కృష్ణ

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 17: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు విభాగాలను పరిశీలించిన ఆమె వైద్యుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మచిలీపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన ఎంతో మంది ఈ ఆస్పత్రికి వస్తున్నారన్నారు. వైద్య సేవలు అందించడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదన్నారు. వైద్య రంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిన విషయాన్ని వైద్యులు గుర్తించాలన్నారు.
గ్యాస్ వెలికితీత వల్ల రాబోయే ప్రమాదాలను నివారించాలి
బంటుమిల్లి, జనవరి 17: ప్రభుత్వం ఓఎన్‌జిసి ద్వారా కృష్ణా, గోదావరి పరీవ్రాహక ప్రాంతంలో సహజ వాయువుల వెలికితీత, సెల్ గ్యాస్ డ్రిల్లింగ్ ద్వారా రాబోయే ప్రమాదాలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓఎన్‌జిసి డ్రిల్లింగ్ జరుగుతున్న గ్రామాల ప్రతినిధులతో, స్థానిక ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్యాస్ తీయడం వల్ల పొల్యూషన్ ఏర్పడి దాని ప్రభావం పొలాలపై, ప్రజలు, పశువులపై, ప్రకృతిపై ఉంటుందన్నారు. అభివృద్ధి పేరుతో విధ్వంసం సృష్టిస్తుందని, వెంటనే షెల్ గ్యాస్ తీయడాన్ని నిరోధించాలని ఆమె డిమాండ్ చేశారు. విష పూరిత వాయువుల ద్వారా వచ్చే వ్యాధులను ఆమె వివరించారు. షెల్ గ్యాస్‌ను రాష్ట్రంలో ఏడు ప్రాంతాలలో తీస్తున్నారన్నారు. ఇందులో పశ్చిమగోదావరిలో రెండు, తూర్పుగోదావరిలో రెండు ప్రాంతాలు, కృష్ణా జిల్లా మండవల్లి మండలం కానుకొల్లు శివారు మోదుమూడి, కృత్తివెన్ను మండలం కొమళ్లపూడి గ్రామాలలో సెల్ గ్యాస్ తవ్వకాలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని, దీన్ని ఆదిలోనే అడ్డుకోవల్సిన అవసరం ఉందన్నారు. వీటిపై ఈనెల 22న ఉదయం 11గంటలకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో క్లాత్‌మర్చంట్స్ హాలులో గ్యాస్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ సభ జరగనున్నదని, సిపిఐ పిలుపు మేరకు జరిగే ఈ సభలో ఈ ప్రాంతంలోని ఓఎన్‌జి తవ్వకాలు జరిగే గ్రామాల ప్రజలు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. గ్యాస్ తవ్వకాలకు ముందు ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సి ఉందని, అలాంటిది ఏమి చేయకుండా అప్రజాస్వామిక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అమెరికాలోని 30 రాష్ట్రాలలో గ్యాస్ డ్రిల్లింగ్‌ను అక్కడి ప్రజలు వ్యతిరేకించారన్నారు. దీని వలన 2కోట్ల నుండి 6కోట్ల గ్యాలన్ల నీటిని డ్రిల్లింగ్‌కు వాడతారని, డ్రిల్లింగ్ వలన మిథేన్ గ్యాస్ ఉత్పత్తి అవుతుందని, దీని వలన అనేక జబ్బులు వ్యాపిస్తాయన్నారు. దీన్ని ఇప్పటికైనా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. షెల్ గ్యాస్ డ్రిల్లింగ్ వలన సెకన్‌కు 36 గ్రాములు మిథేన్ వాయువు ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యుడు మోదుమూడి రామారావు, రైతు సంఘం నాయకులు తుమ్మా చినకొండయ్య, బళ్లా రాధాకృష్ణ, ఎస్ రవి, సూరత్ సురేష్‌బాబు, పోతురాజు, తిరుమాని శ్రీనివాసరావు, మాదాసు వెంకటేశ్వరరావు, చినపాండ్రాక సర్పంచ్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.