కృష్ణ

సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి, జనవరి 24: మండల కేంద్రం మోపిదేవిలో సిఐటియు ఆధ్వర్యంలో ఆటో వర్కర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు, కార్మికులు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రవాణా ఫీజులను రద్దు చేయాలని, ఎంవి యాక్టు 2016ను విరమించుకోవాలని, ఆటో రవాణా కార్మికులపై వేధింపులు నిలిపివేయాలని, పెంచిన డీజిల్ ధరలను తగ్గించాలని, రవాణా కార్మికులకు బీమా వర్తింపు చేయాలని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సిఐటియు దివి డివిజన్ కార్యదర్శి శీలం నారాయణరావు తహశీల్దార్ ఎంవి సూర్యనారాయణకు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకుడు యద్దనపూడి మధు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆటోవర్కర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సనకా సుబ్బారావు, ఉపాధ్యక్షుడు ఉప్పాల యానాది, కార్యదర్శి మోర్ల వెంకటేశ్వరరావు, సభ్యులు సాయిబాబు, కె శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రేపు నిమ్మకూరుకు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ రాక
పామర్రు, జనవరి 24: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దివంగత నేత ఎన్టీ రామారావు స్వగ్రామమైన పామర్రు మండలం నిమ్మకూరు గ్రామాభివృద్ధికి గత ఏడాది రాజ్యసభ సభ్యునిగా ఉన్న సమయంలో వారి కుమారుడు, నటుడు నందమూరి హరికృష్ణ తన ఎంపి నిధులు ద్వారా సుమారు రూ.3కోట్లతో రోడ్లు, డ్రైనేజి, విద్యుత్ దీపాలకు వినియోగించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాభివృద్ధిని కాంక్షించిన హరికృష్ణకు ఈనెల 26 రిపబ్లిక్‌డే రోజున సాయంత్రం 4గంటలకు నిమ్మకూరు గ్రామంలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా గ్రామస్థులు, బంధు, మిత్రులు పౌర సన్మానం ఏర్పాటు చేశారు. అదే రోజు ఉదయం 9గంటలకు నిమ్మకూరులో హరికృష్ణ మేనల్లుడు కుదరవల్లి సోమశేఖర్ పెద్ద ఎత్తున ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సాయంత్రం 4గంటలకు జరిగే కార్యక్రమంలో నందమూరి హరికృష్ణతో పాటు నటుడు, వారి కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, రాజ్యసభ మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు అన్ని రాజకీయ పక్షాల నేతలు పాల్గొంటున్నట్లు గ్రామ కమిటీ మంగళవారం తెలిపింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ కూడా గురువారం నిమ్మకూరు రానున్నారు.

పోత నూర్పిడి యంత్రంతో రూ.1000 ఆదా
కూచిపూడి, జనవరి 24: ప్రభుత్వం సబ్సిడీపై అందచేసిన పోత, నూర్పిడి యంత్రం రైతులకు ఎంతో ఉపయోగకారిగా మారింది. గంటన్నరకు ఒక ఎకరం వరి పంటను నూర్పిడి చేసి పోత మిషన్‌కు రూ.2,100 చెల్లించాల్సి ఉంది. సంప్రదాయబద్ధంగా నూర్పిడి చేస్తే రూ.4వేలు ఖర్చు అవుతుండగా ఈ యంత్రం ద్వారా రైతులకు రూ.1900లు ఆదా అవుతాయని పాలంకిపాడుకు చెందిన బొల్లా కల్యాణ లక్ష్మి తెలిపారు. గూడూరు మండలం డోకిపర్రుకు చెందిన నత్త జితేంద్రకు వ్యవసాయశాఖ రూ.లక్షా 75వేల విలువుగల ఈ యంత్రాన్ని కేవలం రూ.75వేలకే అందచేసిందని తెలిపారు. ఈ యంత్రం ద్వారా తొమ్మిది మంది కూలీలు రోజుకు ఐదు ఎకరాలకు పైగా నూర్పిడి చేయటం జరుగుతుందన్నారు.
ధాన్యం ట్రాక్టర్ కింద పడి వ్యక్తికి తీవ్రగాయాలు
మోపిదేవి, జనవరి 24: మండల కేంద్రం మోపిదేవిలో స్థానిక పోస్ట్ఫాసు వైపు నుండి ధాన్యం లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్‌ను ఇండియన్ గ్యాస్ డెలివరీ వ్యక్తి కొక్కిలిగడ్డ వాసు (20)తన ద్విచక్రవాహనంపై ఉండి పట్టుకోవటంతో ట్రాక్టర్ వెనుక చక్రం కింద పడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే 108 వాహనంపై మచిలీపట్న వైద్యశాలకు తరలించారు. అవనిగడ్డ ఎఎస్‌ఐ జి రామారావు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.