కృష్ణ

వైసిపికి ప్రజలే అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, డిసెంబర్ 23: వైసిపికి ప్రజలే అండగా ఉంటారని, నాయకులు కాదని మాజీ మంత్రి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కెపి సారథి అన్నారు. వైసిపికి చెందిన పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతుందన్న సమాచారంపై వైసిపి అధిష్ఠానం ఆదేశాల మేరకు సారథి గురువారం రాత్రి నుండి కూచిపూడిలో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చలు జరిపి కల్పన వెంట ఏ ఒక్క కార్యకర్తా వెళ్లకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కల్పన తో పాటు మొవ్వ మండలం నుండి ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ వెళ్లకుండా చక్రం తిప్పి సఫలీకృతులయ్యారు. తొలుత మండలం నుండి సర్పంచ్‌లు, ఎంపిటిసిలు టిడిపిలో చేరేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జరిగింది. వైసిపి మండల అధ్యక్షుడు రాజులపాటి రాఘవరావు కార్యాలయంలో సారథి విడివిడిగా చర్చలు జరిపి వారికి భరోసా ఇవ్వటంతో శుక్రవారం కల్పనతో పాటు ఒకరిద్దరు మినహా మొవ్వ మండలం నుండి ముఖ్య నాయకులెవ్వరూ టిడిపిలో చేరలేదు.

శ్రీరామకృష్ణ నాట్య మండలి సేవలు ప్రశంసనీయం
మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 23: ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దుతున్న శ్రీరామకృష్ణ నాట్యమండలి సేవలు ప్రశంసనీయమని జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు అన్నారు. శ్రీరామకృష్ణ నాట్య మండలి 40వ వార్షికోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మున్సిపల్ ప్రధాన పార్కులో నిర్వహించిన వేడుకలకు సుబ్బారావు ముఖ్య అతిథిగా కళారంగం అభివృద్ధికి మండలి చేస్తున్న సేవలను ప్రశంసించారు. 40 యేళ్లుగా ఎన్నో పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తుండడం అభినందనీయమన్నారు. భావతరంగిణి సంపాదకుడు భవిష్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, రంగస్థల నటులు బి పుల్లారావు, అంబూరు మణికంఠ శర్మ, జె జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత విజయవాడకు చెందిన ఎల్ సుస్మిత ప్రదర్శించిన కూచిపూడి నృత్యాంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.