కృష్ణ

ఓడరేవుకు భూములను త్వరగా అప్పగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 20: బందరు ఓడరేవుకు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ, అసైన్డ్ భూముల అప్పగింతపై కదలిక వచ్చింది. ప్రభుత్వ, అసైన్డ్ భూములను తక్షణమే కాకినాడ పోర్టు డైరెక్టర్‌కు అప్పగించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ బాబు.ఎ మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ (మడ) అధికారులను ఆదేశించారు. ఓడరేవు నిర్మాణానికై ప్రభుత్వ, అసైన్డ్ భూములు 3014 ఎకరాలను తక్షణమే పోర్టు డైరెక్టర్‌కు అప్పగించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ ఇటీవల ప్రభుత్వం జివో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కలెక్టర్ బాబు.ఎ సోమవారం మడ, రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. మడ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, వైస్ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, ఆర్డీవో సాయిబాబు పాల్గొనగా భూముల అప్పగింత అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో 3014 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఉన్నాయన్నారు. ఇందులో 2360 ఎకరాల ప్రభుత్వ భూమి, 654 ఎకరాలు అసైన్డ్ భూమి ఉందన్నారు. భూసమీకరణలో భూమి ఇచ్చిన రైతు కూలీలకు పెన్షన్లు త్వరగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సాగర మాల కింద ప్రతిపాదించిన రహదారులు, కొత్త రైల్వే లైన్లు మడ మాస్టర్ ప్లాన్‌లో చేర్చాలన్నారు. పల్లెపాలెం, క్యాంబెల్‌పేట గ్రామస్థులకు కాలనీలుగా ఇళ్లు కట్టించి ఎక్కడ ఇవ్వాలి అనే అంశంపై చర్చించి మ్యాప్‌లు పరిశీలించారు. బందరు పోర్టు అభివృద్ధిలో భూసమీకరణ ఎంతో ప్రాధాన్యతాంశమని, వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు.
శ్రీకాళహస్తి కాలనీలో పేదల ఇళ్ల జోలికి వస్తే
తీవ్ర పరిణామాలు
* బాధితులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే కొడాలి నాని
గుడివాడ, ఫిబ్రవరి 20: స్థానిక శ్రీకాళహస్తి కాలనీలో పేదల ఇళ్ళ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇక్కడ ఒక్క ఇల్లు తొలగించినా సహించేది లేదని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు. కాలనీలో ఖాళీగా ఉన్న ఇళ్ళస్థలాలను స్వాధీనం చేసుకుంటామంటూ రెవె న్యూ అధికారులు సర్వే చేస్తున్న నేపథ్యంలో బాధితులు ఎమ్మెల్యే కొడాలి నానిని ఆశ్రయించారు. దీంతో ఎమ్మెల్యే కొడాలి నాని కాలనీలో పర్యటించారు. బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. ఆర్డీవో ఎం చక్రపాణిని కలిసి స్థలాలను వెనక్కి తీసుకోవద్దని వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ ఖాళీస్థలాల్లో ఇళ్ళు నిర్మించుకునేందుకు మూడు నెలల గడువు ఇవ్వాలని, ప్రభుత్వమే రుణం మంజూరు చేయాలన్నారు. పేదప్రజల విషయంలో ఏంచేసినా చెల్లుతుందని టిడిపి నాయకులు అనుకుంటున్నారని, బాధితులెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. 1999లో కాలనీలో లబ్ధిదారులకు స్థలాలిచ్చారని, 2005వరకు కాలనీ ముఖం చూసిన వారే లేరన్నారు. దివంగత రాజశేఖరరెడ్డి నగరబాటకు వచ్చిన సందర్భంగా కాలనీకి రూ.5.40కోట్లు మంజూరు చేశారని, దీంతో కాలనీలో రోడ్లు, వౌలిక వసతులు ఏర్పడ్డాయన్నారు. టిడిపి నేతల కన్ను ఈ కాలనీపై పడిందన్నారు. గుడివాడలో అపార్ట్‌మెంట్‌లు కట్టిస్తామని టిడిపి నేతలు చెబుతున్నారని, సామాన్య ప్రజలు రూ.50వేలు డిపాజిట్ చేసి రూ.3లక్షలు చెల్లించే పరిస్థితుల్లో లేరన్నారు. పేదల ఇళ్ళ జోలికి వస్తే సిఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడించేందుకు వెనుకాడేది లేదని ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ అడపా బాబ్జి, ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్, కౌన్సిలర్ గొర్ల శ్రీను, కోఆప్షన్ సభ్యుడు సర్దార్‌బేగ్, మాజీ కౌన్సిలర్ షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.