కృష్ణ

స్వైన్ ఫ్లూపై యుద్ధానికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 20: పొరుగు రాష్టమ్రైన హైదరాబాద్ నగర వాసులను బెంబెలెత్తిస్తున్న స్వైన్ ఫ్లూ కృష్ణాజిల్లా వాసులను సైతం వణికిస్తోంది. ఇటీవల సంక్రాంతి సెలవుల నిమిత్తం హైదరాబాద్ నుండి అత్యధిక మంది జిల్లాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా స్వైన్ ఫ్లూ జిల్లా వాసులకు పెనుభూతంగా మారింది. స్వైన్ ఫ్లూ బారిన పడి హైదరాబాద్‌లో మరణాలు కూడా సంభవించటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారికంగా ఒక కేసు కూడా నమోదు కాకపోయినా స్వైన్ ఫ్లూ ప్రమాదం మాత్రం జిల్లాకు పొంచి ఉందనే చెప్పాలి. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గత వారం రోజులుగా చలి తీవ్రత బాగా పెరిగింది. దీంతో ప్రజల ఆరోగ్య పరిస్థితుల్లో కూడా కొంత మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరాన్ని స్వైన్ ఫ్లూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. హైదరాబాద్‌లో అత్యధికంగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావటం, ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున జిల్లాలోని బంధుమిత్రుల ఇళ్లకు వచ్చి వెళ్లటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అంటువ్యాధిగా భావించే స్వైన్ ఫ్లూ జిల్లా వాసులకు కూడా సోకే ప్రమాదం ఉందని తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ ఆ దిశగా నివారణ చర్యలకు నడుం బిగించింది. జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితో పాటు నూజివీడు, గుడివాడ, అవనిగడ్డ, చల్లపల్లి, గూడూరు, జగ్గయ్యపేట, ఉయ్యూరు, కంకిపాడు, గన్నవరం, కైకలూరు, విస్సన్నపేట, మైలవరం, తిరువూరు తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక వార్డులను సిద్ధం చేశారు. అలాగే నోడల్ అధికారులను కూడా నియమించారు. వ్యాధి నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా గ్రామ గ్రామానా ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు పారా మెడికల్ సిబ్బందిని రంగంలోకి దించారు. ఇంటింటి సర్వే ద్వారా జ్వరపీడితులను గుర్తించి వారికి స్వైన్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మచిలీపట్నంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఇప్పటికే హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. సంక్రాంతి సెలవుల నిమిత్తం హైదరాబాద్ నుండి ఈ ప్రాంతానికి వచ్చి వెళ్లిన వారి గృహస్తులను ప్రత్యేకంగా గుర్తించి రక్తసేకరణ చేస్తున్నారు. గత యేడాది స్వైన్ ఫ్లూ జిల్లా వాసులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. అధికారికంగా ఒక కేసు కూడా నమోదు కాకపోయినా స్వైన్ ఫ్లూ లక్షణాలతో అత్యధిక మంది ప్రైవేట్ వైద్యశాలల్లో చికిత్స చేయించుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు లేక ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాధి నివారణకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. మళ్లీ ఆ పరిస్థితులు రాకుండా చూడాలని జిల్లా వాసులను ముక్త కంఠంతో కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నారు గాని వ్యాధి నిర్ధారణకు అవసరమైన పరీక్షలు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రైవేట్ వైద్యులను సంప్రదించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్వైన్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ పరీక్షను తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చేస్తున్నారు. దీన్ని విజయవాడ నగరానికి అందుబాటులోకి తీసుకువస్తే కొంత వెసులుబాటు ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖాధికారులే పేర్కొంటున్నారు.
ఇలావుండగా స్వైన్ ఫ్లూ పట్ల భయపడాల్సిన పనిలేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎం కామేశ్వర ప్రసాద్ శుక్రవారం ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. ఇప్పటి వరకు ఒక కేసు కూడా నమోదు కాకున్నా అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు. మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి నోడల్ ఆఫీసర్‌గా డా. జగదీష్, నూజివీడు ఏరియా ఆస్పత్రికి డా. శ్రీకాంత్, గుడివాడకు డా. సత్యనారాయణను నియమించినట్లు తెలిపారు. అలాగే 14 కమ్యూనిస్టు హెల్త్ సెంటర్లకు ఆయా మెడికల్ సూపరింటెండెంటర్లను నోడల్ ఆఫీసర్లుగా నియమించినట్లు తెలిపారు. స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలని ఆయన జిల్లా వాసులకు విజ్ఞప్తి చేశారు.

వివాదస్పద భూములను పరిశీలించిన జేసీ
నందివాడ, జనవరి 20: వివాదస్పందంగా మారిన ఇలపర్రులో వ్యవసాయపరపతి సంఘం భూములను జిల్లాజాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు శుక్రవారం పరిశీలించారు. చేపల చెరువులుగా ఉన్న ఈ భూములు భూస్వాముల ఆక్రమణలోఉన్నాయని, గుడివాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ సోసైటీకి చెందిన కొంతమంది సభ్యులుప్రతి రోజూ గుడివాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసనలతోనిరవధిక నిరాహర దీక్ష చేస్తున్నారు. దీనిపై స్పందించిన జేసీ వివాదస్పదమైన ఇలపర్రులోని సొసైటీ భూములు 165 ఎకరాలను ఆయన పరిశీలించారు. ఈ చేపల చెరువులోభూములకు సంబంధించి హక్కు పత్రాలు ఏమైనా ఉన్నాయా అని చేపల చెరువులు సాగు చేస్తున్న రైతులను అడిగారు. సొసైటీ సభ్యులు తమకు ఈ భూములు ఎప్పుడో ఆమ్మివేశారని, దానికి సంబంధించిన హక్కు పత్రాలు ఉన్నాయన్నారు. సొసైటీ సభ్యులు మాత్రం తాము ఈ భూములను విక్రయించలేదని, ఈ భూములు వ్యవసాయ భూములుగా ఉన్నప్పుడు బుడమేరు వరదకు పంట పొలాలు తరచూగా మునిగిపోవడంతో తాము సరిగా సాగుచేసే వాళ్లం కాదని, దీంతోభూములు ఖాళీగా ఉండటంతోవారు ఆక్రమించుకున్నారన్నారు. అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఈ భూములకు చేపల చెరువుసాగుదారులు హక్కుపత్రాలు పొందారని జేసీకి తెలిపారు. ఆయన ఇరు వర్గాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ ఇవి ప్రభుత్వ భూములు కనుక ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిరుపేదలకు పంపిణీ చేయాలని జేసీకి తెలిపారు. అనంతరం చేపల చెరువులు పెంపకం, మేత వివరాలు, రవాణా వంటి అంశాలను రైతులను అడిగి జేసీ తెలుసుకున్నారు. ఆయన వెంట గుడివాడ ఆర్డీఓ ఎం.చక్రపాణి, తహాశీల్దారు బి. సాయి శ్రీనివాస నాయక్, ఆర్‌ఐ రాహేలమ్మ, వీఆర్వో బ్రహ్మేశ్వరరావుఉన్నారు.