కృష్ణ

జగన్... నీచ రాజకీయాలు మానుకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 8: ప్రజల్లో ఉనికిని కాపాడుకునేందుకు ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి దిగజారుడు రాజకీయ విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు విమర్శించారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా హుందా కోల్పోయి అర్ధరహితమైన విమర్శలతో ప్రజల్లో చులకనవుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలినంత మాత్రాన ప్రజలు హర్షించరన్న విషయాన్ని జగన్ గుర్తు పెట్టుకోవాలన్నారు. రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఏ మాత్రం నిరాశ పడకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడుపై జగన్ చేస్తున్న విమర్శలను అర్జునుడు తీవ్ర స్థాయిలో తిప్పి కొట్టారు. జగన్ ఎక్కడకు వెళ్లినా టిడిపి ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమంటూ చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. బంగాళాఖాతంలో కలిసిపోయేది తమ ప్రభుత్వం కాదని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్న విషయాన్ని జగన్ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇప్పటికే వైకాపాకు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు, నాయకులు జగన్ నాయకత్వానికి విసిగి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయాన్ని జగన్ మర్చిపోయి ఇటువంటి విమర్శలు చేస్తున్నారన్నారు. 2019 ఎన్నికల నాటికి వైఎస్‌ఆర్ సిపిలో జగన్ తప్ప మరెవ్వరూ ఉండరన్నారు. ఎన్నికల మానిఫెస్టోలో రైతు రుణాలను మాఫీ చేస్తామని ధైర్యంగా చెప్పలేని జగన్ నేడు చంద్రబాబు నాయుడు రూ.11వేల 800 కోట్లు రైతు రుణాలను మాఫీ చేసి ప్రతిపక్షానికి మింగుడు పడకుండా చేశారన్నారు. అలాగే రూ.9వేల కోట్లు డ్వాక్రా రుణాలను మాఫీ చేశామని, ఇప్పటికే రూ.6వేల కోట్లు డ్వాక్రా మహిళల ఎకౌంట్లలో జమ చేసిన విషయాన్ని అర్జునుడు గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పలు కార్పొరేషన్‌ల ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్‌ను వెలికి తీసేలా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే నిరుద్యోగ భృతి కల్పించేందుకు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాన్ని పరిశీలించేందుకు ఐఎఎస్ అధికారులతో కమిటీని వేయడం జరిగిందన్నారు. ఈ కమిటీ నివేదికల ఆధారంగా నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి గ్రామసభల ద్వారా ప్రభుత్వానికి సానుకూల వాతావరణం కనిపిస్తోందన్నారు. నివేశన స్థలాలు తప్ప మరే ఇతర సమస్యలు జన్మభూమిలో కనిపించడం లేదన్నారు. నివేశన స్థలాల సమస్యను కూడా త్వరలోనే అధిగమిస్తామన్నారు. విశాఖపట్నం జిల్లాలో ఒకే రోజు 48వేల మందికి ఒకేసారి 28 కౌంటర్ల ద్వారా 18వేల మందికి పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. అదే విధానాన్ని అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఎక్కడెక్కన ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎంత మేర భూమిని కొనుగోలు చేయాల్సి వస్తుంది అనే అంశంపై అధ్యయనం జరుగుతుందన్నారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ నివేశన స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, టిడిపి సీనియర్ నాయకుడు బూరగడ్డ రమేష్ నాయుడు, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, ఎఎంసి మాజీ చైర్మన్ మరకాని పరబ్రహ్మం, టిడిపి జిల్లా కార్యదర్శులు అక్కుమహంతి రాజా, పివి ఫణి కుమార్ పాల్గొన్నారు.