కృష్ణ

చట్టాల పట్ల విద్యార్థులకు కనీస అవగాహన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన, జనవరి 5: చట్టాల పట్ల విద్యార్థులు కనీస అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి పిఆర్ రాజీవ్ కోరారు. గురువారం నందమూరు వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజీవ్ మాట్లాడుతూ పురుషులతో పాటు మహిళలకు కూడా అన్ని రంగాల్లో అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలన్నారు. ర్యాగింగ్ వంటి విష సంస్కృతి బారిన పడి జీవితాలను పాడు చేసుకోవద్దని కోరారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయ సేవలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కూనపరెడ్డి శ్రీనివాసరావు, న్యాయవాది చీలి ముసలయ్య, కళాశాల కరస్పాండెంట్ గుడివాడ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

ముగ్గురు న్యాయవాదులకు ఎపిపి పదవులు
మచిలీపట్నం (లీగల్), జనవరి 5: పట్టణానికి చెందిన ముగ్గురు న్యాయవాదులను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జివో నెం. 14, 15, 16లను గురువారం జారీ చేసింది. గోవాడ నిరీక్షణరావు 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, మరో న్యాయవాది వనె్నంరెడ్డి శ్రీనివాసరావు ఎస్‌సి, ఎస్‌టి కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, 10వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. లంకే వెంకటేశ్వరరావును మొదటి అదనపు జిల్లా కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తిరుమలగిరి దేవస్థానం మాజీ చైర్మన్ కనపర్తి ఆత్మహత్య

వత్సవాయి, జనవరి 5: దేచుపాలెం గ్రామ మాజీ సర్పంచ్, తిరుమలగిరి దేవస్థానం మాజీ చైర్మన్ కనపర్తి హనుమంతరావు (70) గురువారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలో తీవ్ర సంచలనం కల్గించింది. ఆర్థిక లావాదేవీలు, ఇసుక వ్యవహరాలే ఆయన ఆత్మహత్యకు కారణం అయి ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా నియోజకవర్గంలో అందరికీ సుపరిచితుడైన హనుమంతరావు రెండు పర్యాయాలు గ్రామ సర్పంచ్‌గా, ఒక పర్యాయం దేవస్థానం చైర్మన్‌గా సేవలు అందించారు. అతని భార్య గత ఏడాది మృతి చెందగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హనుమంతరావు మృతికి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, ఎంఎల్‌సి తొండపు జనార్థన్, మాజీమంత్రి నెట్టెం రఘురాం, మండల తెదేపా అధ్యక్షుడు జొన్నలగడ్డ రాథాకృష్ణమూర్తి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. పలువురు నాయకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.