కృష్ణ

పోర్టుతోనే బందరుకు మనుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 8: పోర్టు నిర్మాణంతోనే బందరు మనుగడ సాగించగలదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోర్టును మరుగన పడేశారని, సుదీర్ఘ కాల పోరాటం ద్వారా పోర్టును సాధించుకోవడం జరిగిందన్నారు. స్థానిక 27వ వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ పోర్టు నిర్మాణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంత ముఖ చిత్రం మారనుందన్నారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములను ఇచ్చేందుకు రైతులు సంసిద్ధత వ్యక్తం చేస్తున్న తరుణంలో ప్రతిపక్షాలు స్వార్ధ రాజకీయాల కోసం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా ప్రతిపక్షం పని చేస్తుందన్నారు. డెల్టా ప్రాంత భూములను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టును కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు రికార్డు సమయంలో ప్రాజెక్టును పూర్తి చేసి డెల్టాలో 10.75లక్షల ఎకరాలకు సాగునీరు అందించి పంటలను కాపాడినట్లు చెప్పారు. పోలవరం నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని, 2019 నాటికి అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. తొలుత చిన్నారులకు అన్నప్రాసన చేయించారు. గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. నూతనంగా మంజూరైన పెన్షన్‌లు, రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ కాశీ విశ్వనాధం, కమిషనర్ జస్వంతరావు, టిడిపి నాయకులు కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), కౌన్సిలర్ సనకా ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ సాహితీవేత్త భట్రాజు ఇకలేరు
మచిలీపట్నం (కల్చరల్), జనవరి 8: ప్రముఖ సాహితీవేత్త, కవి, రచయిత భట్రాజు శ్రీనివాస గాంధీ (69) ఆదివారం తెల్లవారుఝామున గుండె పోటుకు గురై మృతి చెందారు. ఆయన మరణం సాహితీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ముదినేపల్లి మండలం అల్లూరు గ్రామంలో జన్మించిన శ్రీనివాస గాంధీ పెడన, బొమ్మినంపాడు, మాజేరు, వెలవడం తదితర జెడ్పీ హైస్కూల్స్‌లో తెలుగు భాషోపాధ్యాయుడిగా సేవలు అందించారు. అక్షర కృష్ణ వయోజన విద్య మాస పత్రికకు సబ్ ఎడిటర్‌గా సేవలు అందించారు. ఓ ప్రముఖ తెలుగు దిన పత్రికకు సన్నాయి నొక్కులు పేరుతో రాసిన వ్యాసికలు విశేష ప్రాచుర్యం పొందాయి. జేగంటలు చలన చిత్రానికి ఆయన రాసిన పాటలు ప్రేక్షకుల మనోఫలకంపై చెరగని ముద్ర వేసుకున్నాయి. అలతి అలతి పదాలతో పద్యాన్ని, గద్యాన్ని, పాటను నడిపిన ఘనుడు. ప్రతిబింబం, ఏదో మాటవరుసకు, ఇదీ సంగతి, గో మాత శతకం, అమ్మ శతకం తదితర పుస్తకాలను ఆయన రాశారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, సాహితీ ప్రియులు బండి నాగలక్ష్మి, పి వెంకటేశ్వరరావు, ఎ పోతరాజు తదితరులు ఈడేపల్లిలోని ఆయన నివాసం వద్ద శ్రీనివాస గాంధీ భౌతికకాయాన్ని దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. సోమవారం ఉదయం 10గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.