కృష్ణ

కెసిపి చెరకు కటింగ్, రవాణాతో రైతులకు ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జనవరి 19: మొవ్వ మండలం గూడపాడు గ్రామానికి చెందిన గొర్రెపాటి సురేష్ వ్యవసాయ భూమిలో సాగుచేసిన చెరకు పంటను గురువారం చల్లపల్లి కెసిపి చెక్కెర కర్మాగారం ఆధ్వర్యంలో యంత్రాలతో కటింగ్ ప్రారంభించారు. తొమ్మిది ఎకరాలలో సాగుచేసిన 2003వి/46, 87ఎ/298 రకాలను రైతు సురేష్ సాగు చేసినట్లు ప్రాంతీయ విస్తరణాధికారి వి శ్రీనివాసరావు తెలిపారు. రోజుకు ఐదు ఎకరాల వంతున చెరుకు కటింగ్‌చేసి ఫ్యాక్టరీకి నేరుగా రవాణా చేసే సౌకర్యాన్ని రైతుకు కల్పిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఏడాది టన్నుకు రూ.2,600 చెల్లిస్తున్నట్లు తెలిపారు. యాంత్రిక సాగుకు అనుగుణంగా చెరకు సాగుచేస్తే తమ యాజమాన్యం రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందచేస్తుందన్నారు. ఖరీఫ్‌గా సాగుచేసే వరి, రబీగా సాగుచేసే మినుము పైరుకు చీడపీడలు, వాతావరణ ప్రతికూలత కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ సమస్యను అధిగమించేందుకు కెసిపి యాజమాన్యం అందచేసే సబ్సిడీలు, బోనస్‌లు అందుకునేందుకు చెరకు సాగుకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన సూచించారు. ఈ ఏడాది చల్లపల్లి ఫ్యాక్టరీ పరిధిలో 4,200 ఎకరాలలో చెరకు సాగుకు తమ సంస్థ కృషి చేస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు.
పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం: భద్రు
తోట్లవల్లూరు, జనవరి 19: పరిసరాల పరిశుభ్రత ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని, ప్రధానమంత్రి కలలు కన్న స్వచ్ఛ భారత్ సాకారమవుతుందని స్మార్ట్ విలేజ్ అధికారి, తహశీల్దార్ జి భద్రు అన్నారు. స్థానికంగా ప్రథమంగా తడిచెత్త, పొడిచెత్త సేకరణకు ఎంపిక చేసిన 3వ వార్డులో ప్రజలకు రూ.34వేల విలువగల ప్లాస్టిక్ బక్కెట్లు(డస్ట్‌బిన్లు) పంపిణీ చేశారు. వార్డు సభ్యుడు, ఉపసర్పంచ్ చిరుమామిళ్ళ మోహన్‌మంజు ఇంటివద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తహశీల్దార్ జి భద్రు మాట్లాడుతూ గ్రామంలో 3వ వార్డులో మొదలైన చెత్త సేకరణ మిగిలిన వార్డులకు ఆదర్శం కావాలన్నారు. ఎంపిడివో పద్మసుధ మాట్లాడుతూ ఇంటిలో వచ్చిన చెత్తా చెదారాలను మహిళలు రోడ్లపై వేయకుండా క్రమశిక్షణతో డస్ట్‌బిన్నుల్లో వేసి గ్రామపరిశుభ్రతకు దోహద పడాలని అన్నారు. సర్పంచ్ చిరుమామిళ్ళ ఉమాదేవి మాట్లాడుతూ కుళ్లిపోయే చెత్తకు ఆకుపచ్చ డస్ట్‌బిన్, పొడి చెత్తకు ఎరుపు డస్ట్‌బిన్ అందిస్తున్నామని, ప్రజలు ఈపద్ధతిని పాటించి ప్రతిరోజు వచ్చే గ్రీన్ అంబాసిడర్‌కు అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిరుమామిళ్ళ మోహన్‌మంజు, ఈవోపిఆర్‌డి అరుణకుమారి, కార్యదర్శి డి రాణి, గ్రామ టిడిపి అధ్యక్షుడు నెక్కలపూడి మురళీ, డాక్టర్ గనే్న సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.