కృష్ణ

ఓడిఎఫ్ గ్రామాలకు కేంద్రం నుండి అత్యధిక ప్రయోజనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 20: ప్రతి గ్రామం బహిరంగ మలవిసర్జన రహిత (ఓడిఎఫ్) గ్రామంగా మారినప్పుడే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనాలు అందుతాయని కలెక్టర్ బాబు.ఎ అన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామాన్నీ ఓడిఎఫ్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. ప్రతి సమావేశంలోనూ ఓడిఎఫ్ గ్రామాలపై సమీక్షలు జరుపుతున్న ఓడిఎఫ్ గ్రామాల సంఖ్య పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో ఓడిఎఫ్ గ్రామాలపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలోని 970 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటి వరకు 416 గ్రామాలను మాత్రమే ఓడిఎఫ్‌గా ప్రకటించడం జరిగిందన్నారు. మిగిలిన 554 గ్రామాలను కూడా ఓడిఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్ది జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. ఇప్పటి వరకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు రూ.120కోట్ల మేర జమ చేసినట్లు చెప్పారు. ఓడిఎఫ్ గ్రామాలకు కేంద్రం ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుందన్నారు. లింక్ రోడ్లు, వౌలిక వసతుల కల్పనకు రూ.5లక్షలు అదనంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. జిల్లాలలో లక్షా 35వేల 378 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం కాగా 78వేల 150 నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ లబ్ధిదారులకు చెల్లింపుల్లో ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు. పది రోజుల్లో రూ.10వేల కోట్ల చెల్లింపులు జరిగాయని చెప్పారు. జిల్లాలో గ్యాస్ కనక్షన్‌ల పంపిణీని జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. 1.30లక్షల కనక్షన్‌లకు గాను 1.02లక్షల కనక్షన్‌లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య, ఆర్డీవో సాయిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ జెడి ప్రసాదరావు, డియస్‌ఓ నాగేశ్వరరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వరరెడ్డి, సిపిఓ రత్నబాబు తదితరులు పాల్గొన్నారు.

ఈదురు గాలులకు విరిగి పడిన చెట్టు
* తెగిపడిన విద్యుత్ తీగలు

తోట్లవల్లూరు,మార్చి 20: మండలంలోని వల్లూరుపాలెం వద్ద కరకట్ట పక్క పొలాల్లో విద్యుత్ స్తంభం విరిగిపడింది. ఆదివారం సాయంత్రం చిరుజల్లులు కురిసి బలమైన గాలులు వీచటంతో చెట్టు విరిగి విద్యుత్ లైన్‌పై పడింది. దీంతో చెట్టు బరువుకి విద్యుత్ స్తంభం విరిగిపోయింది. స్తంభం విరిగి తీగెలు తెగిపోవటంతో ఈ లైన్‌కింద మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని రైతులు తెలిపారు. త్వరగా విద్యుత్ లైన్‌ను బాగుచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. మండల ట్రాన్స్‌కో ఏఈ రమేష్‌బాబు వివరణ కోరగా గాలికి వల్లూరుపాలెం, గరికపర్రులో రెండు స్తంభాలు విరిగాయన్నారు. గరికపర్రులో లైన్‌ని బాగుచేశామని, వల్లూరుపాలెం లైన్‌ని కూడా బాగుచేస్తామన్నారు.