కృష్ణ

వర్షానికి తడిసిన మినుము పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదపారుపూడి, మార్చి 20: అకాల వర్షానికి మినుము పంట తడిసిపోవడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం, సోమవారాల్లో మబ్బులు పట్టివుండడం ఆదివారం ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో మండలంలోని మినుము పంట తడిసి పోవడంతో రైతుల ఆశలు అడియాశలయ్యాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దిగుబడి పడిపోయింది. వచ్చిన కొద్దిపాటి దిగుబడి వర్షానికి తడిసి పోవడంతో ఏమి చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది రైతులు పరదాలు కప్పినా గాలికి ఎగిరిపోయి తడిసిపోయాయి. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇన్‌చార్జ్ జెడ్పీ సిఇఓగా సత్యనారాయణ

మచిలీపట్నం, మార్చి 20: జిల్లా పరిషత్ ఇన్‌ఛార్జ్ ముఖ్య కార్య నిర్వహణాధికారిగా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎన్‌వివి సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ బాబు.ఎ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ సిఇఓగా వ్యవహరిస్తున్న పశు సంవర్ధక శాఖ జెడి దామోదరనాయుడు రెండు నెలలు వ్యక్తిగత సెలవు పెట్టారు. ఆయన స్థానంలో ఎస్సీ కార్పొరేషన్ ఇడి సత్యనారాయణకు కలెక్టర్ బాబు.ఎ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.

‘రాష్ట్రంలో పాలనను ఆమోదిస్తున్న అన్ని వర్గాలు’
పామర్రు, మార్చి 20: రాష్ట్రంలో టిడిపి పాలనకు అన్ని వర్గాల ప్రజలు, ప్రతినిధులు ఆమోదం తెలుపుతున్నారనటానికి రిఫరెండంగా ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే తార్కాణమని కృష్ణా జిల్లా టిడిపి అధ్యక్షుడు, నూతన ఎమ్మెల్సీగా ఎన్నికైన బచ్చుల అర్జునుడు వెల్లడించారు. సోమవారం స్థానిక టిడిపి కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ అతి త్వరలో వైసిపి దుకాణం ఖాళీ కాగలదని ఆయన జోస్యం పలికారు. కేవలం పార్టీ ఉనికి కోసం వైసిపి నేత వైఎస్ జగన్ అధికార పక్షంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ అభాసుపాలవుతున్నారని పేర్కొన్నారు. అన్ని రంగాలకు చెందిన రాష్ట్ర బడ్జెట్ నిధులు ఇంకా పూర్తిగా కేటాయింపు జరగకముందే బడ్జెట్‌ను విమర్శించటం జగన్ రాజకీయ అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ నెల 30న తాను శాసనమండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకరం చేయనున్నట్లు బచ్చుల తెలిపారు.
రంజింప చేసిన సంగీత విభావరి
మచిలీపట్నం (కల్చరల్), మార్చి 20: స్థానిక బుట్టాయిపేట చిట్టి పిళ్లారయ్య స్వామి దేవస్థానం, శ్రీ వల్లభాంబ సమేత మహాగణపతి పంచాయతన క్షేత్రం ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా సోమవారం నిర్వహించిన సంగీత విభావరి భక్తులను రంజింప చేసింది. విజయవాణి సంగీత కళాశాల సంగీత గురువు మొదిలి చంద్రశేఖర్, కంతేటి ఉషారాణి, జి హేమనందినిల వీణావాదన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హంస ధ్వని రాగంలో జలజాక్షి.., శివాష్టకం, గంధము పూయరే.. మొదలగు కీర్తనలను వీణపై మృధు మధురంగా పలికించారు. కె అనిరుద్ద్ శ్రీగణనాధ గీతాన్ని వీణపై వినిపించాడు. అనంతరం కళాశాల విద్యార్థులు భావన, దీప్తి, కిరణ్మయి, ఆశ్రీత, లలిత, వైభవ్ తదితరులు ఆలపించిన బ్రోచేవారు ఎవరురా.., రామ కోదండ రామా... తదితర కీర్తనలు ఆలపించారు. ఉదయం అమృత మృత్యుంజయ పాశుపత కన్యా పాశుపత పారాయణ, రుద్రైకాదశని, రుద్రహోమం నిర్వహించారు.