కృష్ణ

రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జనవరి 21: రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని సీనియర్ సివిల్ జడ్జి విఎస్‌ఎస్ శ్రీనివాస శర్మ అన్నారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక చల్లరాస్తా సెంటరులోని రామరాజు ఫంక్షన్ హాలులో ఆటో అండ్ టాటా మ్యాజిక్ డ్రైవర్లకు అవగాహనా సదస్సు నిర్వహించారు. మచిలీపట్నం మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ సీతాపతిరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ వాహనచోదకులు విధిగా ట్రాఫిక్ నియమ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల తమ కుటుంబ సభ్యులు వీధిపాలు అవుతారన్న విషయాన్ని ప్రతి ఒక్క వాహనచోదకుడు గుర్తించాలన్నారు. రానున్న రోజుల్లో చట్టాలు మరింత కఠినం కానున్నాయన్నారు. విధిగా తమ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవటంతో పాటు డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నారు. ట్రాఫిక్ డియస్‌పి హుస్సేన్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక ప్రమాదాలు ఆటో, ద్విచక్ర వాహనాల వల్లే జరుగుతున్నాయన్నారు. సక్రమంగా రికార్డులు పాటించని వారిపై తాము ఎన్ని కేసులు పెట్టినా ఫలితం ఉండటం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
నాగాయలంకలో విద్యుత్ శాఖ
విజిలెన్స్ దాడులు
నాగాయలంక, జనవరి 21: మండలంలోని వివిధ గ్రామాల పరిధిలో శనివారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఆకస్మిక విద్యుత్ విజిలెన్స్ దాడులు నిర్వహించారు. ఈ మండలంలోని 22 పంచాయతీలలో 506 సర్వీసులను ఈ బృందం తనిఖీ చేసింది. ఈ తనిఖీలలో 32 సర్వీసులు అదనపు లోడ్‌ను వినియోగిస్తున్నట్లు గుర్తించి రూ. 80,400, రెండు అక్రమ కనెక్షన్‌లను గుర్తించి ఒక్కో దానికి రూ.9వేలు చొప్పున రూ.18వేలను అపరాద రుసుముగా విధించినట్లు స్థానిక విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు గొరిపర్తి భసవశాస్తుర్లు తెలిపారు. నూజివీడు డివిజన్‌కు చెందిన ఎడిఇలు, ఎఇలు 16 బృందాలుగా ఏర్పడి బందరు డివిజన్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు టి వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఈ దాడులు జరిగాయని ఆయన వెల్లడించారు. ఈ మండలంలో అక్రమంగా విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు తమకు అందిన సమాచారం మేరకు విజిలెన్స్ దాడులు జరిగాయని బసవశాస్తుర్లు వివరించారు.