కృష్ణ

శ్రీ రంగనాయక స్వామికి సహస్ర కలశాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), ఫిబ్రవరి 23: స్థానిక రాబర్ట్‌సన్‌పేట శ్రీ రంగనాయక స్వామి దేవస్థానంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ యాగ సహిత సహస్ర కలశాభిషేక కార్యక్రమం గురువారంతో ముగిసింది. శ్రీ లక్ష్మీనారాయణ యాగ పూర్ణాహుతి నిర్వహించిన అనంతరం వెయ్యి కలశాల ఆవుపాలతో స్వామివారిని అభిషేకించారు. టిటిడి వేద పండితుడు అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు, ఆగమ ప్రవర వేదాంతం పార్థసారథి అనంత శ్రీనివాస దీక్షితులు, ముత్తేవి దివ్య సీతారామ శేషకుమార్, ముత్తేవి శశికాంత్ బ్రహ్మత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలను భక్తులు తిలకించారు. అనంతరం జరిగిన అన్నసమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. రాత్రి శ్రీ స్వామివారి శాంతి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. జంగాల హరనాధబాబు దంపతులు, జంగాల ప్రశాంత్, పిన్నమనేని వీరయ్య దంపతులు ఉభయ దాతలుగా వ్యవహరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అడబాల శ్రీనివాస్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
రోడ్డు ప్రమాదంలో
విద్యార్థి దుర్మరణం
పామర్రు, ఫిబ్రవరి 23: స్థానిక కొండిపర్రు అడ్డరోడ్డు వద్ద గుడివాడ-పామర్రు జాతీయ రహదారిపై పామర్రు చాట్లవానిపురానికి చెందిన చాట్ల రోహిత్ (15) అనే 10వ తరగతి విద్యార్థి గురువారం రాత్రి లారీ ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. పామర్రు జెడ్పీహెచ్‌ఎస్‌లో గురువారం విద్యార్థుల ఫేర్‌వెల్ పార్టీ ముగించుకుని ఇంటికి సైకిల్‌పై వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఎస్‌ఐ కె అభిమన్యు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వైద్యశాఖ మంత్రి వైఖరికి
చెవిలో పూలతో జనసేన నిరసన
అవనిగడ్డ, ఫిబ్రవరి 23: స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో మహిళా డాక్టర్‌ను, చిన్నపిల్లల ప్రత్యేక వైద్యులను నియమించాలని కోరుతూ జనసేన పార్టీ నేత రాయపూడి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో వైద్యశాల వద్ద చెవిలో పూలతో ధర్నా నిర్వహించారు. గత మూడు నెలల క్రితం వైద్యశాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ అవనిగడ్డకు వచ్చిన సందర్భంగా వైద్యశాలను సందర్శించి అన్ని విభాగాల వైద్యాధికారులను నియమిస్తామని హామీ ఇచ్చారు తప్పితే అమలు చేయలేదని, ఈ కారణంగా వైద్యులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ప్రజల చెవ్వుల్లో పూలు పెట్టాడని, ఆ కారణంగానే తాము చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలుపుతున్నామన్నారు. ఈ ధర్నాలో జనసేన కార్యకర్తలు ఆది రామ్మోహనరావు, రేపల్లె రాజా, ఎన్ గిరిధర నాయుడు తదితరులు పాల్గొన్నారు.

భక్తుల పెన్నిధి -బాలకోటేశ్వరుని సన్నిధి
* నేడు కల్యాణం, రేపు రథోత్సవం * నేటి నుండి వెల్వడం తిరునాళ్లు
మైలవరం, ఫిబ్రవరి 23: మండలంలోని వెల్వడంలో వేంచేసియున్న శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవాలయం స్వామి వారి కల్యాణోత్సవాలకు ముస్తాబైంది. ఎంతో మహిమాన్వితమై కోరి కొలిచే భక్తులకు ఇలవేల్పయి విరాజిల్లుతున్న శ్రీ బాలకోటేశ్వర స్వామి కల్యాణాన్ని నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వెల్వడానికి సమీపంలో ఉన్న ఈదేవాలయానికి మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులు వేలాదిగా తరలివచ్చి అక్కడి కోనేరులో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకురి మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఇందుకోసం ప్రవాసాంధ్రులు మహాశివరాత్రికి ఇక్కడికి విచ్చేసి పర్వదినాన ఆనందంగా గడుపుతారు. భక్తులకు అవసరమైన ప్రసాదాలు, మంచినీరు, ఇతరత్రా ఏర్పాట్లను వీరు పోటీ పడి నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈనెల 24న స్వామి వారి కల్యాణం, 25న రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు సైతం పెద్ద పెద్ద ప్రభలతో తరలి వచ్చి స్వామి వారికి మొక్కుబడులు చెల్లించుకుంటారు. కల్యాణాన్ని అతి వైభవంగా నిర్వహిస్తారు. రథోత్సవం సందర్భంగా తీన్‌మార్ బ్యాండు, కనకతప్పెట్లు, కోలాటం, చెక్క్భజనలు, రంగుల విద్యుత్ దీపాల అలంకరణలతో వైభవంగా రథోత్సవాన్ని నిర్వహిస్తారు. భక్తుల సౌకర్యార్థం కోనేరు వద్ద స్నానాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా జల్లు స్నానాలకు కూడా ఏర్పాట్లు చేశారు.