కృష్ణ

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఫిబ్రవరి 20: సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పంచాయితీలో పని చేస్తున్న కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక పంచాయితీ కార్యాలయంలో పని చేస్తున్న కార్మికులంతా సీఐటియు ఆధ్వర్యంలో పంచాయితీ కార్యాలయం ముందు కొద్ది సేపు ఆందోళన నిర్వహించిన అనంతరం పంచాయితీ కార్యదర్శికి వినతి పత్రాన్ని అందించారు. సీఐటియు నేత సాల్మన్‌రాజు మాట్లాడుతూ సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం ఇచ్చిన తీర్పును సైతం రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. అదేవిధంగా పంచాయితీ కార్మికులకు ఉద్యోగ భద్రత కరవైందన్నారు. ఆర్థికభారాన్ని తగ్గించుకునేందుకు కాంట్రాక్టు ఉద్యోగాల పేరుతో పేదల శ్రమను దోచుకుంటున్నారన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోవటం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమేనని సుప్రీం కోర్టు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. సంఘటిత కార్మికులందరికీ ఈచట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు పంచాయితీ కార్యదర్శి రఫికి వినతి పత్రాన్ని అందించారు. ఈకార్యక్రమంలో కార్మికులు, తిరుమలరావు, చంద్రరావు, ప్రసాద్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మిగులు భూములు పంపిణీ చేయాలంటూ ధర్నా

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 20: మోపిదేవి మండలం మేళ్లమర్తిలంక గ్రామంలోని మిగులు భూములను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గ్రామస్థులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ మిగులు భూములు పంపిణీ చేయాలని గతంలో అనేక సార్లు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఇప్పటికైనా తమకు నివేశన స్థలాలు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. వీరికి మత్స్యకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొల్లాటి శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు.

పామర్రు టిడిపిలో ఎటువంటి విభేదాల్లేవు
* ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన
పామర్రు, ఫిబ్రవరి 20: పామర్రు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తెలిపారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొంత మంది పార్టీలో విభేదాలు, వర్గాలు ఉన్నాయని ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశానుసారం ఎన్టీఆర్ స్వస్థలమైన పామర్రు నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసి కట్టుగా కృషి చేసే దిశగా వెళుతున్నట్లు తెలిపారు. గ్రామ గ్రామాన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా పామర్రు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, సబ్ ప్లాన్ నిధులు ఎక్కువగా విడుదల చేయాలని సిఎంను కోరినట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీటిసి పొట్లూరి శశి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మండపాక శంకరబాబు, టిడిపి మండల అధ్యక్షుడు కుదరవల్లి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.