కృష్ణ

కొండపావులూరులో ఎన్‌డిఆర్‌ఎఫ్ బెటాలియన్ భవన సముదాయానికి శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, జనవరి 9: గన్నవరం మండలం కొండపావులూరు గ్రామంలో ఎన్‌డిఆర్‌ఎఫ్ 10వ బెటాలియన్ నూతన భవన సముదాయానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈసందర్భంగా ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. రేడియాలజీ, బయాలజీ, న్యూక్లియర్, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు చేపట్టే నివారణ, రక్షణ చర్యలు ప్రదర్శించారు. ఇవి సభికుల్ని విశేషంగా ఆకర్షించాయి. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గౌరవందనం స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్‌నాథ్ సింగ్, ఎం వెంకయ్య నాయుడు, వై సుజనా చౌదరిలను దుశ్శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ఎన్‌డిఆర్‌ఎఫ్ డిజి పచానంద్ ఆహూతులకు జ్ఞాపికలు అందజేశారు. సర్వే నెంబర్-6లోని 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల వ్యయంతో నూతన భవన సముదాయం నిర్మిస్తున్నట్లు డిజి తెలిపారు. కార్యాలయ భవనాలు, నివాస భవనాలు, ప్రత్యేక శిక్షణ కేంద్రాలు నిర్మించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతులు లభించినట్లు తెలిపారు. పదో బెటాలియన్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, యానాంలలో సేవలు అందిస్తోందన్నారు. కొండపావులూరులో ఎన్‌డిఆర్‌ఎఫ్ కేంద్రం స్థాపించడం పట్ల సర్పంచ్ దేవరపల్లి కోటేశ్వరరావు, మరియమ్మ రాజ్‌నాథ్ సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అమరేంద్ర సింగ్ వందన సమర్పణ చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్డు నుండి సిఎం, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు హెలికాఫ్టర్‌లో శంకుస్థాపన ప్రాంతానికి తరలివచ్చారు. విద్యార్థినులు కూచిపూడి నృత్యాలు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చింతకాయల చినరాజప్ప, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపి కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్, ఎన్‌ఐడిఎం కమిషనర్ శేషగిరిరావు, జిల్లా కలెక్టర్ బాబు. ఎ, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, డిజిపి సాంబశివరావు, నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్, విశ్రాంత డిజిపి ఏబి వెంకటేశ్వరరావు, ఆర్డీవో రంగయ్య, తదితరులు పాల్గొన్నారు. అనంతరం హెలికాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు తరలివెళ్లారు. ఉదయం ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరి మధ్యాహ్నం 12.50 గంటలకు చేరుకున్న రాజ్‌నాథ్ సింగ్ సాయంత్రం 4 గంటలకు అదే విమానంలో ఢిల్లీకి తరలివెళ్లారు.