కృష్ణ

10 వేల నివేశన స్థలాల పంపిణీ లక్ష్యం: వంశీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవర: తెలుగుదేశం పార్టీ పటిష్టతకు గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ పిలుపునిచ్చారు. గన్నవరం మండల టిడిపి విస్తృతస్థాయి సమావేశం మంగళవారం పార్టీ అధ్యక్షుడు పడమట సురేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీ మాట్లాడుతూ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు జరుపుతున్నామని, పేదలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మార్చి నెలలో 10 వేల నివేశన స్థలాలు పేదలకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వంశీ పేర్కొన్నారు. ఎంపిపి పట్రా కవిత మాట్లాడుతూ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ప్రభావవంతమైన కమిటీలు ఎన్నుకుని 2019 సారస్వత ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పెట్టుకుని పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా ఎంపికైన ఎఎంసి ఛైర్మన్ పొట్లూరి బసవారావు, వైస్ ఛైర్మన్ కొండేటి ఏడుకొండలు, డైరెక్టర్లను మండల పార్టీ ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో జడ్పీటీసీ మరీదు లక్ష్మీదుర్గ, వైస్ ఎంపిపి గొంది పరంధామయ్య, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ సుందరరావు, అధ్యక్షుడు గూడపాటి తులసీమోహన్, కార్యదర్శి దొంతు చిన్నా తదితరులు పాల్గొన్నారు.
మురుగు ముంపుముప్పు నుండి కాపాడండి
* నారాయణనగర్ వాసుల ఆందోళన
మైలవరం: నారాయణ నగర్‌ను ముంచవద్దంటూ అక్కడి స్థానికులు మంగళవారం స్థానిక పంచాయితీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మైలవరం పట్టణంలోని అంతర్భాగమైన నారాయణ నగర్‌కు ముంపు సమస్య ఉందని పక్కా డ్రైన్లు కాలువలు నిర్మించి సమస్యను పరిష్కరించి నారాయణ నగర్‌ను కాపాడాలని గత కొన్ని రోజులుగా అక్కడి స్థానికులు ఆందోళన నిర్వహిస్తున్నారు. మంగళవారం కూడా వారు స్థానిక పంచాయితీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మైలవరం పట్టణంతోపాటు ఎగువ నుండి వచ్చే మురుగు నీరు, వరద ఆసాంతం పీతురు కాలువ గుండా మైలవరం దిగువనున్న బుడమేరులో కలవాల్సి ఉంది. కానీ పీతురు కాలువ దిగువన ఆక్రమణలకు గురవటంతో మురుగు, వరద ఆసాంతం దిగువనున్న నారాయణ నగర్‌పై పడి నివాసాలకు ఆటంకం ఏర్పడుతోందని దీని నివారణకు పక్కా డ్రైన్లు, కాలువలను నిర్మించి మురుగును బుడమేరులో కలపాలని వారు డిమాండ్ చేశారు. పంచాయితీ అధికారుల హామీతో ఆందోళన విరమించారు. ఈకార్యక్రమంలో సీపీఎం నేతలు సాల్మన్‌రాజు, జానీ, పార్టీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

కళాకారులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న బాబు
* కైలే అనిల్‌కుమార్
కూచిపూడి, ఫిబ్రవరి 14: నాట్య క్షేత్రం కూచిపూడిని పర్యాటక కేంద్రంగా, కళా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కళాకారులు, నాట్యాచార్యులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని వైసిపి పామర్రు నియోజకవర్గ ఇన్‌ఛార్జి కైలే అనిల్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. గడపగడపకూ వైసిపి కార్యక్రమంలో భాగంగా మంగళవారం పార్టీ మండల అధ్యక్షుడు రాజులపాటి రాఘవరావు ఆధ్వర్యంలో స్థానిక పక్షులబీడులో అధికార పార్టీ వైఫల్యాలపై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి కావూరి భానుమూర్తి, పార్టీ నాయకులు చిమటా రాఘవేంద్రరావు, రాజులపాటి మురళీ తదితరులు పాల్గొన్నారు.

నోరూరిస్తున్న పుచ్చకాయలు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 14: వేసవి తాపాన్ని తీర్చే పుచ్చకాయలు మార్కెట్‌లో గుట్టలుగుట్టలుగా దర్శనమిస్తున్నాయి. బందరు మార్కెట్‌లోకి గత 15 రోజుల క్రితమే పుచ్చకాయలు వచ్చాయి. అయితే ప్రస్తుతం పుచ్చకాయల దిగుమతి అధికం కావటంతో పట్టణంలో పుచ్చకాయల దుకాణాలు వెలిశాయి. ఒకొక్కటి రూ.150 నుండి రూ.200ల వరకు ధర పలుకుతోంది. మొక్క రూ.10ల నుండి రూ.20ల వరకు అమ్మకాలు చేస్తున్నారు. వివిధ ఆకృతులలో పుచ్చకాయ ముక్కలను కోయటంతో ఆకర్షించటంతో పాటు నోరూరిస్తున్నాయి. వాతావరణంలో కూడా వేడి శాతం పెరగటంతో ప్రజలు పుచ్చకాయ ముక్కలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపుతున్నారు.

తెగుళ్లు సోకని ఎల్‌బిజి 787 రకం మినుము
తోట్లవల్లూరు, ఫిబ్రవరి 14: ఎల్‌బిజి 787 మినుముకి తెగుళ్ళు సోకలేదని వ్యవసాయాధికారిణి జరీనా అన్నారు. మండలంలోని దేవరపల్లిలో మంగళవారం పొలంపిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. రైతు జొన్నల వెంకటరెడ్డి మినుము చేనుని పరిశీలించారు. ఈ పొలంలో మినుముకి తెగుళ్ళు లేకపోవటాన్ని గుర్తించారు. ఎల్‌బిజి 787 రకం మినుము తెగుళ్ళను తట్టుకుని నిలబడిందని చెప్పారు. పెనమకూరులో అంబటిపూడి శ్రీ్ధర్ పొలంలో మినుము చేనుని కూడా పరిశీలించారు. కాగా పలువురు రైతులు తమ మినుముచేలు తెగుళ్ళతో దెబ్బతిని నష్టపోయామని, పరిహారం ఇప్పించాలని జరీనాని కోరారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే నష్టపోయిన పొలాలను నమోదుచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఈఓలు డి రఘు, ఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.